అలకా మొహమాటమా?.. కేంద్ర మంత్రి పర్యటనలో ప్రేక్షకుడిలా మాజీ మంత్రి పేర్ని నాని

Publish Date:Apr 30, 2022

Advertisement

వైసీపీమాజీ మంత్రుల తీరు చూస్తుంటే.. పార్టీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అనిపించక మానదు. సీఎం అభీష్టం మేరకు ఆయన అప్పగించిన బాధ్యతలను మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తామని వారు చెప్పిన మాటలు పెదవుల చివరి నుంచి వచ్చినవేనన్నఅనుమానాలు పార్టీ కేడర్ లోనే వ్యక్తమౌతున్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరుజిల్లాలో చేసిన రచ్చమరువక ముందే.. ఆ స్థాయిలో కాకపోయినా మరో మాజీ మంత్రి పేర్ని నాని తన అసమ్మతినీ, అసంతృప్తినీసున్నితంగానే అయినా గుర్తించదగ్గ స్థాయిలో ప్రదర్శించారు. కేంద్ర మంత్రి పర్యటనలో మాజీ మంత్రి పేర్ని నాని అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారు. పర్యటన ఆద్యంతం  ఒక ప్రేక్షకుడిలా దూర దూరంగా ఉండిపోయారు. 

గిలకల దిండి హార్బర్ పరిశీలనకు కేంద్ర మత్స్యశాఖ మంత్రి మురుగన్ శుక్రవారం పర్యటించారు. మంత్రి సిదిరి అప్పలరాజుతో కలిసి కేంద్ర మంత్రి గిలకలదిండి హార్బర్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పేర్ని నాని కూడా హాజరయ్యారు. అయితే ఆయన కనీసం మంత్రుల దగ్గరకు కూడా రాలేదు. ఏదో సంబంధం లేని కార్యక్రమానికి హాజరైనట్లుగా వారికి దూరంగా ఉండిపోయారు. మంత్రి సిదరి అప్పలరాజు స్వయంగా వెళ్లి పనుల పరిశీలనకు రావలసిందిగా కోరినప్పటికీ పేర్ని నాని పట్టించుకోలేదు. 

ఆ తరువాత జరిగిన సభలో మాత్రం మంత్రి మాట్లాడారు. ఆ మాటలు కూడా ముక్తసరిగా, ఆయన సహజ వాగ్ధాటిని భిన్నంగా ఉన్నాయి. కేంద్ర మంత్రి తెలుగులో చక్కగా మాట్లాడతారని ప్రశంసించి...తాను పనుల పరిశీలను దూరంగా ఉండటానికి   ఎప్పుడూ చూసే పనులే కాదా అని ముక్తాయింపు ఇచ్చారు.

పేర్ని నాని కేంద్ర మంత్రి పర్యటనకు హాజరై కూడా దూరదూరంగా మెలగడం, ముక్త సరిగా మాట్లాడటానికి కేబినెట్ లో స్థానం దక్కలేదన్న అసంతృప్తే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తుంటే.. పార్టీ వర్గాలు  తాను ఉంటే కొత్త మంత్రి స్వేచ్ఛగా మెలగలేరన్న  భావనే పేర్ని నాని ఈ కార్యక్రమంలో అంటీముట్టనట్లు వ్యవహరించడానికి కారణమని చెబుతున్నారు. 

By
en-us Political News

  
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.