ఉత్కంఠ రేపుతున్న ఎగ్జిట్ పోల్స్... బెంగాల్లో కమలం వికసించేనా?
Publish Date:Apr 29, 2026
Advertisement
దేశవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠకు తెరలేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఘనంగా ముగిసింది. ఈ క్రమంలో, ప్రముఖ సర్వే సంస్థ 'చాణక్య స్ట్రాటజీస్' వెల్లడించిన ఎగ్జిట్ పోల్ అంచనాలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌తో సహా ఐదు రాష్ట్రాల్లోని ఓటర్ల నాడిని ఈ సంస్థ అంచనా వేయగా, కొన్ని చోట్ల అధికార పక్షాలకే మొగ్గు ఉండగా, మరికొన్ని చోట్ల కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు సర్వే స్పష్టం చేస్తోంది. పశ్చిమ బెంగాల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి తృణమూల్ కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చినట్లు సర్వే చెబుతోంది. తాజా అంచనాల ప్రకారం, 150 నుంచి 160 స్థానాలతో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉండగా, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ 130-140 స్థానాలకు పరిమితం కావచ్చు. ఓట్ల శాతంలోనూ కమలనాథులు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తురని చాణక్య స్ట్రాటజీస్ అంచన వేసింది. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో మాత్రం డీఎంకే నేతృత్వంలోని కూటమి హవా కొనసాగుతోంది. 145-160 స్థానాలతో స్టాలిన్ పార్టీ మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవడం ఖాయమని సర్వే తేల్చి చెప్పింది. నటుడు విజయ్ నేతృత్వంలోని కొత్త పార్టీ 'తమిళగ వెట్రి కళగం' కూడా గణనీయమైన ఓట్లు సాధించి, కొన్ని సీట్లను కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. కేరళలో ఈసారి అధికార మార్పు తప్పదని సర్వే హెచ్చరిస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 72-80 సీట్లతో విజయం సాధించనుండగా, ప్రస్తుత అధికార ఎల్డీఎఫ్ వెనుకబడే సూచనలు కనిపిస్తున్నాయి. అస్సాంలో మాత్రం సీఎం హిమంత బిశ్వ శర్మ చరిష్మా పనిచేయడంతో, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 88-98 సీట్లతో ఘనవిజయం దిశగా సాగుతోంది. పుదుచ్చేరిలో సైతం ఎన్డీయే కూటమి తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ, మ్యాజిక్ ఫిగర్ 16 కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుని అధికార పీఠాన్ని దక్కించుకోనుంది. విపక్ష కూటమి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, విజయం సాధించడంలో విఫలమవుతుందని సర్వే వెల్లడించింది. ఈ సర్వే ఫలితాలు రాజకీయ విశ్లేషకుల్లో వేడిని పెంచాయి. అయితే, ఇవి కేవలం అంచనాలు మాత్రమేనని, అసలైన ప్రజా తీర్పు మే 4న వెలువడే ఫలితాల్లోనే బయటపడుతుందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజలు ఎవరికి పట్టం కట్టారో తెలుసుకోవడానికి మరో కొద్ది రోజులు వేచి చూడక తప్పదు. చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్. బీజేపీ 150-160, TMC 130-140, INC-2-4, ఇతర పార్టీలు 4-6 తమిళనాడు (మొత్తం: 234) డీఎంకే: 125 – 145 కేరళ (మొత్తం: 140) యూడీఎఫ్: 75 – 85 అసోం (మొత్తం: 126) బీజేపీ: 88 – 101 పశ్చిమ బెంగాల్ (మొత్తం: 294) టీఎంసీ: 177 – 187 పుదుచ్చేరి (మొత్తం: 30) ఎన్ఆర్సీ: 16 – 19
తమిళనాట (234) డీఎంకే కూటమి 145-160, AIADMK 50-65, TVK 13-18, ఇతర పార్టీలు 5-8 సీట్లు
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్.
తమిళనాడు (234): డీఎంకే 125-146,ఏడీఏఎంకే 65-80
టీవీకే 18-24, ఇతరులు 2-6
కేరళం (140): ఎల్డీఏఫ్ 55-65, యూడీఎఫ్ 75-85, ఎన్డీఏ 0-3
అసోం (126): బీజేపీ 68-72, కాంగ్రెస్ 22-26,ఏజీపీ 7-10, బీపీఎఫ్ 8-9
ఏజెన్సీ: పీపుల్స్ పల్స్
ఏడీఎఎంకే: 65 – 80
టీవీకే (విజయ్): 18 – 24
ఇతరులు : 2 – 6
ఏజెన్సీ: పీపుల్స్ పల్స్
ఎల్డీఎఫ్: 55 – 65
బీజేపీ: 0 – 3
ఇతరులు : 0
ఏజెన్సీ: యాక్సిస్ మై ఇండియా
కాంగ్రెస్: 15 – 36
ఏఐయూడీఎఫ్: 0
ఇతరులు: 0 – 3
ఏజెన్సీ: పీపుల్స్ పల్స్
బీజేపీ: 95 – 110
కాంగ్రెస్: 1 – 3
వాపక్షాలు: 0 – 1
ఏజెన్సీ: పీపుల్స్ పల్స్
కాంగ్రెస్: 10 – 12
ఇతరులు: 1 – 2
http://www.teluguone.com/news/content/exit-polls-2026-36-218579.html





