వైసీపీలో సజ్జలకు ఎగ్జిట్ డోర్ ఓపెన్?

Publish Date:Aug 6, 2026

Advertisement

ఏపీ పాలటిక్స్ లో వైసీపీ అంతర్గత వ్యవహారాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.   మాజీ సీఎం, వైసీపీ అధినేత నివాసం అయిన తాడేపల్లి ప్యాలెస్ ఎదుట.. ఆ పార్టీ సీనియర్ నాయకుడు బోరుగడ్డ అనిల్ తన భార్యతో కలిసి ధర్నాకు దిగడం కలకలం రేపడమే కాకుండా వైసీపీలో సంచలనం సృష్టించింది.  పార్టీ అధినేత  జగన్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన అనిల్.. ఈ సందర్భంగా పార్టీలో నంబర్ 2గా చెలామణి అవుతున్న సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై బాహాటంగా విమర్శలు గుప్పించడమే కాకుండా తీవ్ర ఆరోపణలు చేశారు.  

వైఎస్ జగన్ నివాసం వెలుపల ఉన్న  ప్రతి కార్యకర్త కష్టాన్నీ నేను మరిచిపోను అనే ఫ్లెక్సీ ముందే బోరుగడ్డ అనిల్ ధర్నాకు దిగడం విశేషం. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్దకు వచ్చిన తనకు అధినేతను కలిసే అవకాశం ఇవ్వకుండా సజ్జల అడ్డుకుంటున్నారని ఆరోపించారు.   తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి రావొద్దని సజ్జల రామకృష్ణారెడ్డి తన అనుచరులతో చెప్పించారనీ,  తనపై 'రౌడీషీటర్' అనే ముద్ర వేసి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టారు.

బోరుగడ్డ అనిల్ ధర్నా ఏదో వ్యక్తిగత వ్యవహారం కాదనీ, సజ్జలకు పార్టీ నుంచి ఎగ్జిట్  చేయడానికి డోర్ ఓపెన్ చేయడంలో భాగంగా పడిన ఫస్ట్ స్టెప్ అనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు వైసీపీలో ఒకప్పుడు నంబర్ 2గా ఉండి, ఆ తరువాత పార్టీ వీడిన విజయసాయి రెడ్డి పార్టీలోకి తిరిగిరానున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ సజ్జలపై విమర్శలు గుప్పిస్తూ.. బోరుగడ్డ ఏకంగా జగన్ నివాసం ఎదుట ధర్నాకు దిగడం కాకతాళీయం ఎంత మాత్రం కాదని అంటున్నారు.  

గతంలో విజయసాయి రెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్ వంటి సీనియర్ నేతలు సైతం పార్టీలోని కోటరీ వైఖరి పట్ల, మరీ ముఖ్యంగా సజ్జల తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బహిరంగంగానే విమర్శలు గుప్పించిన విషయాన్ని పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.   ఇప్పుడు పార్టీలోకి విజయసారి తిరిగి రానున్నారన్న ప్రచారం జరుగుతున్న సమయంలోనే బోరుగడ్డ ధర్నా ప్రాముఖ్యత సంతరించుకుంది. సజ్జలకు ఉద్వాసన పలికే దిశగా బోరుగడ్డ చేత విమర్శలతో వైసీపీ అగ్రానాయత్వం వ్యూహాత్మకంగా తొలి అడుగు వేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

అదలా ఉంటే ఇటీవలి కాలంలో పార్టీ అధినేత జగన్ సజ్జల తీరు పట్ల అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ముఖ్యంగా   ప్రతిపాదించిన  రాజధాని ప్రతిపాదనను   పార్టీ శ్రేణులకు చేరవేయడంలో సజ్జల విఫలమయ్యారనీ, అలాగే సొంత మీడియా కూడా మావిగన్ కు ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వకపోవడానిక సజ్జల సూచనలే కారణమనీ జగన్ ఆగ్రహంతో ఉన్నారంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాధాన్యత తగ్గంచి ఆయనకు ఎగ్జిట్ డోర్ చూపించే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారనీ, అందులో భాగంగానే బోరుగడ్డ అనీల్ ను ముందుకు తెచ్చరనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి బోరగడ్డ అనిల్ ధర్నా రానున్న రోజులలో వైసీపీలో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో? విజయసాయి రీఎంట్రీ వార్తలు, బోరుగడ్డ ధర్నా అంశాలను వేరువేరుగా చూడలేమనీ, పార్టీలో రానున్న రోజులలో జరగబోయే మార్పులకు ఇవి సంకేతాలనీ చెబుతున్నారు. 

Exit door to Sajjala, YSRCP internal differences, Borugadda Anil dharna,  Tadepalli Jagan residence, Vijayasai Reddy Reentry

By
en-us Political News

  
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న  స్థానిక  ఎన్నికల్లో  బీజేపీకి  ఏ పార్టీతోనూ  పొత్తులు పెట్టుకునే ఆలోచన  లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్‌కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.