పవన్ పై ప్రకాశ్ రాజ్ ‘సెలెక్టివ్’ విమర్శలు!?

Publish Date:Apr 29, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై నటుడు ప్రకాష్ రాజ్  మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు  సెలెక్టివ్ గా ఉంటున్నాయని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్  కొన్ని అంశాలపై మాత్రమే  గళం ఎత్తుతున్నారన్న  ప్రకాష్ రాజ్ . ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. కేవలం మతపరమైన భావోద్వేగాలకు సంబంధించిన అంశాలపైనే స్పందిస్తూ, ఇతర దేశవ్యాప్త సమస్యలను పవన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్   స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.  ముఖ్యంగా మణిపూర్‌  హింసాకాండ, అక్కడ మహిళలపై జరిగిన దాడుల వంటి సున్నితమైన అంశాల గురించి మౌనానికి కారణమేంటన్నారు. 

కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ఒక నిర్దిష్ట వర్గాన్ని ఆకట్టుకోవడం కోసం పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారనేది ప్రకాష్ రాజ్ ప్రధాన వాదన. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న పవన్..  అదే ధర్మంలో భాగంగా ఇతర అన్యాయాలు జరిగినప్పుడు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇలా సెలెక్టివ్ అంశాలనే ఎంచుకుని విమర్శలు చేయడం వల్ల సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ వివాదం కేవలం లడ్డూ ప్రసాదానికి మాత్రమే పరిమితం కాకుండా, రాజకీయ నాయకుల నైతిక బాధ్యతపై చర్చకు దారితీసింది. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదని, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అని, ఆయన తన విమర్శల్లో నిష్పక్షపాతంగా ఉండాలని ప్రకాష్ రాజ్ సూచించారు.

మరోవైపు, పవన్ కళ్యాణ్ అభిమానులు, కూటమి నాయకులు ప్రకాష్ రాజ్ విమర్శలను తిప్పి కొడుతున్నారు. మతపరమైన సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న అంశం కాబట్టే పవన్ గట్టిగా స్పందిస్తున్నారంటున్నారు. అయితే..  ప్రకాష్ రాజ్ మాత్రం తన పంథా మార్చుకోకుండా, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సెలెక్టివ్ పాలిటిక్స్ కు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఇద్దరు ప్రముఖుల మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.ఇక ప్రకాశ్ రాజ్ విమర్శలపై  పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్న ఉత్కంఠ ఏపీ రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతోంది.  

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.