‘డిజిటల్ అరెస్ట్’ మోసాలతో జాగ్రత్త...వైరల్ అవుతున్న పెమ్మసాని పోస్ట్

Publish Date:Apr 29, 2026

Advertisement

 

డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో జరిగే సైబర్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ సూచించారు. పోలీసు అధికారులుగా నటిస్తూ, సైబర్‌ నేరగాళ్లు వీడియో కాల్స్‌ చేసి డబ్బులు వసూలు చేస్తారని తెలిపారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్‌ నేరాలపై 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేయాలని సూచించారు. ఇలాంటి నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఒక వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.'డిజిటల్ అరెస్ట్ మోసాలతో జాగ్రత్త!. ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు.

 పోలీసు అధికారులు లేదా ప్రభుత్వ ప్రతినిధులుగా నటిస్తూ వీడియో కాల్స్ ద్వారా ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాత కాల్స్, సందేహాస్పద లింకులు, ఓటీపీలు ఎప్పటికీ షేర్ చేయకండి. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించండి లేదా 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి. స్మార్ట్‌గా ఉండండి, సురక్షితంగా ఉండండి. ఒక్క క్లిక్ మీ భవిష్యత్తును మార్చొచ్చు. జాగ్రత్తగా ఆలోచించండి' అని పెమ్మసాని చంద్రశేఖర్ ఆ పోస్టుల్లో సూచించారు. సినీ నటులతో రూపొందిన ఆ పోస్టులోని వీడియో తెగ వైరల్ అవుతోంది.

 

https://x.com/PemmasaniOnX/status/2049337226950238522

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠకు తెరలేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఘనంగా ముగిసింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఓటర్ల ఉత్సాహంతో ఊగిపోయింది
ఏపీ సీఎస్ జి. సాయిప్రసాద్ కుటుంబంలో జరిగిన శుభకార్యానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు.
హైదరాబాద్‌లో పోలీస్ యూనిఫామ్‌లో రీల్స్ చేస్తూ హల్‌చల్ సృష్టించిన సూడో పోలీసును సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియా పరిచయాలు ఒక్కోసారి జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి.
సీఎం రేవంత్‌ను కలిసిన నూతన డీజీపీ సీవీ ఆనంద్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. పబ్లిసిటీ పిచ్చి ప్రపంచం మొత్తానికి తెలిసిందే.
ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిని తిడుతుంటే తనకు “శాడిస్టిక్ ప్లెజర్” వస్తుందని చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను విద్యాశాఖ అధికారులు ఇవాళ అధికారికంగా విడుదల చేశారు
బ్యాంకు అధికారులు తన సోదరి చనిపోయిందని నమ్మడం లేదనీ.. ఆమెను స్వయంగా తీసుకురావాలని అన్నారని అంటాడు జీతూ. అమాయకత్వం, చదువు లేకపోవడం, బ్యాంకు నిబంధనల పట్ల త‌గిన‌ అవగాహన లేకపోవడంతో.. తన సోదరి చనిపోయిందని నిరూపించడానికి ఆమె సమాధిని తవ్వి, అందులోని అస్తిపంజరాన్ని సంచిలో వేసుకుని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకుకు కాలినడకన చేరుకున్నాడు జీతూ.
చంద్రబాబు నాయుడుకు హైటెక్ అనే పేరు ఊరికే రాలేదు. 90వ దశకంలోనే ఐటి ప్రాధాన్యతను గుర్తించి, చేతిలో ఒక పామ్ టాప్ పట్టుకుని తిరుగుతూ అప్పట్లోనే అందరినీ ఆశ్చర్యపరిచారు చంద్ర‌బాబు. తాజాగా గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయన ఫోన్ చూసి ఆశ్చర్యపోవడం, బాబు గారి అప్‌డేటెడ్ లైఫ్‌స్టైల్‌కు మరో నిదర్శనంగా చెబుతారు.
బంగ్లాదేశ్‌లోని 64 జిల్లాలకు గానూ 58 జిల్లాల్లో మీజిల్స్ వేగంగా విస్తరిస్తోంది. దాదాపు 90 శాతం దేశం మీజిల్స్ ప్రభావానికి గురైంది. మార్చి మధ్య కాలం నుండి ప్రారంభమైన ఈ వ్యాప్తి ఉధృతి ఏప్రిల్ ఆఖరు నాటికి పతాక స్థాయికి చేరింది. సుమారు 30 వేల మందికి పైగా చిన్నారులు.. మీజిల్స్ లక్షణాలతో బాధపడుతుండగా, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.