బీహార్ ఎన్నికలు.. ట్రంప్ కార్డుగా పీకే పార్టీ?

Publish Date:Oct 8, 2025

Advertisement

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు  దగ్గరపడుతున్న కొద్దీ ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య  తేడా కేవలం ఒక శాతం కంటే తక్కువేనని సర్వేలు ఉద్ఘాటిస్తున్నాయి. బీహార్ లో ఎన్డీయే, ఇండియా కూటములు మధ్య పోరు హోరాహోరీ అని పరిశీలకులు సైతం ఉదాహరణలతో విశ్లేషణలు చేస్తున్నారు.  ఈ సారి బీహార్ లో హంగ్ ఖాయమని చెబుతున్నారు. అంతేనా బీహార్ లో ఎన్డీయ, ఇండీ కూటములు సొంతంగా అవసరమైన స్థానాలను గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. హంగ్ ఖాయమనీ, దాంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పార్టీ జన సురాజ్  కీలకంగా మారుతుందనీ అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే బీహార్ లో ఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా ప్రశాంత్ కిశోర్ మద్దతు అనివార్యమౌతుందని చెబుతున్నారు. అంటే ప్రశాంత్ కిశోర్ కింగ్ మేకర్ గా, ట్రంప్ కార్డుగా మారతారన్న మాట. 

అయితే ఇటు ఇండియా కూటమి, అటు ఎన్డీయే కూటమి కూడా తమ విజయం ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  ప్రధానంగా ఎన్డీఏ కూటమి,ఇండియా కూటమి మధ్య ప్రధాన పోటీ జరిగే అవకాశం ఉంది. అలాగే చిరాగ్ పాశ్వాన్ పార్టీ,  ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. సాధారణంగా ఓట్లు చీలితే ప్రత్యర్ధి పార్టీకి దెబ్బ అని ఎన్నికల విశ్లేషకులు చెబుతారు. కాని పీకే పార్టీ అధికార పార్టీ ఓట్లనే చీల్చి దాన్నే డ్యామేజ్ చేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా పీకే పార్టీ పట్ల యువత ఆకర్షితులౌతున్నారన్నది రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న మాట.  అలాగే చిరాగ్ పాశ్వాన్ గతంలో పోటీ చేసిన స్థానాల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. ఈ సారీ కూడా అదే ఫలితం రావచ్చని అంటున్నారు.  

గత రెండు నెలలుగా ప్రచారంలో ఎన్డీఏ, ఇండీ కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. ముఖ్యంగా . రాహుల్ గాంధీ 64 లక్షల ఓట్లు చోరీ పేరుతో ఎన్నికల కమిషన్ పై ఆరోపణల అస్త్రాలు సంధించడంతో అందరి చూపు బీహార్ ఎన్నికల పై మళ్లింది. ఎన్నికల కమిషన్ మళ్లీ ఓటర్ల జాబితాను పున:పరిశీలించి కొత్తగా 14 లక్షల ఓట్లు చేరాయని ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 7.4 కోట్ల ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. అది పక్కన పెడితే రాహుల్ ఓట్ చోరీ యాత్రకు బీహార్ వ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది.   దీంతో ఇండియా కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకూ ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జేడీ కీలక నేత అయిన తేజస్వీయాదవ్ అన్న విషయంలో రెండో అభిప్రాయానికి తావు లేదన్నట్లుగా ఉన్న పరిస్థితి మారింది. ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవర్నది ఇంకా నిర్ణయించలేదంటూ కాంగ్రెస్ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఓట్ చోరి యాత్ర ద్వారా వచ్చిన మైలేజీయే ఇందుకు కారణమన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతోంది.  ఇది ఆ కూటమిలో ఒకింత అసంతృప్తికి కారణమైంది. అవసరమైతే ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఒక సందర్భంలో హెచ్చరించారు కూడా.

అది పక్కన పెడితే లోక్ జనశక్తి నాయకుడు చిరాగ్ పాశ్వాన్ బీజేపీతో పొత్తు విషయంలో నితీష్ వారసుడిగా కావాలని ఆశిస్తున్నారు. అయితే  ఇందుకు బీజేపీ అవకాశాలు లేవు. దీంతో చిరాగ్ పశ్వాన్ పీకే పార్టీ జన  సురాజ్ తో పొత్తుపెట్టుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు. జన సురాజ్ తో పొత్తుపై చిరాగ్ పశ్వాన్ సూచన ప్రాయంగా సానుకూల సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే అది బీజేపీపై ఒత్తిడి పెంచి ఎక్కువ స్థానాలను సాధించాలన్న ఎత్తుగడగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీహార్ ఎన్నికల బరిలోకి దిగడంతో పరిస్థితి మరింత రసకందాయంలో పడిందని చెప్పారు. ఆప్ కూడా రాష్ట్రంలో పొత్తులకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇక జేడీయూ విషయానికి వస్తే దాదాపు రెండు దశాబ్దాలుగా నితీష్ కుమార్ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన పట్ల, ఆయన పాలన పట్ల తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని అంటున్నారు. అది ఎన్డీయే కూటమి విజయావకాశాలపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన ఎన్డీయే కూటమిలో వ్యక్తం అవుతోంది.  సరే అది పక్కన పెడితే బీహార్ అసెంబ్లీలో 243 సీట్లకు గానూ పొత్తులో చిన్నా చితకా పార్టీలకు కేటాయించిన స్థానాలను మినహాయించి 205 స్థానాలలో చెరిసగంగా బీజేపీ, జేడీయూలు పోటీలోకి దిగాలని  యోచిస్తున్నాయి. అయితే చిరాగ్ పశ్వాన్ మాత్రం తమ పార్టీకి కూటమి పొత్తులో భాగంగా ఇవ్వజూపిన పాతిక స్థానాలతో సంతృప్తి చెందడం లేదు.

మరో వైపు ఇండియా కూటమిలోనూ సీట్ల పంచాయతీ ఓ కొలిక్కి రావడం లేదు. .వామపక్ష ఎంఎల్ పార్టీ 30 సీట్లు డిమాండ్ చేస్తున్నది. అలాగే ఆర్జేడీ, కాంగ్రెస్ ల మధ్య కూడా సీట్ల పంపిణీలో పీటముడులు పడే అవకాశం ఉందంటున్నారు.  ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి అంచనా వేస్తే పీకే కింగ్ మేకర్ గా మారతారన్న అభిప్రాయమే పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.