జనవరిలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా  ఉంటుందో తెలుసా?

Publish Date:Jan 6, 2026

Advertisement


జనవరి నెలలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, అన్నింటికంటే ముఖ్యంగా ఇది సంవత్సరం ప్రారంభ నెల. ఈ నెలలో  చల్లని గాలి,  నిర్మలమైన  ఆకాశం కూడా ఉంటుంది.  దీనిలాగే ఈ నెలలో జన్మించిన పిల్లలు కూడా కొన్ని ప్రత్యేక వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు. జనవరిలో జన్మించిన వారి రాశిచక్రం,  పుట్టిన సమయం కూడా వ్యక్తి స్వభావాన్ని ప్రభావితం చేస్తాయి. జనవరిలో జన్మించిన వ్యక్తులు తరచుగా  భిన్నంగా కనిపిస్తారు. వారిలో ఒక వింతైన తీవ్రత ఉంటుంది, చిన్న వయస్సులోనే జీవితాన్ని నేర్చుకోవాలనుకుంటున్నట్లుగా వీరి ప్రవర్తన ఉంటుంది.  ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకుంటే..

జ్యోతిష్యం, మనస్తత్వశాస్త్రం,  ప్రవర్తనా అధ్యయనాల ప్రకారం జనవరిలో జన్మించిన వారు సహజంగా ప్రశాంతంగా, దృఢంగా ఉంటారు.  నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు.  

పరిణితి..

జనవరిలో జన్మించిన పిల్లలు గంభీరమైన స్వభావం,  ఆలోచనలో పరిణతితో  వారి వయసు  కంటే తెలివైనవారిగా కనిపిస్తారు.  ఎక్కువగా మాట్లాడరు, కానీ వారు మాట్లాడినప్పుడు  జాగ్రత్తగా మాట్లాడతారు. వారి నిర్ణయాలు భావోద్వేగాలపై తక్కువగా,  తర్కంపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. చిన్నతనంలో  అందరికీ దూరంగా ఉండటం ఎక్కువ. ఎవరితో ఎక్కువ మాట్లాడరు కూడా..  కానీ కాలక్రమేణా ఈ లక్షణాలు వారికి బలంగా మారతాయి.

నిరాడంబరత, ఆదర్మమార్గం..

జనవరిలో జన్మించిన వ్యక్తులలో లీడర్ క్వాలిటీస్ ఎక్కువ. అయినా కూడా ఆడంబరాలకు దూరంగా ఉంటారు. ఎలాంటి హడావిడి లేకుండా లీడర్స్ గా ఎలా ఉండాలో  వారికి తెలుసు. వారు ఆజ్ఞాపించరు, ఆదర్శంగా ముందుకు సాగుతారు. పాఠశాలలో లేదా ఆఫీసులలో అయినా, అందరూ వీరి పట్ల చాలా నమ్మకంతో ఉంటారు.

క్రమశిక్షణ..

క్రమశిక్షణ వారి రక్తంలోనే ఉంటుంది. జనవరిలో పుట్టిన వారికి  బద్దకం అంటే శత్రువట.  సమయానికి మేల్కొనడం, తమ పనిని సరిగ్గా చేయడం,  తమ బాధ్యతలను నెరవేర్చడం వీరికి నేర్పించాల్సిన అవసరం లేదు. ఈ క్రమశిక్షణ కొన్నిసార్లు వారిని కఠినంగా లేదా మొండిగా చేస్తుంది. ముఖ్యంగా  తమ ఇష్టానికి తగ్గట్టు ఏదైనా  జరగనప్పుడు మరింత మొండిగా మారతారు.

వ్యక్తీకరణ..

 వీరి భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయి. కానీ అవి చాలా తక్కువగా వ్యక్తం చేస్తారు. వీరి నుండి  ప్రేమ పూర్తి నిజాయితీతో వస్తుంది,  స్నేహాలు జీవితాంతం ఉంటాయి. అయితే భావోద్వేగాలను వ్యక్తపరచడంలో సంకోచం వారిని సంబంధాలలో అపార్థాలకు గురి చేస్తుంది.

భయం..


కష్టపడి పనిచేయడానికి భయపడరు.  కష్టాలకు భయపడి వెనుకంజ వేయడం వంటివి చేయరు. జనవరిలో పుట్టిన పిల్లలు కష్టపడి పని చేయడాన్ని గౌరవిస్తారు. రాత్రికి రాత్రే విజయం సాధించాలనే భ్రమలో  జీవించరు. అందుకే వారు తమ కెరీర్‌లో నెమ్మదిగా ఎదుగుతారు.  కానీ పూర్తీగా పై స్థాయిలో ఉండే విధంగా స్థిరపడతారు.   వారి గొప్ప బలం ఓర్పు. వారి అతిపెద్ద బలహీనత తమతో తాము చాలా కఠినంగా ఉండటం.  

బాధ్యత..

ఇంట్లో అయినా లేదా సమాజంలో అయినా జనవరిలో పుట్టిన వారు  చిన్న వయస్సులోనే బాధ్యతలను స్వీకరిస్తారు. వారు తక్కువ ఫిర్యాదు చేస్తారు,  తమ విధులను నెరవేర్చడంలో  నైపుణ్యం కలిగి ఉంటారు. కొన్నిసార్లు ఈ భారం వారిని అంతర్గతంగా అలసిపోయేలా చేస్తుంది. కానీ వారు అలసిపోతున్నట్టు అస్సలు బయటపడనీయరు.


                                         *రూపశ్రీ.

By
en-us Political News

  
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలోని ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కోవాలని కోరుకుంటారు.
ఆచార్య చాణక్యుడు   గొప్ప రాజనీతిజ్ఞుడు,  వ్యక్తిత్వ విశ్లేషణా నిపుణులు,  ఆర్థిక శాస్త్ర నిపుణులు.  ఆయన వేల సంవత్సరాల కిందటే మనిషి జీవితంలో ఎన్నో విషయాలను ఎంతో స్పష్టంగా, వివరంగా చెప్పాడు.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటూ ఉంటారు. కానీ ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు మానవ సంబందాలే ఆదుకుంటాయి.  
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలు ఉండాలని కోరుకుంటారు, కానీ ఇది అంత సులభమైన పని కాదు.
నేటి కాలంలో ఇల్లు, కారు, పిల్లల చదువు, వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం లోన్ తీసుకోవడం చాలా సాధారణమైంది.
ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి కుటుంబంతో ఉండే అనుబంధం చాలా గొప్పది. ఎన్నో విషయాలు కుటుంబం నుండే నేర్చుకుంటారు.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, తెలివైనవారుగా, క్రమశిక్షణ గలవారుగా , స్వయం సమృద్ధి గలవారుగా ఉండాలని కోరుకుంటారు.
జీవితం అన్నాక సంతోషాలు,  ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు బాధపడటం అందరూ చేసే పనే.. కానీ.. కొందరుంటారు.. చుట్టూ ఉన్నవారు బాధపడితే.. ఏడిస్తే.. వారిని ఓదార్చాలనే ఆలోచనలతో "ఏడిస్తే ఏం ప్రయోజనం?", "
పిల్లలు చదువును ఒత్తిడిగా కాకుండా ఆనందంగా భావించాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. చాలామంది తల్లిదండ్రులు మంచి మార్కులు రావాలని ఆశపడతారు.
ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత అందంగా కనిపిస్తుంది. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో బూజు దులపడం, తుడవడం,  ఇంట్లో ఎక్కడైనా సాలీడు పురుగులు, బొద్దింకలు వంటివి రాకుండా చూడటం చేస్తుంటారు.
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది.
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.