Publish Date:Feb 21, 2026
ట్రంప్ కు అమెరికా సుప్రీం కోర్టు షాక్
అమెరికా సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లను యూఎస్ సుప్రీం కోర్టు కొట్టేసింది. టారిఫ్‌లు విధించే అధికారం అధ్యక్షుడికి కానీ, వైట్‌హౌస్‌కు కానీ లేదని కుండబద్దలు కొట్టింది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వసూలు చేసిన సుంకాలను ట్రంప్ తిరిగి చెల్లించాల్సిందేనని అమెరికా అత్యున్నత న్యాయస్థానం విస్పష్ట తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు తీర్పుతో అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. మరోవైపు ఇప్పటికే ట్రంప్.. భారత్‌పై 18 శాతం సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. భారత్‌పై విధించిన 18 శాతం సుంకాలు కూడా అనధికారమేనని సుప్రీం పేర్కొంది.
అమెరికాలోకి ప్రవేశించే ఉత్పత్తులపై సుంకాలకు సంబంధించి ట్రంప్ దూకుడుగా వ్యవహరించడం అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం-1977కి విరుద్ధమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఈ తీర్పును ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ వెల్లడించారు. అయితే సుంకాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆరుగురు, అనుకూలంగా ముగ్గురు జడ్జిలు వేర్వేరుగా తమ తీర్పు ఇచ్చారు. సుంకాలతో సహా పన్నులు విధించే అధికారాన్ని రాజ్యాంగం అమెరికా కాంగ్రెస్‌కు మాత్రమే ఇచ్చిందనీ, కార్యనిర్వాహక శాఖకు కాదని ఈ సందర్భంగా న్యాయస్థానం వెల్లడించింది. జనవరిలో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక ఇలా సుప్రీం కోర్టులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు రావడం పెద్ద ఎదురుదెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pay-back-the-inflated-tariffs-36-214430.html
మొజ్తబా ఖమేనీ.. కుటుంబంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అత్యంత విషాదకరంగా, గందరగోళంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఉన్న సమాచారాన్ని బట్టీ చూస్తే.. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో.. ఇరాన్ సీనియర్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ.. చనిపోయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ గా ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీ ఉన్నారు. అయితే ఆయన ప్రస్తుతం కోమ్ నగరంలోని ఒక ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.
ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బుధవారం (ఏప్రిల్ 8) రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఆ బృందం అమరావతి నిర్మాణ ప్రగతిని ప్రశంసించింది.
జాబిల్లి యాత్రలో ఐఫోన్ల సందడి.. అంతరిక్షంలో ఆపిల్ స్మార్ట్‌ఫోన్ల ప్రయోగం సక్సెస్!
అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ భార్యపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల
రేణుక, మంద కృష్ణ ఇద్దరూ ఫైర్ బ్రాండ్లు కులం మెచ్చిన సామాజిక వీరులు
సోషల్ మీడియా వేదికలో అభ్యంతరకరంగా, దూషణాత్మకంగా వ్యాఖ్యలు పోస్టు చేసిన వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం జలవిహార్ వద్ద ఉన్న నీటి సరఫరా ఆర్వో ప్లాంట్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది.
మాములుగా దక్షిణాదిలో అత్యంత సంపన్న పొలిటీషియన్లలో విజయ్ కూడా ఒకరు.
20వ శతాబ్దం మధ్య నుంచి 21వ శతాబ్దం వరకు ప్రపంచ రాజకీయాల్లో ఒక నిరంతర ప్రభావశక్తిగా నిలిచింది అమెరికా.
ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత విషయంలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మౌనంగానే ఉండిపోయి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది. ఎందుకంటే.. అమరావతిని రాజధానిగా జగన్ వ్యతిరేకిస్తున్నారు కనుక. సపోజ్ ఫర్ సపోజ్ రేపు ఆయన అధికారంలోకి వస్తే అమరావతికి మద్దతుగా మాట్లాడిన వారిపై ప్రతీకార చర్యలకు దిగుతారన్న భయమే అందుకు కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కేరళ నుంచి కర్ణాటకకు వచ్చి ట్రెక్కింగ్ చేస్తూ తప్పిపోయిన జీఎస్ శరణ్య మిస్టరీలో నిజమెంత?
కృత్రిమ మేధ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ సంస్థ ఇప్పుడు ఉద్యోగ విధానాల్లోనూ సంచలన మార్పులకు తెరలేపుతోంది.