అడవిదొంగ పెద్దిరెడ్డి.. విజిలెన్స్ నివేదిక వెల్లడి!

Publish Date:Feb 10, 2025

Advertisement

వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబీకులందరూ అటవీ భూముల ఆక్రమణలో నిండా మునిగినట్లే. చట్టాలను పూర్తిగా ఉల్లంఘించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు అందరూ దశాబ్దాలుగా అటవీ భూములను ఆక్రమించి పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారని విజిలెన్స్ నివేదిక  తేటతెల్లం చేసింది. అటవీ భూముల ఆక్రమణ, పర్యావరణ విధ్వంసానికి పాల్పడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబీకులపై అటవీ సంరక్షణ చట్టాల మేరకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని సిఫారసు చేసింది. ఆ నివేదికలో పెద్దిరెడ్డి ఆయన కుటుంబీకుల మీద ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది అన్న అంశంపై విజిలెన్స్ నివేదిక వివరంగా పేర్కొంది. పెద్దిరెడ్డి, యఆయన కుటుంబ సభ్యులపై విజిలెన్స్ నివేదిక సిఫారసుల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమౌతోంది. 

పుంగనూరు నియోజకవర్గంలోని మంగళం పడవల్లో పెద్దిరెడ్డి అటవీ భూముల కబ్జా వ్యవహారం వెలుగులోనికి వచ్చింది. అటవీ భూమిని ఆక్రమించి విలాసవంతమైన భవనం నిర్మించిన విషయం తేటతెల్లమైంది. అయితే అడవి మధ్యలో తాను భవనం నిర్మించిన భూమిని తాను ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేశానని, అక్కడ నిర్మించిన భవనం పనివాళ్ల కోసమని పెద్దరెడ్డి చెప్పారు.  దీనిపై విచారణ జరిపిన అధికారులు ప్రజాధనంతో రోడ్డు వేసుకోవడం దగ్గర నుంచి మొత్తం ఎంత భూమి వారి అధీనంలో ఉంది.. ఎంత భూమి కబ్జా చేశారో లెక్కలు తేల్చారు. మొత్తం వివరాలతో నివేదిక సమర్పించారు.

పెద్దిరెడ్డి .. ఆయన కుటుంబం చేసిన అరాచకాలు ఇప్పుడు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.  జగన్ అడ్డగోలు విధానాలను అంతకంటే అడ్డగోలుగా అంగీకరించి ఆచరించి, ఆయన చెప్పినట్టలా చేసిన పెద్దరెడ్డి అందుకు ప్రతిఫలంగా దోపిడీకి లైసెన్స్ తీసున్నారా అన్నట్లుగా అన్ని రకాల నిబంధనలనూ తుంగలోకి తొక్కి యథేచ్ఛగా కబ్జాల పర్వం కొనసాగించారు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం దోపిడీకి కాదే భూమి అనర్హం అన్నట్టుగా పెద్దిరెడ్డి ఆయన కుటుంబీకులూ రెచ్చిపోయారు. పెద్దిరెడ్డి కబ్జాల పర్వంలో మునిగి తేలుతూ ఉంటే.. ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిమద్యం స్కాం మొత్తాన్ని తన కనుసన్నలలో నిర్వహించారు.  ఇలా కబ్జాలతోనూ, కుంభకోణాలతోనూ అడ్డగోలుగా సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని చిత్తూరుల తెలుగుదేశం పార్టీని ఉనికి కూడా లేకుండా చేయాలన్న కుట్రలను అమలు చేశారు. ఇందులో భాగంగానే  చంద్రబాబుపై  రాళ్ల దాడులు, హత్యాయత్నాల వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మొత్తం మీద పెద్దరెడ్డి అటవీ భూముల ఆక్రమణ కేసుల్లోనూ, ఆయన కుమారుడు మిధున్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో బయట పడే అవకాశలు పెద్దగా కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన వాస్తవ వేదికలో దేశ రాజకీయ పరిస్థితుల
ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? దీనివల్ల ఇండియాలో కూడా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో వచ్చినట్లు ప్రజా విప్లవాలు వస్తాయా అనే చర్చలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ఈ తీవ్రమైన రాజకీయ పరిణామాలపై ప్రముఖ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ లిబర్టీ అధినేత నలమోతు చక్రవర్తి తెలుగువన్ ఇంటర్వ్యూలో అనేక లోతైన విశ్లేషణ చేశారు.
ఇక తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు 2026 విషయానికి వస్తే.. ఈ సారి మహానాడు సరికొత్త రాజకీయ ఒరవడికి వేదికైంది. నెల్లూరులో భారీ ఎత్తున ఏర్పాటు చేయాలనుకున్న ఈ వేదికను, మోడీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా హైబ్రిడ్ మోడల్‌లోకి మార్చారు.
వైసీపీ అధినేత జగన్ తో తాడేపల్లి ప్యాలెస్ లో భేటీ అనంతరం బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన యథాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు.
ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర రాష్ట్రాలకు కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. రాబోయే ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
2023 మేలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కుదిరిన అంతర్గత ఒప్పందం ప్రకారం ఆయన తన పదవి వదులుకున్నారు. బెంగళూరులోని తన అధికారిక నివాసం కావేరి లో గురువారం (మే 27) ఏర్పాటు అల్పాహార విందు సమావేశంలో ఇదే విషయాన్ని తన క్యాబినెట్ సహచరులకు వెల్లడించారు.
ఈ మహానాడులో తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లోకేష్ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కేవలం 31 లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలైందని, అక్కడ తొలగించిన ఓట్ల సంఖ్య దీనికంటే ఎంతో ఎక్కువగా ఉందని చెప్పిన జగన్.. అలాగే.. తమిళనాడులో డీఎంకే కూటమి 17 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, అక్కడ కూడా 74 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా ఫలితాలు తారుమారయ్యేలా చేశారని ఎత్తి చూపారు. . ఈ భారీ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని జగన్ విమర్శించారు.
అధికార బదిలీ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని అంటున్నారు. అధిష్టానం సూచనల మేరకు రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఆ వెంటనే నూతన సీఎం ఎంపిక ప్రక్రియ లాంఛనంగా ముగుస్తుందని అంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా, తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి తీరుతాం అని మహానాడు వేదికగా లోకేష్ ప్రకటించారు.
ఈ రెండు రోజుల వేడుకలో వివిధ అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది.
ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.