తెలంగాణలో పెను సంచలనానికి కారణమైన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఇక నత్తనడకేనా? ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకరరావును ఇండియాకు రప్పించి విచారించడం జరిగే పని కాదా? అంటే తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాన్ని బట్టి చూస్తే ఔనన్న సమాధానమే వస్తున్నది. ఈ కేసులు ప్రధాన నిందితుడైన ప్రభాకరరరావు అమెరికా చెక్కేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత గత బీఆర్ఎస్ సర్కార్ లో జరిగిన అవకతవకలు, అవినీతి, అక్రమాలు, కుంభకోణాలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు రాగానే ప్రభాకరరావు అమెరికా చెక్కేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈ ఏడాది మార్చి 10న పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ మరుసటి రోజే అంటే మార్చి 11న ప్రభాకరరావు అమెరికా వెళ్లారు. అప్పటి నుంచీ ఆయన అక్కడే ఉండిపోయారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు నలుగురు పోలీసు అధికారులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిగా ప్రభాకరరావు పేరు చేర్చి చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. ఇక అప్పటి నుంచీ ప్రభాకరరావును ఇండియాకు రప్పించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. లుక్ ఔట్ నోటీసు కూడా జారీ చేశారు. పాస్ పోర్టును కూడా రద్దు చేశారు.
ఈ నేపథ్యంలోనే ప్రభాకరరావుకు అమెరికాలో గ్రీన్ కార్డు మంజూరైన విషయం వెలుగులోనికి వచ్చింది. అంటే ప్రభాకరరావు అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతి లభించింది. దీంతో ఇక ఇప్పట్లో ప్రభాకరరావును భారత్ కు రప్పించే అవకాశాలు లేవన్న చర్చ జరుగుతోంది. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఇక నత్తనడేనని అంటున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయంలో అనధికారికంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ప్రతిపక్ష పార్టీల నేతలు, పలువురు వ్యాపారులు, కీలక వ్యక్తులఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులు, మాజీ అధికారులు అరెస్ట్ అయి చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్‌ఐబీ మాజీ ఛీప్ ప్రభాకర్ రావు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అసలు ఈ కేసులో ప్రభాకరరావును అరెస్టు చేసే విషయంలో పోలీసులు చిత్తశుద్ధితో వ్యవహరించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడిన 24 గంటల వ్యవధిలో ఆయన దేశం విడిచి వెళ్లిపోయారంటేనే.. ఆయనకు డిపార్ట్ మెంట్ నుంచి ఎప్పటికప్పుడు విషయాలు అందుతున్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రభాకరరావు అమెరికా చెక్కేసినప్పుడే ఆయన ఇప్పట్లో ఇండియాకు తిరిగి వచ్చే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషణలు చేశారు. ఈ కేసు దర్యాప్తునకు ఆయన సహకించే అవకాశాలు లేవని న్యాయనిఫులు అభిప్రాయపడ్డారు. అన్నిటికీ మించి అమెరికా నుంచే జూబ్లిహిల్స్ పోలీసులకు ప్రభాకరరావు లేఖలు రాసి గడువు కోరడాన్ని బట్టి చూస్తే ఇక ఆయన తెలంగాణ రాష్ట్రంతో అనుబంధాన్ని తెంచుకుని అమెరికాలోనే సెటిల్ అయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు అప్పడే అంచనా వేశారు. ఇప్పుడు అచ్చంగా అలాగే జరిగిందని ఆయన అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్ కావడంతో తేటతెల్లమైందిజ
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/phone-tapping-case-main-accused-gets-america-green-card-39-188048.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.