అక్కడ ప్రధానితో పవన్ భేటీ.. ఇక్కడ జనసేన ఇన్ చార్జ్ అరెస్టు

Publish Date:Nov 12, 2022

Advertisement

ఏపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. వైసీపీ చూపు ఎవరిపై పడుతుందో.. ఎవరిని ఎందుకు అరెస్టు చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులను ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు అరెస్టు చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు జనసేన నాయకులు, కార్యకర్తల విషయంలో కూడా అదే పరిస్థితి తలెత్తిందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ విశాఖపట్నం పర్యటనలో ఉన్నారు.

జనసేనాని పవన్ కల్యాణ్ ఆయనతో బేటీ అయ్యారు. సరిగ్గా పవన్ మోడీ విశాఖలో భేటీ అయిన సమయంలోనే నగరిలో జనసేన ఇన్ చార్జ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టును నిరసిస్తూ జనసేన ఇన్ చార్జి కిరణ్ రాయల్ కుటుంబ సభ్యులు నగరి పోలీసు స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. కిరణ్ కు నగరి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తీసుకువెళ్లారు.

కోర్టు వద్ద ఆయనకు మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇటీవలి కాలంలో జనసేనాని వైసీపీ సర్కార్,జగన్ పై విమర్శల తీవ్రత పెంచిన నేపథ్యంలోనే ఈ అరెస్టు జరిగిందని భావిస్తున్నారు. కాగా కిరణ్ అరెస్టును జనసేనాని, ఆ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ ఖండించారు. కాగా ఈ అరెస్టుకు నిరసనగా పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నగరికి చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మంత్రి రోజా నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేశారు.  

By
en-us Political News

  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.