ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బడంగ్‌పేట్ మాజీ మేయర్ పారిజాత సిట్ అధికారుల ఎదుట హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 30 నిమిషాల పాటు తనతో పాటు తన భర్త స్టేట్‌మెంట్‌ను కూడా అధికారులు రికార్డు చేశారని తెలిపారు. 2022 సంవత్సరంలో తమ ఇద్దరి ఫోన్‌లు ట్యాపింగ్‌కు గురైనట్లు సిట్ అధికారులు వెల్లడించారని ఆమె చెప్పారు. అధికారులు చెప్పే వరకు ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయం తమకు తెలియదని పేర్కొన్నారు. భార్యాభర్తలిద్దరి ఫోన్‌లను ట్యాప్ చేయడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఎన్నికల సమయంలో తమ ఫోన్‌లను ట్యాప్ చేసి అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ప్రజా సేవలో నిరంతరం నిమగ్నమై ఉండటంతో ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయాన్ని గుర్తించలేకపోయామని తెలిపారు. ఎన్నికల సమయంలో తమ కదలికలపై నిరంతరం నిఘా ఉంచినట్లు అనిపించేదని చెప్పారు. గత ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఓ మహిళా నేత ప్రమేయంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండొచ్చనే అనుమానం తనకు ఉందని పారిజాత పేర్కొన్నారు.
అయితే దీనిపై పూర్తి నిజాలు దర్యాప్తు ద్వారానే వెలుగులోకి వస్తాయని అన్నారు. సిట్ దర్యాప్తుపై పూర్తి విశ్వాసం ఉందని, ప్రభుత్వం ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉందని పారిజాత తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/phone-tapping-case-36-221668.html
వైజాగ్‌కు చెందిన తెలుగు విద్యార్థి అక్షత్ శ్రీవాస్తవ ఆపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ 2026 విజేతగా నిలిచి, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌ను కలిశాడు. అతను రూపొందించిన AI ఎడ్యుకేషన్ యాప్ STEMQuest వివరాలు, WWDC ఈవెంట్ విశేషాలు మరియు అతని సక్సెస్ స్టోరీని ఇక్కడ చూడండి.
15 ఏళ్ల భారత యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా లెజెండ్ గ్లెన్ మెక్‌గ్రాత్ ప్రశంసల వర్షం కురిపించారు. వైభవ్ బ్యాటింగ్ బ్రయాన్ లారా, గ్యారీ సోబర్స్‌ను గుర్తుచేస్తోందని, అతని 72 సిక్సర్ల విధ్వంసంపై మెక్‌గ్రాత్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇక్కడ చూడండి.
మహిళల టీ20 ప్రపంచకప్ మొదటి వార్మప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 26 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. భారతీ ఫుల్మాలి (56*) హాఫ్ సెంచరీతో మెరవగా, శ్రేయాంక పాటిల్ 4 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. తమ నియోజకవర్గానికి చంద్రబాబు వస్తున్నారని, దూరం నుంచైనా ఆయన్ను చూడాలని ఉందంటూ ఆయన మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది.
సోమవారం మధ్యాహ్నం క్యూబాలో భారీ భూకంపం సంభవించింది. ఆ తరువాత గంటల వ్యవధిలోనే.. ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని హర్మూజ్‌గాన్ ప్రావిన్స్‌లో మరో భూకంపం సంభవించింది. ఈ రెండు భూకంపాల వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. క్యూబా భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై ఏకంగా 6.1 గా నమోదైంది.
ఇలా ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రధాని నరేంద్రమోడీ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 50 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించారు.
సాంకేతిక లోపంతో వల్ల ఒక భారీ ట్రక్కు అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో.. అదే సమయంలో వెనుక నుంచి కార్మికులతో వస్తున్న ఒక మినీబస్సు.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొంది. కార్మికుల బస్సును డ్రైవర్ అతి వేగంగా నడపడం, వేగాన్ని నియంత్రించలేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
సిరి కేవలం ఒక కమాండ్ ఫాలో అయ్యే టూల్‌లా కాకుండా.. అత్యంత సహజంగా సంభాషించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. వినియోగదారుల ప్రైవసీని యాపిల్ ఇక్కడ కూడా కొనసాగించింది. డేటా అంతా డివైస్ లోపలే ప్రాసెస్ అయ్యేలా డిజైన్ చేసింది.
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్ స్టేజ్‌కు చేరాయి.
మాజీ మంత్రి, వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలంటూ ఆయన కుమార్తె సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)కి చెందిన ఇన్‌స్పెక్టర్ బి. మహేందర్‌కు సంబంధించిన ఎసీబీ (ACB) రిమాండ్ కాపీలో పలు సంచలన అంశాలు వెలుగుచూశాయి.
తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థను మరింత బలో పేతం చేసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.