పిల్లి సైకిలెక్కేయడం ఖాయమేనా?

Publish Date:Jul 20, 2023

Advertisement

జగన్ ఫ్యాన్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆయన అడుగులో అడుగు వేసిన వారు.. ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ఇప్పుడు అలా దూరమయ్యే వారి జాబితాలోకి వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా చేరిపోయారా? అంటూ పరిశీలకులు ఔననే అంటున్నారు.  ఇప్పటికే జగన్ ను అధికారంలోకి తీసుకురావడం కోసం నాడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేసి ఊరూ వాడా చుట్టేసి జగన్ సోదరి షర్మిల, కుమారుడి అరెస్టును నిరసిస్తూ రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేసిన తల్లి విజయమ్మ,  అలాగే  జగన్ అంటే ప్రాణమిచ్చే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి..  ఇప్పటికే జగన్ కూ, జగన్ పార్టీకీ దూరమయ్యారు. 

తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన  మాజీ మంత్రి,  వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ వైసీపీకి గుడ్ బై చెప్పేసి సైకిలెక్కేసే ప్రయత్నంలో ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. వైసీపీ ఆవిర్భావం నుంచీ జగన్ తో నడిచి, జగన్ కోసం ఎమ్మెల్యే పదవిని, మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన వారిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.  అయితే ఇప్పుడు ఆయన జగన్ కు, జగన్ పార్టీకీ దూరం జరుగుతున్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. 

 రామచంద్రపురం నియోజకవర్గ టికెట్ విషయంలో  మంత్రి వేణుగోపాలకృష్ణ వర్సెస్ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నట్లుగా ఇరువురి మధ్యా విభేదాలు రచ్చకెక్కాయి. దీంతో  ఆ  పంచాయతీ   పార్టీ అధినేత, సీఎం  జగన్ వద్దకు చేరింది. ఆ తర్వాత ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు స్వయంగా ఫోన్ చేసినా.. ఈయన స్పందించ లేదని  పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 జగన్‌తోపాటు ఆయన తండ్రి వైయస్సార్ అంటే అత్యంత అభిమానం ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు ఇలా.. తెలుగుదేశం గూటికి చేరేందుకు సిద్ధపడుతున్నారంటే.. జగన్ తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తికి గురి కావడమే కారణమై ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.  

 పిల్లి సుబాష్ చంద్రబోస్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు ఆయన   సన్నాహాలు చేసుకుంటున్నారు.  ఆయన తనయుడు సూర్య ప్రకాష్‌ సైతం రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 

అయితే వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం వైసీపీ టికెట్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు ఇస్తామంటూ గోదావరి జిల్లాల పార్టీ ఇన్‌చార్జ్ మిథున్ రెడ్డి ఇప్పటికే ప్రకటించేశారు. దీంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆశలపై గోదావరి నీళ్లు చల్లినట్లు అయ్యింది. ఈ నేపథ్యంలో ఆదివారం అంటే జులై 16న వెంకటాయపాలెంలో తన వర్గంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ భేటీ నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ మారాలంటూ పిల్లిపై ఆయన వర్గం తీవ్ర ఒత్తిడి చేసిందనీ,  అలాగే ఆ భేటీలో వచ్చే ఎన్నికల్లో వేణుగోపాలకృష్ణ ఓటమే లక్ష్యంగా పని చేయాలనే ఓ తీర్మానం సైతం చేసినట్లు తెలుస్తోంది.  

అలాగే ఎన్నికలు ఖర్చుతో కూడుకొన్న పని అని .. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే..  ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతో  ఆయన తెలుగదేశం గూటికి చేరితే మేలన్న భావనను కూడా పిల్లి మద్దతు దారులు ఆభేటీలో వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అప్పుడు  జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న అన్ని సామాజిక వర్గాల ఓట్లు.. గంపగుత్తగా పిల్లి  ఖాతాలో పడే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఓ అభిప్రాయం సైతం ఈ భేటీలో ఆయన వర్గం నుంచి వ్యక్తమైనట్లు సమాచారం.

అదీకాక.. సీఎం జగన్ అపాయింట్‌మెంట్ సైతం ఇవ్వకపోవడం.. అలాగే జిల్లా రాజకీయాల్లో పిల్లికి సరైన ప్రాధాన్యత లేకుండా పోవడం.. ఇక కాకినాడ సీటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డితో ఘర్షణ జరగడం.. అదే విధంగా గత ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి చెల్లబోయిన వేణుగోపాల కృష్ణ గెలుపునకు పిల్లితోపాటు ఆయన వర్గం శాయశక్తులా శ్రమించి.. అన్ని విధాల సహకరిస్తే.. ఆ తర్వాత పిల్లి సుబాష్ చంద్రబోస్‌తోపాటు ఆయన వర్గాన్ని మంత్రి అండ్ కో లెక్క చేయని పరిస్థితి వచ్చిందనే ఓ విధమైన భావనలో పిల్లితోపాటు ఆయన వర్గం ఉందని... ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ మారడం సహా మరో గత్యంతరం లేదని పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ అయితే సాగుతోంది.

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.