సంక్షోభాలలే అవకాశాలు: చంద్రబాబు క్రైసిస్ మ్యాన్.. లోకేష్ డోలో 250 మ్యాన్.!
Publish Date:Sep 26, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం. క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ఆయనకు ఆయనే సాటి. ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. ఇక ఇప్పుడు చంద్రబాబు తనయుడు, తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేష్ సైతం అదే బాటలో నడుస్తున్నారు. పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్ల సమస్యలను పరిష్కరించే విషయంలో లోకేష్ తనను తాను డోలో 650 మ్యాన్ గా ఆయన అభివర్ణించుకున్నారు. సాధారణంగా జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలకు డోలో 650 తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. ఇదే విషయాన్ని ఉదహరిస్తూ నారా లోకేష్ తాను కూడా పారిశ్రామిక రంగంలో అదే పాత్ర పోషిస్తున్నానని చమత్కరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లకు ఇబ్బంది వస్తే.. తనకు ఫోన్ చేస్తారని, తక్షణమే ఆ సమస్యను పరిష్కరించేందుకు తాను ముందుంటానని లోకేష్ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ పారిశ్రామిక రంగం జోరందుకుంది. పెట్టుబడుల ప్రవాహం వరదనున తలపిస్తోంది. ఇదంతా లోకేష్ చొరవ ఫలితమే పరిశ్రమల ఏర్పాటులో ఎదురయ్యే అడ్డంకులను తొలగించడంలో, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడంలో లోకేష్ అనితర సాధ్యమన్న రీతిలో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రాజెక్ట్‌లను గ్రౌండింగ్ చేసే దశలో ఎలాంటి జాప్యం జరగకుండా లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తూ, పనులను పరుగులెట్టిస్తున్నారు. ఇన్వెస్టర్లకు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎలాంటి జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, ఇన్వెస్టర్లలో భరోసా నింపుతున్నారు. పెట్టుబడుల సాధనే ధ్యేయంగా ఆయన అనుసరిస్తున్న విధానం పారిశ్రామిక వర్గాల ప్రశంసలు అందుకుంటోంది. వ్యాపార ప్రక్రియ వేగవంతంగా సాగేలా చూస్తూ, కొత్త అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా లోకేష్ అడుగులు వేస్తున్నారు. తండ్రి చంద్రబాబు నాయుడు రాజకీయ శైలి నుంచి లోకేష్ ఈ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఏపీలో సరికొత్త పారిశ్రామిక విధానాలు అమలవుతున్న తరుణంలో, ఇన్వెస్టర్లకు నారా లోకేష్ ఇస్తున్న భరోసా ఏపీ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేవలం రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా, రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకు రావడంలోనూ, ఆ క్రమంలో ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని అక్కడికక్కడే పరిష్కరించడంలోనూ లోకేష్ చొరవ తండ్రి చంద్రబాబును మించి ఉంటుందని పరిశీలకులు చెబుతు న్నారు. లోకేష్ తనకు తాను తగిలించుకున్న డోలో 650 మ్యాన్ ట్యాగ్ ఆయనకు అతికినట్లు సరిపోయిందంటున్నారు. [AP CM CBN Crisis Man, Nara Lokesh, Dolo 650 Man, AP Investments, Investor Meet, Andhra Pradesh Industries, Investments, Troubleshoot, Telugu One]
http://www.teluguone.com/news/content/ap-cm-cbn-crisis-man-39-232611.html





