మరో మారు మోడీ.. పవన్ బేటీ.. నేడూ విశాఖలోనే జనసేనాని?

Publish Date:Nov 12, 2022

Advertisement

ప్రధాని నరేంద్రమోడీతో జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖలో శుక్రవారం (నవంబర్ 11) భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఏపీకి మంచి రోజులు అని పవన్ మీడియాతో చెప్పారు. దీంతో ఇరువురి మధ్యా చర్చలు సహృద్భావ వాతావరణం జరిగాయని అంతా భావించారు. అయితే ఆ తదననంతర పరిణామాలను గమనిస్తే శుక్రవారం(నవంబర్ 11) ఇరువురి మధ్యా చర్చలు అసంపూర్తిగా ముగిశాయని అర్ధమౌతుంది. ఇరువురూ శనివారం(నవంబర్ 12) మరో సారి భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయనీ చెబుతున్నారు. అందుకే పవన్ కల్యాణ్ ఇంకా విశాఖలోనే ఉన్నారనీ మోడీతో ఆయన మరో సారి భేటీ అవుతారనీ అంటున్నారు.

మొత్తం మీద పవన్ తో భేటీ, బీజేపీ రాష్ట్ర నాయకులతో భేటీ, రోడ్ షోలతో ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఆద్యంతం రాజకీయంగా ఆసక్తి, ఉత్కంఠ రేపుతోంది. మోడీ విశాఖ పర్యటన ఏర్పాట్లన్నీ ఏపీ సర్కార్ స్వయంగా దగ్గరుండి చూసుకోవడం, ప్రధాని సభకు జనసమీకరణ కూడా జగన్ సర్కారే ముందుండి ఏర్పాట్లు చేయడం సర్వత్రా ఆసక్తి రేకెత్తించింది. అదే సమయంలో చివరి నిముషంలో ప్రధాని మోడీ తో భేటీకి పీఎంవో నుంచి పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  

విశాఖలో   నిర్వహించిన రోడ్ షో, పవన్ కళ్యాణ్ తో ఐఎన్ఎస్ చోళలో భేటీ, అనంతరం బీజేపీ కోర్ కమిటీతో భేటీ.. ఆ తరువాత శుక్రవారం (నవంబర్ 12) సీఎం జగన్ తో భేటీ.. ఇవన్నీ కూడా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలే కావడంతో మోడీ ప్రధానిగా ఈ పర్యటనకు వచ్చారా లేక పార్టీ అగ్రనేతగా పర్యటిస్తున్నారా అన్నఅనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం అలా ఉంచితే.. శుక్రవారం రాత్రి పవన్ తో బేటీ తరువాత కూడా పవన్ విశాఖలోనే బస చేయడం రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నది.

విశ్వసనీయ సమాచారం మేరకు ప్రధాని మోడీయే స్వయంగా పవన్ కల్యాణ్ ను శుక్రవారం కూడా అందుబాటులో ఉండాలనీ, మరో సారి బేటీ అవుదామనీ చెప్పారు. శుక్రవారం ప్రధాని మోడీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఐఎన్ఎస్ చోళ గెస్ట్ హౌస్ లో భేటీ అయ్యారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం, అంటే మోడీ అప్పాయింట్ మెంట్ మేరకు  ఇరువురు నేతల మధ్య  భేటీ పావుగంటలో ముగియాల్సి ఉంది. అయితే అది అలా ఎక్సటెండ్ అవుతూ దాదాపు 35 నిముషాల పాటు సాగింది. అయితే అది కూడా అసంపూర్తిగానే ముగియడంతో.. మోడీ శనివారం (నవంబర్ 12) మరో సారి కలుద్దాం అందుబాటులో ఉండండి అని పవన్ కు చెప్పినట్లు తెలుస్తోంది.  

అలాగే బీజేపీ నేతలతో బేటీ అనంతరం.. రాష్ట్రంలో పరిస్థితులపై మరింత అవగాహన ఏర్పరుచుకున్న మోడీ జనసేనాని పవన్ తో మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నారనీ, ఆ లోగా ముందుగా నిర్ణయించిన మేరకు శనివారం ఉదయం జగన్ తో బేటీ కూడా పూర్తయిన అనంతరం పవన్ తో భేటీ అయితే బెటర్ అని ఆయన భావిస్తున్నారని కమలం శ్రేణులే చెబుతున్నాయి.  

By
en-us Political News

  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.