Publish Date:Jun 22, 2025
స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. రేపు జరిగే మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్, ఫోన్ ట్యాపింగ్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ట్యాపింగ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రమేయంతోనే ట్యాపింగ్ జరిగినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కు గురైన బాధితుల పేర్లను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తక్షణమే బయటపెట్టాలని ఆయన స్పష్టం చేశారు. "ఈ వ్యవహారంలో దోషులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని గౌడ్ స్పష్టం చేశారు.
ఈ కుంభకోణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరూ చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిందేనని, దోషులు ఎంతటి వారైనా జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. కోట్ల ప్రజాధనాన్ని నీళ్లలో పోసిందని ఆరోపిస్తూ ఆర్థిక దుర్వినియోగంపై తీవ్ర విమర్శలు చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ హక్కుల కోసం వెనక్కి తగ్గమని, ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం జరిగినప్పటికీ బీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా రాజకీయ నేతలు, సినీ తారలు, జడ్జీల ఫోన్లను ట్యాప్ చేసిన నీచమైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందని మండిపడ్డారు. 2022 నుంచి 650 మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయని, ఈ విషయంలో సిట్ ముందు సాక్షిగా వాంగ్మూలం ఇచ్చానని ఆయన తెలిపారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/phone-tapping-case-39-200455.html
తొలి ఏకాదశి సందర్బంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. నేడు ఆషాడ సారెను సమర్పిస్తే మరింత శుభం కలుగుతుందనే నమ్మకంతో వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చాయి.
నెల్లూరులోని ప్రసిద్ద బారాషషీద్ దుర్గ వద్ద రొట్టెల పండుగ ఇవాళ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ పండుగ ఐదు రోజుల పాటు జరిగే పాటు జరగనున్నది.
పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉన్న పార్టీలో ఉన్నట్టు ఉండి ఉంటే వీళ్ల పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉండేదేమో. కానీ అత్యాశ కొంప ముంచేసింది. పెట్టిన చేతినే కరవడంతో పాము, మొసలినే మించి పోయారీ ఇద్దరూ. కారణం ఈ భూ ప్రపంచంలో పెట్టిన చేతినే కరిచే బుద్ధి కేవలం పాము, మొసలికి మాత్రమే ఉంటుందట.ఆ
క్యాప్షన్ కొత్తగా ఉందన్న మాటే కానీ మేటర్ మాత్రం చాలా చాలా పాతదే. పెద్దగా కంగారు పడకండి. కారణం ఏంటంటారా? అప్పుడే అభ్యర్ధుల ప్రకటన చేస్తున్నారట అతి- ఉత్సాహి జగన్. ఇప్పటికే వంద మంది పేర్లు వంద సీట్లకు ఖరారు చేసేశారట.
హైదరాబాద్ నడి బొడ్డున 1982 మార్చి 29న పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. టీఆర్ఎస్ అయినా పుట్టిన పుష్కర కాలానికిగానీ అధికారంలోకి రాలేదు. అదే టీడీపీ ఏకంగా 9 నెలల్లోనే అధికారం చేపట్టి ప్రపంచ రాజకీయ చరిత్రలోనే మరెవరికీ సాధ్యం కాని ఒక చరిత్రను సృష్టించింది.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది.
ప్రపంచ అపర కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెరికా పార్టీ పేరుతో నూతన పార్టీ ప్రకటించారు. అగ్రరాజ్యంలో ప్రజాస్వామ్యం లేదని ప్రజలకు స్వేచ్చ ఇచ్చేందుకే పార్టీ ఏర్పాటు చేశానని ఎలాన్ మస్క్ తెలిపారు.
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్ 427/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ ముందు 608 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది.
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోన్న పార్టీ కార్యకర్త అభిమతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్చారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆకుల కృష్ణతో చంద్రబాబు వీడియో కాల్ చేసి మాట్లాడారు.
అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ ను అరెస్ట్ చేసి 81 లక్షల రూపాయల విలువైన 26 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి తెలిపారు.
అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఓబిలి స్కూల్ వద్ద గుప్తనిధుల కోసం వినాయక విగ్రహాన్ని పగులగొట్టి త్రవ్వకాలకు పాల్పడిన 13 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో ర్యాగింగ్ కు పాల్పడిన 13 మంది విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు ఎయిమ్స్ అధికార ప్రతినిధి డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి చెప్పారు.