అన్నా చెల్లెళ్ల ఆస్తి వివాదంలో పేర్ని నాని తీర్పేమిటో?

Publish Date:Oct 26, 2024

Advertisement

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ఏపీపీసీసీ అధినేత్రి, జగన్ సోదరి షర్మిల మధ్య  ఆస్తుల వివాదంలో రోజుకో ట్విస్ట్ బయలకు వస్తోంది. ఆస్తుల వివాదంపై అన్నాచెల్లెళ్ల వాదనకు భిన్నంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి పేర్ని నాని జగన్ వాదనను ఖండించేలా ఆయనకు మద్దతుగా ఆయనకే తెలియని విషయాలు వెల్లడిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించక ముందే ఆయన పిల్లలకు ఆస్తులు పంచారని మాజీ మంత్రి పేర్నినాని బల్లగుద్ది చెబుతున్నారు. ఇప్పుడు షర్మిల కోరుతున్న ఆస్తులన్నీ జగన్ స్వార్జితమని తీర్పిచ్చేస్తున్నారు.

శుక్రవారం (అక్టోబర్ 25) తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డితో కలసి మీడియాతో మాట్లాడిన పేర్నినాని.. వైఎస్‌ బతికుండగానే జగన్‌కు, షర్మిలకు ఎవరికి ఇచ్చే ఆస్తులను వారికి సవివరంగా రాసిచ్చారని తెలిపారు. జగన్ కంపెనీలలో షర్మిల ఎంత మాత్రం షేర్ హోల్డర్ కాదనీ చెప్పారు.   అసలు వైఎస్ కుటుంబంలో అన్నాచెల్లెళ్ల ఆస్తుల గొడవ ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది. వైఎస్ కుటుంబ ప్రతిష్ఠను మంటగలిపేలా జగన్ తీరు ఉందని వైఎస్ అభిమానులు బాహాటంగానే చెబుతున్నారు. వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి షర్మిల ఇల్లూ వాకిలీ వదిలేసి మరీ పాదయాత్ర చేశారనీ, తీరా వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత చెల్లిని దూరం పెట్టారనీ వైసీపీ శ్రేణులే కాదు, వైఎస్ అభిమానులూ గుర్తు చేసుకుంటున్నారు. దీంతో అన్నా చెల్లెళ్ల ఆస్తి వివాదం కుటుంబ వ్యవహారం స్టేజి దాటిపోయింది. దీనిపై బహిరంగ చర్చలే జరుగుతున్నాయి. 

ఆస్తుల గొడవలు కుటుంబాలలో సహజమే, ఇది మా వ్యక్తిగత వివాదం అంటూ జగన్ దీనిని తేలికగా కొట్టిపాడేయడానికి ప్రయత్నిస్తుంటే.. షర్మిల మాత్రం జగన్ కు గట్టి కౌంటర్ ఇస్తూ, తనకు జగన్ అన్యాయం చేశారని ఎలుగెత్తి చాటుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు షర్మిల, జగన్ లమధ్య చిచ్చుకు తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కారణమంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఆరోపణలను ఖండిస్తూ షర్మిల అన్నకు బహిరంగ లేఖ రాశారు. 

దీంతో పేర్ని నాని జగన్ తరఫున వకాల్తా పుచ్చుకుంటూ మీడియా ముందుకు వచ్చేశారు.  జగన్ ను రాజకీయంగా దెబ్బ కొట్టడానికే చంద్రబాబు, షర్మిలను పావుగా వాడుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు జగన్ ను రాజకీయంగా దెబ్బకొట్టడానికి చంద్రబాబు కొత్తగా షర్మిల వివాదాన్ని బయటకు తీసుకురావడం ఎందుకు.. ఇటీవలి ఎన్నికలలో జగన్ పార్టీని జనం 11 స్థానాలకు పరిమితం చేసినప్పుడే ఆయన రాజకీయంగా జీరో అని తేలిపోయిందని తెలుగుదేశం వర్గాలు ఎద్దేవా చేస్తున్నాయి. జగన్ అధికారం చేపట్టిన తరువాత ముందు షర్మిలను, ఆ తరువాత తల్లి విజయమ్మను పార్టీ నుంచి బయటకు పంపేసిన విషయం పేర్ని నానికి గుర్తు లేదా అని నిలదీస్తున్నారు.  

జగన్ కోసం, ఆయనను ముఖ్యమంత్రిని చేయడం కోసం చెల్లి షర్మిల, తల్లి విజయమ్మలను అధికారంలోకి రాగానే జగన్ ఎలా పక్కన పెట్టేశారో, ఆంధ్రప్రదేశ్ వీడి పొరుగురాష్ట్రంలో తలదాచుకోవలసిన పరిస్థితి కల్పించారో తెలియదా అని ప్రశ్నించారు.  అంతెందుకు జగన్ కోసం ఆయన ప్రాపకం కోసం ఉచ్ఛనీచాలు, మంచి చెడ్డలూ వదిలేసి ఇష్టారీతిగా చెలరేగి.. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై, పవన్ కల్యాణ్ పై నోటికొచ్చినట్లల్లా మాట్లాడిన బోరుగడ్డ ప్రసాద్ ను జగన్  ఎలా వదిలించుకున్నారో కనిపించడం లేదా?  అని నిలదీస్తున్నారు. 

అయినా ఓ పక్క జగన్ సొంత చెల్లి, వైఎస్ కన్నబిడ్డ షర్మిల.. ఇది మా తండ్రి ఆస్తి, నలుగురు మనవలకూ సమానంగా పంచాలన్నది ఆయన అభిమతం. అందుకే నా ఈ పోరాటం అని విస్పష్టంగా చెబుతుంటే.. ఆ కుటుంబంతో ఏం సంబంధం లేని పేర్ని నాని ఆ అస్తులు జగన్ స్వార్జితం అని ఎలా తీర్పు ఇచ్చేస్తారనీ ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద పేర్ని నాని రాజును మించిన రాజభక్తిని ప్రదర్శిస్తుంటే.. వైసీపీ శ్రేణులే త్వరలో పేర్ని నాని మరో బోరుగడ్డ ప్రసాద్ లా మారడం ఖాయమని.. ఆయన భవిష్యత్ అలాగే కనిపిస్తోందనీ సెటైర్లు వేస్తున్నాయి. 

By
en-us Political News

  
ఆపరేషన్‌ సింధూర్ విజయంలో సాయుధ బలగాలు, మోదీ నాయకత్వాన్ని అభినందిస్తూ ఒక తీర్మానాన్ని శివసేన నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రవేశపెట్టారు. ఆపరేషన్ సిందూర్‌తో దేశ ప్రజల్లో నైతిక స్థైర్యం, ఆత్మస్థైర్యం పెరిగిందని ఆ తీర్మానం పేర్కొంది.
రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ నుంచి తన పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌‌ను ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ఆర్జేడీ పార్టీ అధ్యక్షుడు, బీహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రకటించారు. అదేవిధంగా ఫ్యామిలీ నుంచి కూడా అతడిని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌‌ను ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్‌‌లో కలిశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ దాని పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం నోటీసులతో పాటు తాజా పరిస్థితులపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
రాష్ట్ర నీటి అవ‌స‌రాలు కాపాడ‌టంలో ఈ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది.. గోదావ‌రి – బ‌న‌కచ‌ర్ల ప్రాజెక్టు వ‌ల్ల తెలంగాణ‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లుతుంద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుపై తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు
కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ దంపతులు పుష్కర పుణ్య స్నానం ఆచరించారు. గవర్నర్‌ దంపతులకు మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ సతీసమేతంగా ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు
మిస్ ఇంగ్లండ్ మ్యాగీ వ్య‌వ‌హార శైలి కాస్త అనుమానాస్ప‌దంగానే ఉందంటున్నారు. బేసిగ్గా స్విమ్మ‌ర్ అయిన మ్యాగీ త‌న త‌ల్లి నుంచి, స్విమ్మింగ్ నుంచి ఏమి నేర్చుకుందోగానీ కొన్నికొన్ని విష‌యాల్లో ఆమెను తీవ్రంగా అనుమానించాల్సి వ‌స్తోంద‌ని అంటారు కొంద‌రు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో బీజేపీ ఎంపీ సీఎం ర‌మేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో చాలా విష‌యాల‌పై సిట్ ఇంకా పూర్తిగా దృష్టిసారించ‌లేదని ఆయ‌న పేర్కొన్నారు. సిట్ పిలిస్తే తాను వెళ్లి మద్యం కుంభకోణంలో బ‌య‌ట‌కు రాని విష‌యాలు వెల్ల‌డిస్తాని ఆయన అన్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో విజయ్‌ కుమార్‌ అనే కానిస్టేబుల్‌ మృతిచెందారు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.
ప్రముఖ రంగస్థల కళాకారుడు, బలగం సినిమా నటుడు జీవీ బాబు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మరణించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో సొంత ఇళ్లు నిర్మించుకుని గృహప్రవేశం చేశారు. శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం గ్రామ పరిధిలో రెండు ఎకరాల స్థలంలో చంద్రబాబు కొత్తగా ఇల్లు నిర్మించుకున్న సంగతి విదితమే.
వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇలాకా క‌డ‌ప‌లో తొలిసారి నిర్వ‌హిస్తున్న మహానాడుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు తరలిరానున్నాయి. అయితే వైసీపీ మాత్రం మహానాడుపై కుట్రల పర్వానికి తెరతీసింది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవలకు తోడు వారాంతం కూడా కావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమల భక్త జన సంద్రంగా మారింది.
ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర ఇచ్చిన ప్రెజంటేషన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సీఎం ప్రజెంటేషన్‌లో వివిధ అంశాలు వికసిత్ భారత్‌కు ఉపయోగపడేలా ఉన్నాయని ప్రధాని మోడీ సైతం అభినందించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.