Publish Date:Apr 18, 2022
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లగా తయారైంది ఆంధ్రప్రదేశ్ లో పరిస్థతి. ఏపీలో అధికార అ పార్టీ అత్యుత్సాహం జనం ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నది. అదెలా అంటే...జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవులు పొందిన వారి, వారి అనుచరులు, అభిమానుల అత్యుత్సాహం జనం ప్రాణాల మీదకు తెస్తున్నది. ఒక మంత్రి విజయోత్సవ ర్యాలీ కారణంగా పసి పాప సమయానికి వైద్యం అందక మరణించింది. మరో సంఘటనలో మంత్రి ఆలయ దర్శనం కారణంగా సామాన్య భక్తుల దర్శనానికి విపరీతమైన జాప్యం జరిగి వారు తరగబడే పరిస్థతి ఏర్పడింది. మండు వేసవిలో గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలిచిపోవలసి రావడంతో పలువురు దాదాపు సొమ్మసిల్లిన పరిస్థితికి చేరుకోవడంతో భక్తులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక తాజాగా నెల్లూరులో అయితే మంత్రి కాకాణి అనుచరుల అత్యుత్సాహం ఏకంగా వందల మంది రైలు ప్రాయాణీకుల ప్రాణాలనే ప్రమాదంలోకి నెట్టింది. నెల్లూరులో నిన్న సాయంత్రం కొత్త మంత్రి కాకాణికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా నెల్లూరులో భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. గజ మాలలూ, బాణ సంచాలతో నెల్లూరు దద్దరిల్లిపోయేలా చేశారు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన ఇన్ని రోజుల తరువాత ఈ సంబరేలేమిటంటారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కాకాణి నెల్లూరుకు రావడం ఇదే మొదటి సారి కావడంతో పార్టీ శ్రేణులు ఈ సంబరాలకు శ్రీకారం చుట్టారు. ఇంత భారీ ఎత్తున సంబరాలు చేసుకోవడానికీ కారణం ఉంది. పాత మంత్రి ఇటీవల కాకాణికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం...పోలీసు స్టేషన్లో సాక్ష్యాల దొంగతనం వంటి కారణాలతో కొత్త మంత్రి ప్రతిష్ట ఒకింత మసకబారిందనే ప్రచారం సాగుతుండటంతో దానికి తిప్పి కొట్టేందుకు ఈ హడావుడీ, హంగామా చేశారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ శ్రేణుల అత్యుత్సాహమే ఒక పెను ప్రమాదం జరిగే పరిస్థితి ఏర్పడేలా చేసింది. వందలాది మంది ప్రాణాలు పోయే పరిస్థితినీ తీసుకు వచ్చింది. అదెలాగంటే....మంత్రి స్వాగత సంబరాలలో మైమరిచిన వైకాపా కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చారు. అందులో భాగంగా ఆకాసంలోకి తారా జువ్వలు వేశారు. అదీ రైల్వే ట్రాక్ పక్కన. కార్యకర్తల అత్యుత్సాహం, అలవిమాలిన నిర్లక్ష్యం కారణంగా వారు వేసిన తారా జువ్వలు ఆ సమయంలో అటుగా వెళుతున్న రైలుపై పడ్డాయి. అదృష్ట వశాత్తూ ఎటువంటి ప్రమాదం జరగలేదు కనుక సరిపోయింది కానీ....లేకుంటే భారీ నష్టం జరిగి ఉండేది. వైపాకా కార్యకర్తలు వెలిగించి ఎగరేసిన జువ్వలు ఆ సమయంలో అటుగా వెళుతున్న ప్రయాణీకుల రైలుపై పడిన దృశ్యాలు
సామాజిక మాధ్యమంతో విస్తృతంగా ట్రెండ్ అవుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/peoples-life-in-risk-with-ap-new-ministers-overaction-25-134539.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని పేర్కొన్నాయి. ఈ లేఖపై ఇండియా కూటమికి చెందిన 23 పార్టీల నాయకులు సంతకాలు చేశారు.
దీంతో తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
Publish Date:Jun 30, 2026
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు.