తిట్టకుండా, అరవకుండా పిల్లలను క్రమశిక్షణలో ఇలా పెట్టచ్చు..!

Publish Date:Jul 31, 2026

Advertisement

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలు ఉండాలని కోరుకుంటారు, కానీ ఇది అంత సులభమైన పని కాదు. పిల్లలను పెంచడం అంటే కేవలం వారిని పెంచడం మాత్రమే కాదు,అందుకోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తుండాలి, ఇందుకోసం సహనం కూడా చాలా అవసరం.  ఈ విషయాన్ని చాలామంది  తల్లిదండ్రులు అర్థం చేసుకోరు. పిల్లలలో మంచి విలువలు, క్రమశిక్షణను పెంపొందించడం గురించి మాట్లాడినప్పుడల్లా, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు అనుసరించే పిల్లల పెంపకం విధానాల గురించి మాట్లాడుతుంటారు.. అయితే జపాన్ ప్రజలు అనుసరించే విధానాలు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటాయి.  పిల్లలను కొట్టకుండా, తిట్టకుండా, అరవకుండా పిల్లలను క్రమశిక్షణలో ఉంచడం జపాన్ దేశీయుల ప్రత్యేకత.. అందుకోసం వారు ఏం చేస్తారో.. పిల్లలను కొట్టకుండా, తిట్టకుండా, అరవకుండా ఎలా క్రమశిక్షణలో ఉంచాలో తెలుసుకుంటే..

పిల్లలను  క్రమశిక్షణతో పెంచే జపనీస్ పెంపకం నియమాలు..

జపాన్ దేశం చాలా వేగంగా అభివృద్ది చెందుతోంది.   పిల్లల పెంపకం విషయంలో కూడా జపాన్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ దేశంలోని ప్రజలు పిల్లల పెంపకంలో ఒక పద్ధతిగా మైండ్‌ఫుల్‌నెస్‌ను ఉపయోగిస్తారు. పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి ఐదు పెంపక నియమాలను పాటిస్తారు.

ఇతరులకు మర్యాద ఇవ్వడం..

జపాన్‌లో పిల్లలకు ఎంత చిన్నవారైనా సరే, మొదటి నుంచే ఇతరులను మర్యాదగా పలకరించడం నేర్పిస్తారు. ఈ పద్ధతి ఇతరుల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. వారి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విధంగా ప్రవర్తించినప్పుడు, పిల్లలు  సహజంగానే క్రమశిక్షణను నేర్చుకుంటారు.

ఇతరుల ఎమోషన్స్  పట్టించుకోవడం..

జపాన్ సామూహిక అవగాహనను పాటిస్తుంది, ఇది వ్యక్తులను క్రమశిక్షణతో ఉండేలా చేసే ఒక నియమం. ఇది ఒకరి ప్రవర్తన గురించి వారికి అవగాహన కల్పించడానికి, తమ ఎమోషన్స్ తో పాటు ఇతరుల ఎమోషన్స్ ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెబుతుంది.  దీని వల్ల కేవలం అందరికీ ఒకరి గురించి మరొకరు మీద శ్రద్ద,  గౌరవం ఏర్పడతాయి.

ఇంట్లోకి వచ్చే ముందు షూ విప్పడం..

జపనీస్ జీవనశైలిలో ఇంటి బయట బూట్లు విప్పాలనే నియమాన్ని కచ్చితంగా పాటిస్తారు. ఇక్కడి ఇళ్లకు 'జెంకెన్' అని పిలువబడే ఒక ప్రత్యేక ప్రవేశ ద్వారం ఉంటుంది. అతిథులు , కుటుంబ సభ్యులు ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ ద్వారం వద్ద తమ బూట్లను తప్పనిసరిగా విప్పాలి. ఈ ఆచారం వెనుక  ఇంటి పరిశుభ్రత , మనస్సు  స్వచ్ఛతగా ఉండటం వంటి కారణాలు ఉంటాయట.

ఒకసారి ఒక పనినే చేయడం..

పిల్లల ఏకాగ్రతను మెరుగుపరచడానికి, వారు ఒకేసారి అనేక పనులు చేయకుండా, ఒకే పనిపై దృష్టి పెట్టేలా ప్రోత్సహిస్తారు. దీనివల్ల పిల్లల ఆసక్తి, శ్రద్ద, పనులలో ఫలితాలు మెరుగ్గా ఉండటం వంటివే  కాకుండా, వారి వినికిడి, దృష్టి , గ్రహణశక్తి కూడా రెట్టింపు అవుతాయి.

 

                               *రూపశ్రీ.

 

By
en-us Political News

  
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటూ ఉంటారు. కానీ ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు మానవ సంబందాలే ఆదుకుంటాయి.  
నేటి కాలంలో ఇల్లు, కారు, పిల్లల చదువు, వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం లోన్ తీసుకోవడం చాలా సాధారణమైంది.
ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి కుటుంబంతో ఉండే అనుబంధం చాలా గొప్పది. ఎన్నో విషయాలు కుటుంబం నుండే నేర్చుకుంటారు.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, తెలివైనవారుగా, క్రమశిక్షణ గలవారుగా , స్వయం సమృద్ధి గలవారుగా ఉండాలని కోరుకుంటారు.
జీవితం అన్నాక సంతోషాలు,  ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు బాధపడటం అందరూ చేసే పనే.. కానీ.. కొందరుంటారు.. చుట్టూ ఉన్నవారు బాధపడితే.. ఏడిస్తే.. వారిని ఓదార్చాలనే ఆలోచనలతో "ఏడిస్తే ఏం ప్రయోజనం?", "
పిల్లలు చదువును ఒత్తిడిగా కాకుండా ఆనందంగా భావించాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. చాలామంది తల్లిదండ్రులు మంచి మార్కులు రావాలని ఆశపడతారు.
ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత అందంగా కనిపిస్తుంది. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో బూజు దులపడం, తుడవడం,  ఇంట్లో ఎక్కడైనా సాలీడు పురుగులు, బొద్దింకలు వంటివి రాకుండా చూడటం చేస్తుంటారు.
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది.
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.
వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.
 పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.
5 Habits Every Father Should Give Up for His Daughter,Every Father Needs to Hear These 5 Parenting Tips,5 Habits to Leave Behind
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.