రాజ్యాంగ ఉల్లంఘనలను అడ్డుకున్న న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ.. పవన్ కల్యాణ్

Publish Date:Oct 6, 2025

Advertisement

జస్టిస్ గోపాల గౌడ్ నేటి తరానికి రూల్ ఆఫ్ లా స్థాపనలో దారి చూపాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  అన్నారు. కర్ణాటక చిక్కబళ్లాపూర్‌ జిల్లా చింతామణిలో సోమవారం (అక్టోబర్‌ 6) సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వి.గోపాల  అమృతమహోత్సవ (80వ జన్మదిన) వేడుకల్లో పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన భాష, ప్రాంతాలూ వేరు కావచ్చు కానీ ఆంధ్రప్రదేశ్, కర్నాటక మధ్య సాంస్కృతి, సంప్రదాయాల విషయంలో మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని చెప్పారు.

 కోలార్, చిక్కబళ్లాపుర్‌ ప్రాంతాల్లో ఉన్న నీటి సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫునుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల మధ్య సహకార గురించి ఉదాహరణలుగా పవన్ కల్యాణ్  ఏపీలో ఏనుగుల దా డిలో పంటపొలాలు నాశనం కాకుండా కర్ణాటక ప్రభుత్వం కుంకీ ఏనుగులు ఇచ్చి  కర్ణాటక ప్రభుత్వం సహకరించిందనీ,  శ్రీశైలం దేవస్థానానికి వచ్చే కర్ణాటక భక్తులకు సౌకర్యాల విషయంలో  ఏపీ సానుకూలంగా ఉందనీ చెప్పారు.  ఇక జస్టిస్ గోపాల్ గౌడ గురించి మాట్లాడుతూ, ఆయన తన వృత్తి జీవితాన్ని కార్మికులు, కర్షకులకు అంకితం చేశారని అన్నారు.

2019 ఎన్నికలలో తాను పరాజయం పాలైన సమయంలో తనకు ధైర్యం చెప్పిన వ్యక్తి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ అని పవన్ కల్యాణ్ చెప్పారు. న్యాయమూర్తిగా ఆన ఎన్నో చరిత్రాత్మక తీర్పులు ఇచ్చి జస్టిస్‌ గోపాల గౌడ వృత్తి జీవితాన్ని కార్మికులు, కర్షకుల కోసం అంకితం చేసుకున్నారని పవన్‌ కల్యాణ్‌ గుర్తు చేశారు. ఆయన ఇచ్చిన ఎన్నో కీలక తీర్పులు చరిత్రాత్మకమైనవని పేర్కొన్నారు. భూ ఏ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడినా అడ్డుకున్నారని అన్నారు.  అలాగే జస్టిస్ గోపాలగౌడ మాట్లాడుతూ..  పవన్‌ కల్యాణ్‌ రాజకీయ ధృక్పథం తనకు ఇష్టమన్నారు.   

By
en-us Political News

  
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
​చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు. దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.
హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు
వరంగల్ జిల్లాలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.