జగన్ 2.o కామెంట్స్: పవన్ 10x కౌంటర్.. మామూలుగా లేదుగా.?

Publish Date:Oct 28, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార తెలుగుదేశం కూటమి, ప్రత్యర్థి పార్టీ వైసీపీల మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. స్థానిక సమరం వేళ జగన్ వ్యాఖ్యలకు జనసేనానిని, ఉపముఖ్యమంత్రి పవన్ ఇచ్చిన కౌంటర్ పొలిటికల్ డిబేట్ కు దారి తీసింది.  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  

తెలుగుదేశం కూటమి పార్టీల అగ్రనేతలు మంగళవారం (అక్బోబర్ 27) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్  ఇటీవల  పులివెందులలో జగన్ మీడియా సమవేశంలో  త్వరలో  జగన్ 2.0 లొ  తామేంటో నిరూపిస్తామని హెచ్చరించారు.

ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, పవన్ కల్యాణ్  మీరు కేవలం  2.0 చూపిస్తే మే 10X రెట్లు) ప్రతిస్పందన చూపిస్తామని రిటార్డ్ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా గతంలోనూ ఇలా వ్యవహరించినందుకే 2019 ఎన్నికలలో జగన్ కు జనం గుణపాఠం చెప్పారన్నారు బెదిరింపులకు భయపడి వెనకడుగు వేసే వాళ్లెవరూ లేరన్న ఆయన.. బలహీనులే ఇలాంటి బెదిరింపు ధోరణులు ప్రదర్శిస్తారని   ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధంగా వ్యవహరించడం మానుకుని, వైకాపా నాయకులు ఇకనైనా జనజీవన స్రవంతిలోకి రావాలని జనసేనాని పిలుపునిచ్చారు.

రానున్న రోజులలో కూటమి పార్టీలూ  విడిపోతాయనీ..  రానున్న ఎన్నికల్లో తమకు మళ్లీ అవకాశం దక్కుతుందనే అంచనాలతోనే వైఎస్ జగన్ తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ ఆ ఆశలకు గండి కొట్టేలా పవన్ కల్యాణ్ ఇప్పుడు 10x అన్నారని చెబుతున్నారు.   కూటమి పార్టీల మధ్య సంపూర్ణ సమన్వయం ఉందన్న జనసేనాని మరో  పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు  తెలుగుదేశం కూటమి ఐక్యంగా ముందుకు సాగుతుందని 10x వ్యాఖ్యతో కుండబద్దలు కొట్టారు.   


[Pawan Kalyan Strong Counter  to Jagan, AP Politics,  Jagan 2.0 Comments, Janasena Pawan Kalyan, 10x Counter,  TeluguOne] 

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.