చిరకాల సమస్యలు చిటికెలో పరిష్కారం!
Publish Date:Jul 22, 2024
Advertisement
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి లోకేష్.. సమస్యలపై వేగంగా స్పందించి పరిష్కరించడంలో తనకు తానే సాటి, పోటీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయన దృష్టికి వచ్చిన సమస్య చిటికెలో పరిష్కారం అయిపోతోంది. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో లోకేష్ ఏ మాత్రం జాగు లేకుండా స్పందిస్తున్నారు. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో దివ్యాంగుల ప్రవేశానికి అడ్డంకిగా ఉన్న జీవోను సవరించడంలో కానీ, ఎక్కడో గల్ఫ్ దేశంలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న వ్యక్తిని రోజుల వ్యవధిలో స్వరాష్ట్రానికి చేర్చడంలో కానీ లోకేష్ స్పందించిన తీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అసలు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచీ లోకేష్ ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో చొరవ తీసుకుంటున్నారు. తన నివాసంలో ప్రతి రోజూ ప్రజాదర్బార్ ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా, ఈమెయిల్ ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం విషయంలో వేగంగా స్పందిస్తున్నారు. లోకేష్ ఒరవడిని తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు కూటమి మంత్రులు అనుసరిస్తున్నారు. చిటికెలో సమస్యలు పరిష్కరంచేస్తున్న లోకేష్ వేగాన్ని తాము అందుకుంటామని చెబుతున్నారు. ఇలా లోకేష్ సహచర మంత్రులకు ఒక టాస్క్ ఫిక్స్ చేశారనే చెప్పాలి.
తాజాగా కర్నూలు జిల్లా మర్లమాడి గ్రామానికి చెందిన విద్యార్థులు ఒక ఈమెయిల్ ద్వారా తమ గ్రామానికి బస్సులేకపోవడంతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లడానికి ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అవస్థలను లోకేష్ దృష్టికి తీసుకు వెళ్లారు. అంతే వెంటనే ఆ గ్రామానికి బస్సు వచ్చేసింది. విద్యార్థుల ఇబ్బందులు తొలగిపోయాయి. అంతే కాదు తన సహాయం కావలసిన వారెవరైనా సరే hello.lokesh@ap.gov.in అడ్రస్ కు ఈమెయిల్ చేస్తే చాలని లోకేష్ చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/people-problems-solve-in-no-time-25-181216.html





