వైసీపీలో తీవ్ర‌ వర్గపోరు.. భగ్గుమంటున్న విభేదాలు

Publish Date:Apr 18, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గాన్ని విస్తరించి వారం రోజుల పైనే అయింది. కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. పవర్’ ను  పవర్’తో పాటు వచ్చిన కొత్త వైభోగాలను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, మరోవంక మంత్రులు, మాజీల మధ్య యుద్ధం నడుస్తోంది. మంత్రివర్గ విస్త’రణం’తో  పాతకొత్త మంత్రుల మధ్య, మొత్తంగా అధికార వైసీపీలో రగిలిన, రాజకీయ మంటలు మంత్రం నివురు గప్పిన నిప్పులా భగ్గుమంటూనే ఉన్నాయి. నిజానికి, రోజు రోజుకు హీట్ పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అధికార పార్టీలో, పాతకొత్త మంత్రుల మధ్య పార్టీ రెండుగా చెల్లిపోయింది. ఏ వర్గానికి ఆ వర్గం తగ్గేదేలే’ అన్నట్లుగా వ్యహరిస్తోది. ఒక్క మాటలో చెప్పాలంటే, అధికార పార్టీలో అగ్గి రాజుకుంది. భగ్గుమనేందుకు సిద్దంగా ఉంది.నిజానికి, పార్టీలోనే కాదు, అన్నదమ్ముల మధ్య  మంత్రి పదవుల కుండమార్పిడి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. 

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ధర్మాన సోదరులు గతంలో అపూర్వ సోదరులుగా ఉన్నరని అనలేము కానీ, ఇప్పుడు ఆగర్భ శత్రువులుగా మారారు అనేది మాత్రం నిజం అంటున్నారు.  ఇద్దరి మధ్య మంత్రివర్గ విస్తరణ చిచ్చు పెట్టింది. పచ్చగడ్డివేస్తే భగ్గుమనే చిచ్చు తెచ్చి పెట్టింది. గ్యాప్ పెంచింది. మంటలు రాజేసింది. చివరకు అన్నదమ్ముల మధ్య మాటలు కూడా ‘కట్’ అయ్యాయనే టాక్ వైసీపీలో వినిపిస్తోంది. 
మంత్రివర్గ విస్తరణకు ముందు, అన్న ధర్మాన కృష్ణ దాస్, రెవిన్యూ శాఖ మంత్రి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దగ్గర మంచి మార్కులే తెచ్చుకున్నారు. అయినా ,విస్తరణ తర్వాత మంత్రి పదవితో పాటుగా, రెవిన్యూ శాఖ కూడా బ్రదర్  ధర్మాన ప్రసాద రావుకు దక్కింది. అయితే రెవిన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునే రెవిన్యూ శాఖలో అవినీతి పేరుకు పోయిందని,ధర్మాన చేసిన వ్యాఖ్య ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.ఆయన, ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్య చేశారో ఏమో కానీ మాజీ మంత్రి అన్న కృష్ణ దాస్’ పైనే ధర్మాన అవినీతి  ముద్ర వేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కృష్ణ దాస్ సైలెంట్’గానే ఉన్నా, ఇటు అధికార పార్టీలోఅటు అధికార వర్గాల్లో మాత్రం, మంత్రి ధర్మాన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా రెవిన్యూ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు కొత్త మంత్రి వస్తూవస్తూనే తమ శాఖ ఉద్యోగులపై అవినీతి ముద్ర వేయడం ఏమిటని,ప్రశ్నిస్తున్నారు. రెవిన్యూ సర్వీసెస్ ఉద్యోగుల సంఘం  అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కొంత సౌమ్యంగానే అయినా, ‘అన్నీ’ తెలిసిన ధర్మాన తమను అవినీతి పరులు అనడం ఏమిటన్నారు. ఈ రాష్ట్రంలో  నిజాయితీగా పని చేసే శాఖ ఏదైనా ఉందంటే అది రెవెన్యూ శాఖే అని చెప్పుకొచ్చారు.పరిస్థితులు గతంలోలాగా లేవని గుర్తిస్తే, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ధర్మానకు చురకలు అంటించారు. 

అదలా ఉంటే, ధర్మాన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగానూ ధర్మాన వ్యాఖ్యలు అధికార పార్టీలో దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖ అవినీతి పేరుకుపోయిందని  స్వయంగా ఆ శాఖ మంత్రే, ‘కితాబు’ ఇస్తే ఇక ప్రభుత్వం తల ఎక్కడ పెట్టుకోవాలని వైసీపీ నాయకులు వాపోతున్నారు. 

అంతే కాకుండా, ధర్మాన వ్యవహరం గుడ్డొచ్చి పిల్లను ఎక్కిరించినట్లుందని అంటున్నారు, కృష్ణ దాస్ అనుచరులు. కృష్ణ దాస్ మొదటి నుంచి వైసీపీలో ఉన్నారు. కష్టనష్టాలు అనువించారు. కానీ, ధర్మాన ప్రసాద రావు అలా కాదు. చివరి వరకు కాంగ్రెస్’లో పవర్ అనుభవించి, ఆ తర్వాత ‘అన్న’ పేరు చెప్పుకుని వైసీపీలో చేరారు. చివరకు, అన్న పదవినే కొట్టేశారు. అయినా ఆయనపైనే అవినీతి ఆరోపణలు చేయడం ఏమిటని, ఇది అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టే ధర్మాన దుర్మార్గ నిజానికి అడ్డం పడుతోందని కృష్ణదాసు అనుచరులు అగ్గిమీద్ గుగ్గిలం అవుతున్నారు. 

నిజానికి, రాజకీయాల్లో ధర్మాన జూనియర్ (ప్రసాద రావు) సీనియర్ అయినా, వైసీపీలో   ధర్మాన కృష్ణ దాస్ సీనియర్. ధర్మాన రాష్ట్రంలో కాంగ్రెస్ కథ ముగిసే వరకు హస్తం పార్టీలోనే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చిట్టచివరి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో చివరి రోజువరకు రెవెన్యూ మంత్రిగా కొనసాగారు. కృష్ణదాస్ మాత్రం 2003 ఉద్యోగం వదిలి రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి వైఎస్ ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ పాదయాత్రలో పాల్గొని, ఆయన వెంట నడిచారు. ఆ తర్వాత, మంచైనా, చెడైనా జగన్ రెడ్డి వైసీపీ పెట్టినప్పటినుంచి వైసీపీలో ఉన్నారు. ఈ నేపధ్యంలోనే, ఇప్పుడు ధర్మాన వచ్చి అన్నను అవమానించడం ఏమిటని, కృష్ణదాస్ వర్గం ఆగ్రహం వ్యక్త పరుస్తోంది. నిజానికి ఈ విషయం ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్లిందని అంటున్నారు. జిల్లాలో అయితే, వైసీపీ ధర్మాన సోదరుల మధ్య రెండుగా చీలిపోయిందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఇది చివరకు ఎందాక వెళుతుందో అని రాజకీవై వర్గాలో చర్చ జరుగుతోంది. 

అదలా ఉంటే, ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైసీపీలో  నివురు గప్పిన నిప్పులలా ఉన్న విబేధాలు,ఎప్పుడైనా, ఎక్కడైనా భగ్గుమనే ప్రమాదం ఉందని పరిశీలకులు అంటున్నారు.నిజానికి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో అధికార వైసీపీలో చోటు చెసుకున్న అంతర్గత విభేదాలు జగన్ రెడ్డి స్థాయిని, పార్టీ మీద ఆయన పట్టును తగ్గించాయని, అంటున్నారు.

By
en-us Political News

  
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.