వైసీపీ సోషల్ మీడియా దాటేసింది హద్దులు.. చంద్రబాబు వార్నింగ్ తో మొదలైన వణుకు!

Publish Date:Nov 8, 2024

Advertisement

వైసీపీ సోష‌ల్ మీడియా హ‌ద్దులు దాటింది. ఇత‌ర పార్టీల్లోని మ‌హిళ‌ల‌పై, నేత‌ల కుటుంబాల్లోని ఆడ‌వారిపై అస‌భ్య‌క‌రంగా పోస్టులు పెడుతూ రాక్ష‌స ఆనందం పొందుతున్నారు. ఫ‌లితంగా బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడాలంటే కొంద‌రు మ‌హిళ‌లు భ‌య‌ప‌డుతున్న ప‌రిస్థితి.ముఖ్యంగా వైసీపీ   హ‌యాంలో ప్ర‌భుత్వ త‌ప్పుల‌ను ఎత్తి చూపిన వారిపై   ఇష్ట‌మొచ్చిన‌ట్లు వ్యాఖ్య‌లు చేయ‌డం, వారి ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి మాన‌సికంగా ఇబ్బందుల‌కు గురిచేయ‌డం వంటి చ‌ర్య‌ల‌కు వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్‌ పాల్ప‌డింది. తెలుగుదేశం, జ‌న‌సేన నేత‌లు, మ‌హిళా నేత‌లు వైసీపీ సోష‌ల్ మీడియా వెకిలి పోస్టుల‌తో మాన‌సికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారిని కట్ట‌డి చేయాల్సిన పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆ మేర‌కు చ‌ర్య‌లు తీసుకోక‌పోగా.. అలాంటి వారికి పార్టీలో పెద్ద‌పీట వేస్తూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలో గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణితోపాటు ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌తీమ‌ణి, నారా లోకేశ్ స‌తీమ‌ణి ఇలా అనేక మంది విపక్షాల నేత‌ల కుటుంబ స‌భ్యులు, మ‌హిళా నేత‌ల పై అస‌భ్య‌క‌ర పోస్టింగ్ ల‌తో వైసీపీ సోష‌ల్ మీడియా మూక రెచ్చిపోయింది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ సోష‌ల్ మీడియా వెకిలి పోస్టుల‌కు చెక్ ప‌డుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, వారి ఆగ‌డాలు ఇంకా ఎక్కువ‌య్యాయి. సోష‌ల్ మీడియా సైకోల‌ను జ‌గ‌న్ ఇంకా ప్రోత్స‌హిస్తూ వ‌చ్చారు.  హోం మంత్రి అనిత,  జ‌గ‌న్ సోదరి, కాంగ్రెస్ ఏపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల‌పై వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ పెట్టిన అస‌భ్య‌క‌ర పోస్టుల గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి సోష‌ల్ మీడియా వేదిక‌గా వైసీపీ బ్యాచ్ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంది. కూట‌మి ప్ర‌భుత్వంలో శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణించాయంటూ విష‌ ప్ర‌చారం చేయ‌డం మొద‌లు పెట్టింది. అంత‌టితో ఆగ‌కుండా సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచి తెలుగుదేశం, జ‌న‌సేన నేత‌ల‌పై అస‌భ్య‌  ప‌ద‌జాలంతో వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్‌ పోస్టింగ్‌లు పెడుతున్నారు. వీరి ఆగ‌డాలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయి.  వారిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ క్ర‌మంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. పిఠాపురం ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీస్ వ్య‌వ‌స్థ ప‌నితీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. హోంమంత్రి అనిత రివ్యూ చేయాల‌ని.. పోలీస్ వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టాల‌ని  సూచించారు. అదేక్ర‌మంలో నేను హోం మంత్రి ప‌ద‌వి తీసుకుంటే ప‌రిస్థితి వేరేలా ఉంటుందంటూ..  ఇప్ప‌టికీ వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లా వ్య‌వ‌హ‌రిస్తున్న కొంద‌రు పోలీసు అధికారుల‌కు ప‌వ‌న్‌ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై ఏపీ క్యాబినెట్ మీటింగ్ లో చంద్ర‌బాబు మాట్లాడారు. అస‌భ్య‌క‌ర పోస్టులు, మార్ఫింగ్ ఫొటోల‌తో సోష‌ల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్న‌ వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ ను క‌ట్ట‌డి చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఈ క్ర‌మంలో తాజాగా చంద్ర‌బాబు తో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఆ త‌రువాత హోంమంత్రి అనిత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో భేటీ అయ్యారు. వీరి భేటీ మ‌ధ్య ప్ర‌ధానంగా సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలంతో రెచ్చిపోయే వారిపై, రాజ‌కీయ నాయ‌కులు, వారి కుటుంబ స‌భ్యుల ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి పోస్టులుచేసే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు. 

అమ‌రావ‌తిలో జ‌రిగిన ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ.. వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోష‌ల్ మీడియాలో హ‌ద్దులుదాటి ప్ర‌వ‌ర్తిస్తే ఇక నుంచి చూస్తూ ఊరుకునేది లేద‌ని, చ‌ట్ట‌ప‌రంగా కఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఆడ‌బిడ్డ‌ల‌పై త‌ప్పుడు పోస్టింగ్ లు పెట్టాలంటే వ‌ణికిపోయేలా ట్రీట్మెంట్ ఇస్తామ‌ని, నెల‌రోజుల్లో పోలీస్ వ్య‌వ‌స్థ‌ను సెట్‌రైట్ చేస్తామ‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ వ‌రుస వార్నింగ్ ల‌తో వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్‌లో వ‌ణుకు మొద‌లైంది. చంద్ర‌బాబు వార్నింగ్ త‌రువాత‌.. జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ గ‌గ్గోలు పెట్టారు. ఏకంగా డీజీపీ గారూ.. ప్రభుత్వాలు మారుతాయి.. కూటమి శాశ్వతం కాదంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో జ‌గ‌న్ తీరుపై ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ కు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అప్ప‌ట్లో సీఎం హోదాలో వారిని క‌ట్ట‌డి చేయాల్సిన జ‌గ‌న్.. అలా చేయ‌లేదు. కూట‌మి ప్ర‌భుత్వంలో సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయే వారిని క‌ట్ట‌డి చేయాల‌ని చూస్తుంటే జ‌గ‌న్ కంగారు ప‌డిపోతుండ‌టం గ‌మ‌నార్హం. 

తాజాగా ఇదే అంశానికి సంబంధించి ఏపీ కాంగ్రెస్  వైఎస్ షర్మిళ కూడా స్పందించారు. సమాజానికి మంచి చేసే సోషల్ మీడియా వ్యవస్థను కొంత మంది సైకోలు, సైకో పార్టీలతో కలిసి ఉచ్ఛం నీచం లేకుండా భ్రష్టు పట్టించారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులతో, వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందుతున్నారని, సోషల్ సైకోల బాధితుల్లో తాను ఒకరిగా షర్మిళ చెప్పుకున్నారు. తనపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై తాను కూడా పోలీస్ కేసు పెట్టినట్లు చెప్పిన షర్మిల అటువంటి సైకో అరెస్టును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.  సోష‌ల్ మీడియాలో హ‌ద్దులు మీరే వారిపై కొర‌డా ఝుళిపించి, కూట‌మి ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లను ప్ర‌తీ ఒక్క‌రూ అభినందిస్తుంటే.. జ‌గ‌న్ మాత్రం వ్య‌తిరేకిస్తుండ‌టం గ‌మ‌నార్హం. సోష‌ల్ మీడియాలో నేత‌లు, వారి కుటుంబ స‌భ్యుల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టేవారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం, పోలీసులు చెబుతుంటే.. వారిని జ‌గ‌న్ బెదరించడం చూస్తుంటే.. అధికారం పోయినా కూడా జ‌గ‌న్ రెడ్డిలో మార్పు రాలేద‌ని అవగతమౌతోంది. ఇప్పటికీ జ‌గ‌న్ తీరులో మార్పు రాకుంటే రాబోయే కాలంలో వైసీపీ క‌నుమ‌రుగు కావ‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వైసీపీ వ‌ర్గాల్లో నుంచి సైతం వినిపిస్తోంది.

By
en-us Political News

  
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.