పవన్ కళ్యాణ్ కి అందుకే అంత ప్రాధాన్యత ఇస్తున్నారా?

Publish Date:May 22, 2014

Advertisement

 

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ణి ఇటీవల ఎన్డీయే సమావేశానికి ఆహ్వానించడంతో ఆయనకు బీజేపీ ఎంతటి ప్రాధాన్యం ఇస్తోందో అందరికీ అర్ధమయింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఆయనకున్న అపారమయిన జనాధారణను చూసి నరేంద్ర మోడీ సైతం చాలా ఆశ్చర్యపోయారు. ఆయనను ప్రశంశలతో ముంచెత్తారు. పవన్ కళ్యాణ్ ప్రచారం వలన ఈ ఎన్నికలలో ఎన్డీయే కూటమికి ఓట్లశాతం మరింత పెరిగింది. అందుకే  చంద్రబాబుతో సమానంగా పవన్ కళ్యాణ్ణి కూడా కీలకమయిన ఎన్డీయే సమావేశానికి బీజేపీ  ఆహ్వానించిందని ప్రజాభిప్రాయం.

 

ఈ సమావేశంలో బీజేపీ ఆయనకు కేంద్రమంత్రి పదవి కూడా ఇచ్చేందుకు సిద్దపడిందని, కానీ ఆయన నిరాకరించారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను పవన్ కళ్యాణ్ దృవీకరించలేదు. అలాగని ఖండించలేదు కూడా. అంటే ఆయనకు బీజేపీ ఆఫర్ ఇచ్చి ఉండవచ్చునని భావించవచ్చును. కానీ ఎన్డీయే సమావేశం నుండి బయటకు వచ్చిన తరువాత తాను ఎన్నికలలో ఎన్డీయే కూటమిని బలపరిచినప్పటికీ తప్పులు చేస్తే వారినీ తప్పకుండా నిలదీస్తానని చెప్పడం గమానార్హం. తాను మోడీ, బాబు ప్రమాణ స్వీకారోత్సవాలకి హాజరుకాలేనని కూడా చెప్పడం మరో విశేషం. వారి కోసం ఎన్నికల ప్రచారం చేసి, తీరా చేసి వారు బాధ్యతలు స్వీకరిస్తున్నపుడు వెళ్లనని చెప్పడం దేనికో తెలియదు.

 

ఏమయినప్పటికీ పవన్ కళ్యాణ్ ముందే చెప్పినట్లుగా తెదేపా, తెరాస ప్రభుత్వాలను, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని మున్ముందు నిలదీయవచ్చును. వచ్చే ఎన్నికలలో తప్పకుండా పోటీ చేస్తానని ముందే ప్రకటించిన పవన్ కళ్యాణ్, అందుకోసం ఇప్పటి నుండే తన పార్టీని బలోపేతం చేసుకొంటానని ఇదివరకే చెప్పారు. బహుశః అందుకే ఆయన మంత్రి పదవులు వద్దనుకొంటున్నట్లు భావించవలసి ఉంటుంది. అందుకే ఆయన తన సినిమాలను కూడా తగ్గించుకొంటానని చెపుతున్నట్లు భావించవలసి ఉంటుంది.

 

అయితే పవన్ కళ్యాణ్ తను మద్దతు ఇచ్చిన పార్టీలను, వాటి ప్రభుత్వాలను ప్రశ్నించడం, ప్రజలలో నిలదీయడం మొదలుపెడితే అది తెదేపా-బీజేపీ ప్రభుత్వాలకు చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఆ రెండు పార్టీలు చేసిన అనేక ఎన్నికల హామీలను అమలుచేయమని ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చినట్లయితే, ఆయన అభిమానులు, ప్రజలు కూడా ఆయనకు మద్దతు పలికే అవకాశం ఉంది. ఆవిధంగా జనసేన పార్టీ, దాని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ప్రజలలో మరింత ఆదరణ పెరుగవచ్చును. వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్నపవన్ కళ్యాణ్ణి, అలాగే దూరంగా ఉంచినట్లయితే, జనసేన పార్టీ క్రమంగా బలపడటమే కాకుండా, ఆయన నుండి మున్ముందు రెండు పార్టీలకు పెను సవాలు ఎదుర్కోక తప్పదు.

 

అయితే పార్టీని స్థాపించడం ఒక ఎత్తయితే, దానిని నడిపించడం మరో ఎత్తు. రెంటికీ కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. మరి తన జేబులో చిల్లి గవ్వ కూడా లేదని చెప్పుకొంటున్న పవన్ కళ్యాణ్, అది సంపాదించడానికి సినిమాలు కూడా చేయకుండా, రాజకీయ పార్టీని నడిపించగలరా? అనే ప్రశ్నను  పక్కనబెడితే, పవన్ కళ్యాణ్ణి ఎన్డీయే కూటమి బయట ఉంచితే అతని వల్ల తెదేపా-బీజేపీ ప్రభుత్వాలు సమస్యలు ఎదుర్కోక తప్పదు. బహుశః అందుకే ఆయనను కూడా ప్రభుత్వంలో పాలుపంచుకొనేలా చేయాలని తెదేపా-బీజేపీలు భావిస్తుండవచ్చును. కానీ, ఒకవేళ పవన్ కళ్యాణ్ వాటితో కలిసి పనిచేసేందుకు నిరాకరించినట్లయితే, మున్ముందు ఆయన వల్ల ఆ రెండు పార్టీలకు సమస్యలు ఎదుర్కోకతప్పదని చెప్పవచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.