పొగాకు రైతులను ఆదుకుంటాం.. బోగాపురం చంద్రబాబు విజన్ వల్లే సాకారం.. పెమ్మసాని.!

Publish Date:Aug 3, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలువురు ఎంపీలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో రైతుల ప్రయోజనాలే పరమావధిగా కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన ప్రకటించారు.

రాష్ట్రంలో ఈ సీజన్‌లో 140 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి అనుమతి ఉండగా, రైతులు వివిధ కారణాల వల్ల దాదాపు 240 మిలియన్ కిలోల వరకు పండించారని కేంద్రమంత్రి వివరించారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, అధిక ఉత్పత్తి కారణంగా ధరలు క్షీణించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవడానికి సమగ్ర ప్రణాళిక రూపకల్పన చేసినట్లు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం తరఫున బోర్డు పరిధిలోని ప్రతి పొగాకు రైతుకు (45 వేల బాండ్లకు) రెండేళ్ల కాలపరిమితితో  50 వేల రూపాయల వడ్డీ లేని రుణం అందిస్తున్నామన్న పెమ్మసాని..  దీని ద్వారా సుమారు  250 కోట్ల నిధులు రైతులకు అందుబాటులోకి రానున్నాయన్నారు. అదేవిధంగా, లో గ్రేడ్, ఆఫ్ స్టైల్ పొగాకుకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం కిలోకు  10 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందని.. దీనికోసం రాష్ట్ర బడ్జెట్ నుండి 100 కోట్ల రూపాయలు  కేటాయించినట్లు తెలిపారు.

మరోవైపు పొగాకు కొనుగోలుదారులతో చర్చలు జరిపి కనీస మద్దతు ధరలు ఖరారు చేశామని పెమ్మసాని వివరించారు.   బ్రైట్ గ్రేడ్‌కు 230 రూపాయలు, మీడియంకు  190, లో-గ్రేడ్‌కు  110, ఆఫ్ స్టైల్‌కు  130 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేసేందుకు ఎగుమతిదారులు అంగీకరించారని పెమ్మసాని చెప్పారు. ఈ వేలం ప్రక్రియను రోజుకు 2 మిలియన్ కిలోల చొప్పున రాబోయే రెండు నెలల్లో వేగంగా పూర్తి చేయాలని  స్పష్టంగా ఆదేశించామన్నారు.  

జగన్  ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కేవలం ఒకే ఒక్కసారి   105 కోట్ల రూపాయలతో మార్కెట్ జోక్యం చేసుకుంటే, తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే బ్లాక్ బర్లీ రైతులకు  146 కోట్లు ఇచ్చిందని గుర్తు చేసిన పెమ్మసాని.. ఇప్పుడు  మళ్లీ  100 కోట్ల రూపాయల సాయం అందిస్తూ రైతు పక్షాన నిలిచామని చెప్పారు.  

ఇక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని  విమర్శించారు.   2015లోనే నాటి  తెలుగుదేశం ప్రభుత్వం  చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.

అయితే గతంలో జగన్ కోర్టు కేసులు వేయించి, 500 ఎకరాల సేకరణను అడ్డుకుని ప్రాజెక్టును జాప్యం చేశారని  ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక జీఎంఆర్ టెండర్లను రీటెండర్ చేసినా నిబంధనలేవీ మారలేదని, కేవలం కాలయాపన చేసి ప్రాంతాభివృద్ధికి విఘాతం కలిగించారని విమర్శించారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించి భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని వేగవంతం చేశారని పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు.   ఇప్పటికే విశాఖ నుంచి ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ కల్పించే ఐదు రహదారుల పనులు పూర్తయ్యాయని, మిగిలిన రెండు రహదారులను కూడా త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు.

Pemmasani Chandrasekhar, Tobacco Farmers AP, Bhogapuram Airport, AP Cabinet ReviewAP TDP Coalition News

By
en-us Political News

  
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. 
ఇప్పటి వరకూ  గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్   రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.