LATEST NEWS
  తెలుగువన్ ‘వాస్తవ వేదిక’ 14వ సంచికలో తాజా రాజకీయ పరిణామాలపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘డిన్నర్ డిప్లమసీ’ నడుస్తోందా? అని కంఠంనేని రవిశంకర్ ప్రశ్నించగా, దీనికి స్పందించిన డోలేంద్ర ప్రసాద్, మంత్రి నారా లోకేష్ తాను చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి విందు దౌత్యాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నారని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబును ఎంతగా ఒత్తిడి చేస్తే పనులు అంత త్వరగా జరుగుతాయని కూడా వ్యాఖ్యానించారు. దీనిపై రవిశంకర్ స్పందిస్తూ ఇది కొత్త కాన్సెప్ట్ అని అన్నారు. నారా లోకేష్ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారని డోలేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. లోకేష్ సీఎంగా , పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండేందుకు ఇష్టపడతారా? అని రవిశంకర్ కంఠంనేని ప్రశ్నించారు. మరోవైపు, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని నేరుగా ప్రధానిని అడిగారని పరిస్థితి లేదని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలతో లోకేష్‌కు ఆ స్థాయి సాన్నిహిత్యం లేదని కూడా తెలిపారు. ప్రజా కార్యక్రమాల్లో లింగమనేని రమేష్, సాన సతీష్, కిలారు రాజేష్ ఎక్కడ ఉన్నారు? అని డోలేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతోందని కంఠంనేని రవిశంకర్ అడిగారు. ఇలాంటి ఆసక్తికర అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో ఈ సాయంత్రం 7 గంటలకు తప్పక వీక్షించండి.  
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటిస్తున్నారు. పులివెందుల జగన్ అడ్డాగా చెబుతారు. అక్కడ ఆయనకు తిరుగులేని ఆధిపత్యం ఉందని అంటారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మాత్రం అందుకు ఒకింత భిన్నంగా ఉంది. గత ఏడాది ఆగస్టులో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికలలో పులివెందులలో వైసీపీ అభ్యర్థి అవమానకరం అన్న రీతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోవడంతో జగన్ అడ్డాగా అప్పటి వరకూ అంతా భావించిన పులివెందులలో వైసీపీ గాలిపోయినట్లైంది. జగన్ కోట బీటలు వారిందని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు.  అటువంటి పులివెందులలో జగన్ ఇప్పుడు పర్యటిస్తున్నారు. సాధారణంగా ఒక ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గంలో పర్యటించడం అన్నది సాధారణమే. అలాగే జగన్ కూడా పర్యటిస్తున్నారు అనుకోవడానికి లేకుండా ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయంలో నూతన విగ్రహ ప్రతిస్ఠాపన చేశారు. ఔను నందిపల్లిలోని నందీశ్వర ఆలయంలో జగన్ బుధవారం (ఫిబ్రవరి 25) నూతన విగ్రహ ప్రతిష్ఠాపన చేయడమే కాకుండా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , దేవాలయాలను మన సంస్కృతీ, సంప్రదాయాల ప్రతీకలుగా అభివర్ణించారు. అయితే గతంలో  ఎన్నడూ ఇలా ఆలయాల సందర్శన, పూజలు నిర్వహించిన దాఖలాలు లేవు. పైపెచ్చు తన హయాంలో ఆలయాలపై జరిగిన దాడులపై కూడా జగన్ పెద్దగా స్పందించలేదు. అయితే ఇప్పుడు జగన్ తన పులివెందుల పర్యటనలో ప్రత్యేకంగా ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేయడం, ప్రత్యేక పూజలు నిర్వహించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఓ వైపు అసెంబ్లీలో తిరుమల లడ్డూపై చర్చకు గైర్హాజర్ కావడంతో తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో వైసీపీ తప్పు చేసినట్లుగా సర్వత్రా ఒక భావన అయితే వ్యక్తం అవుతోంది. జగన్ యాంటీ హిందూ అన్న ప్రచారం ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో  హిందూత్వ వ్యతిరేకి అనే ముద్రకు దూరం కావడానికి జగన్ ఇప్పుడు తన నియోజకవర్గ పరిధిలోని ఓ ఆలయాన్ని సందర్శించి, విగ్రహ ప్రతిష్ఠ చేశారన్న చర్చ జోరుగా సాగుతోంది. గతంలో అంటే వైసీపీ హయాంలో కూడా జగన్ ఇలా హిందూ వ్యతిరేక ముద్ర తొలగించుకునేందుకు  పీఠాధిపతుల వద్దకు వెళ్లిన సంగతి విదితమే. ఇప్పుడు కూడా అదే తరహాలో పులివెందులలో కూడా ఆలయ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక పోతే.. జడ్పీటీసీ ఎన్నికలో వైసీపీ ఓటమి తరువాత పులివెందులలో జగన్ హవా తగ్గిందన్న భావన వైసీపీ శ్రేణులలోనే వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలోనే జగన్ వ్యూహం మార్చి తన పర్యటనలో ప్రజాదర్బార్ లు నిర్వహిస్తున్నారు. అయితే ఇవేమంత సత్ఫలితాలను ఇస్తున్నట్లు కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాయలసీమ కరవును నివారించడానికి, సాగు, తాగు నీరు అందించడానికీ చేస్తున్న పనులు, చేపడుతున్న కార్యక్రమాలు ఇందుకు కారణమంటున్నారు. అలాగే రాయలసీమ అభివృద్ధి పనులు సైతం జోరుగా సాగుతున్నాయి. అలాగే పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన ద్వారా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జనంలో పాగా వేస్తున్నది. ఈ నేపథ్యంలోనే జడ్పీటీసీ ఉప ఎన్నికలో పులివెందులలో వైసీపీ ఓటమి తరువాత నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అంపశయ్యపై ఉన్నట్లుగా తయారైందనీ, జగన్ తన పర్యటనలు, ఆలయ సందర్శనతో ఈ పరిస్థితి మర్చగలుగుతారా అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తమౌతున్నాయి. 
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సెక్యూరిటీ తొలగింపు వ్యవహారంలో సుప్రీంకోర్టులో ఆసక్తికరమైన చర్చ జరిగింది. డబ్బున్న వారికి పోలీసు సెక్యూరిటీ ఎందుకు? మీ డబ్బు శక్తి వాడండంటూ, పోలీసు భద్రత ఇప్పుడు హోదా గా మారిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.   నాలిక కోస్తా అనడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిందన్న పేర్కొన్న సుప్రీం కోర్టు..   ఆ మాటలను పట్టుకుని అదే నిజమని నమ్మి సెక్యూరిటీ కోరడం తగదని సూచించింది. గతంలో మీ కుటుంబంలో  ఆరుగురి హత్య జరిగిందని ఇప్పుడు సెక్యూరిటీ కోరడం కూడా సరైనది కాదని పేర్కొంది.  ఇక గతంలోకన్నా ప్రస్తుతం పోలీసులకన్నా మిన్నగా ప్రైవేట్ సెక్యూరిటీ పని చేస్తోంది. కాబట్టి మీరు మీ సొంత సెక్యూరిటీ పెట్టుకోమని సుప్రీం కోర్టు కాటసాని న్యాయవాదులకు సూచించింది. అయితే కాటసాని రాంభూపాల్ రెడ్డి కి డబ్బు శక్తి ఉందని అనడం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆయనకు వెయ్యి కోట్ల ఆస్తులున్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే అది నిజం కాదని అంటారాయన. ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం సుమారు వంద కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడా ఉండవు. అయితే కాటసానిది ఫ్యాక్షన్ కుటుంబం. మే 27, 1979న జరిగిన ఒక దారుణమైన ఘటనలో కాటసాని రాంభూపాల్ రెడ్డి తండ్రి, ఆయన ఆరుగురు దాయాదులు ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత 1986లో ఆయన సోదరుడు కూడా హత్యకు గురయ్యారు. వీటి ఆధారంగా ఇప్పుడు ముప్పు ఉందనడమేంట సుప్రీం కోర్టు పేర్కొంది. ఒక వేళ మీకు ప్రాణహాని ఉంటే, లోకల్ పోలీసులకు తెలియక పోదు. వారు కూడా ఒక శాస్త్రీయమైన అంచనాకు వచ్చినపుడు ఆటోమేటిగ్గా మీకు భద్రత కల్పిస్తారని సుప్రీం కోర్టు పేర్కొంది. అంతేగానీ మీరు ప్రతిపక్ష నేత కాబట్టి  సెక్యూరీటీ కావాలంటే కుదరదని పేర్కొంటూ,  మీరు ఎమ్మెల్యేగా గెలిచినా ఆ సెక్యూరిటీ ఉండేది. అది కూడా లేక పోవడంతోనే 2ప్లస్2 భద్రత తొలగించారు. ఇవాళ,రేపు ఏదో ఒక పార్టీల్లో చేరడం చాలా చాలా సులువు. అలాంటిది మేం ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం.. సెక్యూరిటీ కలిపించమని అందరూ వచ్చి అడిగితే.. ఉన్న పోలీసు వ్యవస్థ చాలదని సుప్రీం కోర్టు కామెంట్ చేసింది. 
గత కొద్ది కాలంగో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం అంశం ఆంధ్రప్రదేశ్ లో పెను రాజకీయ దుమారం రేపుతున్న సంగతి విదితమే.  దీనిపై అధికార తెలుగుదేశం కూటమి, వైసీపీ మధ్య మాటల యుద్ధం ఎడతెగకుండా కొనసాగుతోంది.  సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన  ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై దర్యాప్తు చేసి.. కల్తీ వాస్తవమేనని థృవీకరించింది. నిర్ధారించింది.  వాస్తవానికి ఇక్కడితో ఈ అంశంవై వివాదానికి ఫుల్ స్టాప్ పడాలి. ఇక కల్తీకి కారకులెవరు? అన్నది చట్టం చూసుకుంటుంది.  అయితే వైసీపీ మాత్రం కల్తీ  విషయం అలా ఉంచండి.. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో చంద్రబాబు చెప్పినట్లుగా జంతువుల కొవ్వు లేదుగా అంటే నానా హంగామా చేస్తోంది. చంద్రబాబు అవాస్తవాలను ప్రచారం చేశారని ఎదురుదాడి చేస్తున్నది. అక్కడితో ఆగకుండా  తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ కు లబ్ధి చేకూర్చడం కోసమే చంద్రబాబు లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వినియోగం అంటూ ఆరోపణలు గుప్పించారంటూ విమర్శలు మొదలు పెట్టింది.  ఇందాపూర్ డైరీ తో కలిపి హెరిటేజ్ పై ఆరోపణలు మొదలుపెట్టింది. దీనిపై మండలిలో చర్చకు సిద్ధం అంటూ సవాల్ విసిరింది. ఆ సవాల్ ను స్వీకరించిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. చర్చ మండలిలో కాదు.. అసెంబ్లీలో చేద్దామంటూ అందుకు మంగళవారం (ఫిబ్రవరి 24)ముహూర్తం నిర్ణయించింది.  ప్రభుత్వం వ్యూహాత్మకంగా శాసనసభలో ఈ అంశాన్ని మంగళవారం (ఫిబ్రవరి 24) చర్చకు పెట్టింది. దమ్ముంటే సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని వైసీపీకి సవాల్ కూడా విసిరింది.   వాస్తవానికి వైసీపీకి ఇదో బంగారంలాంటి అవకాశం. సభకు హాజరై కల్తీ నెయ్యి వినియోగం విషయంలో తమ పార్టీపై వస్తున్న ఆరోపణలను ఖండించడమే కాకుండా.. ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ పై తాను చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపడానికి అంది వచ్చిన ఒక అవకాశం. అయితే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి వైసీపీ ముందుకు రావకపోవడంతో లడ్డూ ప్రసాదం తయారీలో వైసీపీ చేస్తున్న వాదనలకు, ఆరోపణలకు విశ్వసనీయత లేకుండా పోయింది.   ఇక అసెంబ్లీలో మంగళవారం (ఫిబ్రవరి 14) జరిగిన  చర్చలో చంద్రబాబు ప్రసంగం.. హైలైట్ గా మారింది. మొత్తంగా కల్తీ నెయ్యి అంశంలో తాను చేసిన ఆరోపణలు, అందుకు ఆధారమైన ఎన్డీడిబీ రిపోర్టు, మొత్తంగా  2022 నుంచి ఏం జరిగింది అనే దానిపై చంద్రబాబు ప్రసంగం సాగింది. ఇందుకు సంబంధించిన వివరాలు, ఆధారాలను సభ ముందుంచారు.  ఇక హెరిటేజ్ పై వైసీపీ ఆరోపణల డొల్ల తనాన్ని ఎండగట్టడమే కాకుండా.. భరతీ సిమోంట్స్ కోసం జగన్ నిబంధనలను ఎలా తుంగలో తొక్కారో కూడా కళ్లకు కట్టారు. హెరిటేజ్ తన కుటుంబ సంస్థ అని చెప్పిన చంద్రబాబు,  హెరిటేజ్ ఉత్పత్తులను ఎన్నడూ ప్రభుత్వ శాఖలు తీసుకోలేదని విస్పష్టంగా చెప్పారు. అందుకు భిన్నంగా జగన్ హయాంలో  భారతి సిమెంట్స్ ను ప్రభుత్వ నిర్మాణాల కోసం ఉపయోగించిన వైనాన్ని  ప్రస్తావించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళనకు పూనుకున్నామని.. అప్పుడే నెయ్యి కల్తీ వ్యవహారం బయటపడిందన్న చంద్రబాబు,  రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తే.. వైసీపీయే  సుప్రీంకోర్టుకు వెళ్లి సిబిఐ నేతృత్వంలోని సిట్ ను కోరిందని గుర్తు చేసిన చంద్రబాబు   ఆ సిట్ నెయ్యిలో కల్తీ జరిగిందని నివేదిక ఇచ్చిందనీ, చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిందనీ చెప్పారు. దీనిపైనే  ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై  ఏకసభ్య కమిషన్ నియమించామని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఏక సభ్య కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ  వైసీపీ సుబ్రహ్మణ్యస్వామితో పిటిషన్ వేయించిదన్న ఆయన ఆ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసిందనీ,  తప్పులు చేయడం, విచారణను  అడ్డుకోవడాలని ప్రయత్నించడం వైసీపీకి అలవాటేనన్న ఆయన  ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయనీ, ఆ పార్టీ చేసిన తప్పిదాలే ఇప్పుడు వారికి శాపాలుగా మారాయనీ చంద్రబాబు చెప్పారు.  హెరిటేజ్ పై వైసీపీ తప్పుడు ఆరోపణలను సభ సాక్షిగా చంద్రబాబు ఎండగట్టారు. ఆత్మరక్షణ కోసమే వైసీపీ హెరిటేజ్ ను ఇందులోకి లాగిందన్న ఆయన, ఇండాపూర్ అనేది ప్రముఖ డైరీలకు కో మ్యానుఫ్యాక్చరింగ్ అందిస్తూ ఉంటుందని.. అందులో హెరిటేజ్ ఒకటని పేర్కొన్న చంద్రబాబు..   ఏ ప్రభుత్వ శాఖలో కూడా హెరిటేజ్ ఉత్పత్తులను వినియోగించుకున్న దాఖలాలు కుండబద్దలు కొట్టారు.  అదే సమయంలో తమ ఆరోపణలకు ఆధారాలు చూపుతూ వాదనలు వినిపించాల్సిన వైసీపీ సభ్యులు మాత్రం అసెంబ్లీకి గైర్హాజరయ్యారు. అటెండెన్స్ కోసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున సభకు వచ్చి వెళ్లిన జగన్  అండ్ కో.. అత్యంత కీలక విషయంలో చర్చ జరుగుతున్న సమయంలో మాత్రం  సభకు డుమ్మా కొట్టి పలాయనం చిత్తగించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిశీలకులు సైతం సభకు వైసీపీ గైర్హాజర్.. కల్తీ నెయ్యి విషయంలో తప్పు ఒప్పుకున్నదన్న భావన కలిగించేలా ఉందని అంటున్నారు.  మొత్తం మీద కల్తీ నెయ్యి విషయంలో  చర్చ నుంచి పలాయనం చిత్తగించడంతో వైసీపీ వాదనలు విశ్వసనీయత కోల్పోయాయని రాజకీయవర్గాలు అంటున్నాయి. 
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రతినిథులకు ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం (ఫిబ్రవరి 23) ఇచ్చిన ఆత్మీయ విందు నవ్వుల విందుగా, పరిచయాలు, పలకరింపుల మేళవింపులుగా మారింది. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, పరస్పరం కుటుంబ సభ్యులను పరిచయం చేసుకుంటూ ఆద్యంతం ఆహ్లాదంగా సాగింది.  ఆ ఆత్మీయ విందులో పాల్గొన్న వారెవరి మెబైల్ ఫోనూ ఒక్కసారి కూడా రింగ్ అవ్వలేదు. అంతెందుకు ఆ సమయంలో ఎవరూ ఫోన్ జోలికే పోలేదు. వాట్సాప్ చాటింగ్ ల ఊసే లేదు. కుటుంబాల ముచ్చట్లు, పెళ్లిళ్లు, పిల్లల చదువులు, కుటుంబాలా క్షేమ సమాచారాలు పంచుకోవడంతో అంతా ఆనందంగా ఆహ్లాదంగా గడిపారు. తమతమ ప్రాంతాల ప్రత్యేకతలను పంచుకున్నారు.   శ్రీకాకుళం వెటకారం, విజయనగరం చతురతతో సంభాషణలు రక్తి కట్టాయి. మంత్రి నారా లోకేష్ ఈ విందు సమావేశంలో  మంగళగిరి చేనేత ప్రమోషన్  చేస్తూ శ్రీకాకుళం ప్రజాప్రతినిథులు  పొందూరు ఖాదీతో బదులిచ్చారు. ఆత్మీయ వేదికకు హాజరైన ప్రజాప్రతినిథుల కుటుంబసభ్యులకు మంగళగిరి పట్టుచీరలు లోకేష్ బహుకరించారు.  ఈ ఆత్మీయ విందు సమావేశానికి శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామమోహన నాయుడు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు  ఎమ్మెల్యేలు  బెందాళం అశోక్, గౌతు శిరీష, మామిడి గోవిందరావు, గొండు శంకర్, కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి కొండపల్లి సాయి శ్రీనివాస్, కొండ్రు మురళీ మోహన్, బొబ్బిలి ఆర్ఎస్వీకేకే రంగారావు బేబీనాయన, కిమిడి కళా వెంకటరావు, పి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, లోకం మాధవి, నడికుదిటి ఈశ్వరరావు కుటుంబసభ్యులతో హాజరయ్యారు.  
ALSO ON TELUGUONE N E W S
ఓటీటీ బిజినెస్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రికార్డు ఫ్యాన్సీ రేటుకు రైట్స్ సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Ustaad Bhagat Singh) సినిమా గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయని సమాచారం. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.80 కోట్లకు సొంతం చేసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ, ఈ డీల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్ గత చిత్రం 'ఓజీ' ఓటీటీ రైట్స్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఆ సినిమా థియేటర్లలో రూ.300 కోట్ల గ్రాస్ రాబట్టడమే కాకుండా, ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అందుకే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రైట్స్ కోసం అంత మొత్తం చెల్లించడానికి నెట్‌ఫ్లిక్స్ ముందుకొచ్చినట్లు వినికిడి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'గబ్బర్ సింగ్' బ్లాక్‌బస్టర్ కావడంతో, ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఓటీటీ హక్కులే ఇంత పెద్ద మొత్తానికి అమ్ముడవడం చూస్తే, చిత్రంపై మార్కెట్‌లో ఉన్న క్రేజ్ స్పష్టంగా అర్థమవుతోంది. థియేట్రికల్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read: పూరి జగన్నాథ్ తో సినిమాకి ఓకే చెప్పిన స్టార్ హీరో!
  -ఆ ట్వీట్ చరణ్ చేశాడా  -సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది  -అసలు వాస్తవం ఏంటి! మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' (Ram Charan)చూపు ఈ సారి పాన్ ఇండియా రికార్డ్స్ వైపు ఉంది. ఈ విషయంలో ఎవరు డౌట్స్ పెట్టుకొని విధంగా పెద్ది నుంచి ఇప్పటి వరకు వచ్చిన చరణ్, జాన్వీ కపూర్(Janvi Kapoor),శివరాజ్ కుమార్, జగపతి బాబు లుక్స్, టీజర్  చరణ్ మనసులో ఉన్న  విషయాన్నీ నొక్కి మరి చెప్తున్నాయి. అన్నిటి కంటే ముఖ్యంగా చికిరి సాంగ్ అయితే పైన చెప్పుకున్న ప్లస్ లన్నింటిని ఓవర్ టేక్ చేసింది. ఒక్క తెలుగు లిరికల్ వీడియోనే స్టిల్ 175 మిలియన్స్ ని రాబట్టడమే ఓవర్ టేక్ కి నిజ నిర్దారణ. మరి ఇప్పుడు సెకండ్ సింగిల్   కూడా సింహం సింగల్ గా రాబోతుంది. ఈ విషయంపై చరణ్ ఎక్స్ వేదికగా ఏం చెప్పాడో చూద్దాం. రీసెంట్ గా చరణ్ ఎక్స్ వేదికగా 'రై రై రారా రై రై రారా' అనే సాంగ్ నెక్స్ట్ మంత్ సెకండ్ న రిలీజ్ అవుతుందని చెప్పాడు. అలా ట్వీట్ చేసాడో లేదో పూర్తి డీటెయిల్స్ కోసం సెర్చ్ చేయగా చిత్ర యూనిట్ కూడా మార్చి 2 సాంగ్ విడుదల చేయబోతున్నాం. 'నీ అయ్య వడ్డీ.. నీ బిడ్డ కడితే.. నువ్వేమి పొడిచావనే.. రై రై రారా రై రై రారా'' అనేది  పూర్తి లిరిక్ అని తెలిపింది. ఇప్పుడు సదరు లిరిక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారడంతో పాటు ఫ్యాన్స్, మ్యూజిక్ లవర్స్ అప్పుడే వాళ్ళ స్టైల్లో ట్యూన్స్ కట్టుకుంటూ పాడుకుంటున్నారు. నెటిజన్స్ కూడా ట్యూన్ విషయంలో ట్రై చేస్తు చికిరి కంటే ఊర విలేజ్ టైప్ లో సాంగ్ ఉండబోతుందని అర్దమవుతుంది.వెయిటింగ్ అంటు కామెంట్స్ చేస్తున్నారు. also read: The kerala story part 2: రిలీజ్ పై హైకోర్ట్ సంచలన తీర్పు .. రేపే రిలీజ్  ఉత్తరాంధ్ర భావజాలం, బాడీ లాంగ్వేజ్ తో తెరకెక్కుతున్న 'పెద్ది' ని బుచ్చిబాబు(Buchi Babu)ఎంతో ప్రెస్టేజియస్ట్ గా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు. రిలీజ్ డేట్ ఏప్రిల్ 30 . వృద్ధి సినిమాస్ నిర్మాణ సంస్థ కాగా సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ అండదండలు పెద్దికి ఉన్నాయి. ఒక కాలు పని చేయని అవిటి వ్యక్తిగా చరణ్ కనిపించబోతున్నాడనేది ప్రధాన రూమర్.        https://x.com/AlwaysRamCharan/status/2026965412068634860?s=20    
  -కేరళ హైకోర్టు లో ముగిసిన వాదోపవాదనలు  -తీర్పులో చెప్పిన ప్రధాన అంశమేంటి -రేపు రిలీజ్ ఉందా! ఆనందాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి అనే సిగరెట్ యాడ్ పడటం దగ్గర నుంచే ఎంతో ఉద్వేగంతో, ఆతృతతో ది కేరళ స్టోరీ కి సీక్వెల్ గా తెరకెక్కిన ది కేరళ స్టోరీ 'పార్ట్ 2 '(The Kerala Story 2) చూడాలనే ఉబలాటంతో మూవీ లవర్స్ ఉన్నారు. దీన్ని బట్టి పార్ట్ 2 పై ఏర్పడిన క్రేజ్ ని అర్ధం చేసుకోవచ్చు.ట్రైలర్ రిలీజ్ తర్వాత పలువురు కొన్ని అభ్యంతరాలని లేవనెత్తుతు రిలీజ్ ఆపాలని కోర్టులో కేసు వేసినా మూవీ లవర్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే కేరళ ప్రతిష్ట దెబ్బతీసేందుకే పార్ట్ 2 తెరకెక్కిందని స్వయంగా కేరళ ముఖ్యమంత్రి 'పినరయి విజయన్' చెప్తు వస్తున్నా, మేకర్స్ మాత్రం రిలీజ్ కి సంబంధించిన పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. పైగా సెన్సార్ కూడా వచ్చింది. దీంతో రేపు 27 న మూవీ చూడబోతున్నామనే ఆనందంతో మూవీ లవర్స్ ఉన్నారు. కానీ వాళ్ళ ఆనందాన్ని కేరళ హైకోర్టు హోల్డ్ లో ఉంచింది. పూర్తి డీటెయిల్స్ చూద్దాం. కేరళ సంప్రదాయంతో పాటు మతసామరస్యాన్ని దెబ్బతీసేలా కేరళ స్టోరీ 2 లో చూపించారనే పిటిషన్ పై విచారించిన కోర్టు రిలీజ్​పై స్టే విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో రేపు మూవీ విడుదల కావడం లేదు. సర్టిఫై చేసే క్రమంలో సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయకుండా చూసుకునే మార్గదర్శకాలని  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అలియాస్ సెన్సార్ వాళ్ళు  పాటించనట్లు కనిపిస్తుందని కూడా హైకోర్టు తన తీర్పులో చెప్పడం విశేషం. also read:  thaman: అడ్డంగా దొరికిపోయిన థమన్.. ఆ కొత్త జంట గురించి అలా మాట్లాడొచ్చా! కామాఖ్య నారాయణ్ సింగ్(Kamakhya Narayan Singh)తెరకెక్కించిన కేరళ స్టోరీ పార్ట్ 2 లో ఉల్క గుప్తా, ఐశ్వర్యా ఓజా, అదితి భాటియా కీలక పాత్రలు పోషించారు. హైకోర్టు తన తీర్పులో 15 రోజులపాటు స్టే విధించినట్టుగా చెప్పిన దరిమిలా రిలీజ్ ఎప్పుడు ఉంటుందో చూడాలి. చిత్ర బృందం ఈ విషయంలో ఏం చేయబోతోందనే ఆసక్తి కూడా ఉంది.   
కమ్ బ్యాక్ కి రెడీ అయిన పూరి స్టార్ హీరో నుంచి గ్రీన్ సిగ్నల్  స్లమ్‌డాగ్ తరువాత లైన్ లోకి క్రేజీ ప్రాజెక్ట్  ఒకప్పుడు టాలీవుడ్ లో దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannadh) అంటే ఒక బ్రాండ్. ఆయన హీరోలను చూపించే విధానం కానీ, డైలాగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అందుకే పూరితో సినిమా చేయడానికి స్టార్స్ కూడా పోటీ పడేవారు. అలాంటి పూరి కొంతకాలంగా వెనకబడిపోయారు. ఇప్పుడు మళ్ళీ అదిరిపోయే కమ్ బ్యాక్ కి సిద్ధమవుతున్నారు. పూరి ప్రస్తుతం కోలీవుడ్ యాక్టర్ విజయ్ సేతుపతితో 'స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్' అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే పూరి నెక్స్ట్ సినిమా లాక్ అయినట్లు తెలుస్తోంది. (Slumdog – 33 Temple Road) 'స్లమ్‌డాగ్' తరువాత కూడా పూరి కోలీవుడ్ స్టార్ తోనే చేతులు కలపబోతున్నట్లు సమాచారం. ఆ స్టార్ ఎవరో కాదు సూర్య. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని వినికిడి. ఇది స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ గా రూపొందనుందట. (Puri Suriya) కాగా, సూర్య ఇప్పటికే టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు మరో టాలీవుడ్ డైరెక్టర్ పూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్త ఆసక్తికరంగా మారింది.  ఇదిలా ఉంటే, బాలకృష్ణ కోసం కూడా పూరి ఒక కథ సిద్ధం చేస్తున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఇప్పుడు అనూహ్యంగా సూర్య ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. దీని తర్వాత బాలయ్య-పూరి చేతులు కలుపుతారేమో చూడాలి. గతంలో వీరి కాంబినేషన్ లో 'పైసా వసూల్' వచ్చిన విషయం తెలిసిందే. Also Read: విష్ణు విన్యాసం మూవీ ఫస్ట్ రివ్యూ!
  -సోషల్ మీడియాలో వైరల్ గా మారిన థమన్  -ఆ యువ జంట గురించి మాట్లాడింది నిజమేనా  -అసలు ఏం మాట్లాడాడు  -వివరాలు చూద్దాం థమన్(Thaman).. సంగీతంలో ఉన్న మాధుర్యాన్ని సంగీత ప్రియులకి అందించడానికే ఉదయించిన సంగీత సూర్యుడు అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ట్రాక్ రికార్డు ఆ విధంగా ఉంది మరి. మాస్ సాంగ్స్ ని ఇష్టపడే వాళ్ళని క్లాస్ సాంగ్స్ వైపు , క్లాస్ సాంగ్స్ ని ఇష్టపడే వాళ్ళని మాస్ సాంగ్స్ వైపు డైవర్ట్ చేయడంలో కాకలు తీరిన సిద్ద హస్తుడు. అందుకే సుదీర్ఘ కాలం నుంచి సంగీత సినీ ప్రపంచంలో దూసుకుపోతున్నాడు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మ్యూజిక్ కి సంబంధించి కాకుండా మౌత్ నుంచి వచ్చిన ఒక మాటతో వైరల్ గా నిలిచాడు. థమన్ రెండు రోజుల క్రితం 'బ్యాండ్ మేళం'(Band Melaam)అనే అప్ కమింగ్ మూవీ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యాడు. కోర్టు మూవీ ఫేమ్ రోషన్(Roshan),శ్రీదేవి(Sridevi)మరో సారి జంటగా చేస్తున్నారు. థమన్ ఆ ఇద్దర్ని ఉద్దేశించి  మాట్లాడుతు మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది, కానీ ఆ కెమిస్ట్రీ కాస్తా ఫిజిక్స్ కాకుండా చూసుకోండి అని మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఈ మాటలు నిదానంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో థమన్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. దీంతో థమన్ ఆ విధంగా ఎలా మాట్లాతాడని  విరుచుకుపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. థమన్ ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు.అదేంటి అలా ఎలా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారా!  కెమిస్ట్రీ కాస్తా ఫిజిక్స్ కాకుండా చూసుకోండి అని చెప్పిన తర్వాత మళ్ళీ తన మనసులో కెమిస్ట్రీ అంటే ఉన్న భావం గురించి చెప్పుకొచ్చాడు. also read: Virosh Wedding: ఘనంగా జరిగిన పెళ్లి.. అదిరిపోయిన తెలంగాణ స్పెషల్ డిష్!  కెమిస్ట్రీ అంటే నేను వేరే ఉద్దేశ్యంతో అనలేదు. మీరిద్దరూ భవిష్యత్తులో గొడవలు పడకండి అని మాత్రమే చెబుతున్నా. మీ పెయిర్ చూడటానికి చాలా బాగుంది, ఎప్పుడూ ఇలాగే కలిసుండండి. అసలే నేను ఐదో తరగతి ఫెయిల్ అయ్యాను.. నాకేం పెద్దగా తెలియదు'అని చెప్పుకొచ్చాడు. అందుకే కొంత మంది పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. నెగిటివ్ వీరులు మాత్రం ఆగడం లేదు.            
కొన్ని జానర్ సినిమాలు కొందరు హీరోలకు కరెక్ట్ గా సెట్ అవుతాయి. ఈ జనరేషన్ లో ఎంటర్టైన్మెంట్ సినిమాలకు హీరో శ్రీవిష్ణు సరిగ్గా సరిపోతాడు. 'సామజవరగమన', 'సింగిల్' వంటి సినిమాలతో థియేటర్లలో నవ్వులు పూయించి మంచి విజయాలను ఖాతాలో వేసుకున్నాడు శ్రీవిష్ణు. ఇప్పుడు 'విష్ణు విన్యాసం'తో మరోసారి కామెడీ ట్రీట్ కి రెడీ అయ్యాడు. శ్రీవిష్ణు, నయన్ సారిక జంటగా నటించిన మూవీ 'విష్ణు విన్యాసం'(Vishnu Vinyasam). మారుతీరావు దర్శకత్వంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్, రేపు( ఫిబ్రవరి 27) విడుదలవుతోంది. ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. 'సామజవరగమన', 'సింగిల్' తరహాలో శ్రీవిష్ణు ఖాతాలో మరో విజయం పడటం ఖాయమనే నమ్మకాన్ని కలిగించాయి. ఇక ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ సినిమా గురించి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. (Vishnu Vinyasam First Review) సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గానే ఉంది. రెండు గంటల నిడివితో తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ లభించింది. అవుట్ పుట్ కూడా అదిరిపోయింది అంటున్నారు. రెండు గంటల పాటు నాన్ స్టాప్ నవ్వులు పంచేలా సినిమాని మలిచారట. ఫస్ట్ హాఫ్ శ్రీవిష్ణు శైలి కామెడీతో యూత్ ని అట్రాక్ట్ చేసేలా ఉంటే, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఉంటుందట. న్యూమరాలజీ పిచ్చి ఉన్న జూనియర్ లెక్చరర్ పాత్రలో విష్ణు అదరగొట్టాడట. కామెడీ టైమింగ్ మాములుగా లేదని చెబుతున్నారు. Also Read: 'ఆయా షేర్' హుక్ స్టెప్ కాపీ అంటూ ట్రోల్స్.. యువరాజ్ సింగ్ ఎంత పని చేశాడు!
  -అభిమానుల ముఖాల్లో ఆనందం  -వైభవంగా జరుగుతున్న వివాహం  -స్పెషల్ అండ్ హైలెట్స్ ఏంటి! ప్రస్తుతం రష్మిక(Rashmika Mandanna),విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)అభిమానుల ముఖాలు చూడాలి. దివాలి ఈ సంవత్సరం కొంచం ముందుగానే వచ్చిందా అనిపిస్తుంది. అంతలా వాళ్ళ ముఖాలు వెలిగిపోతున్నాయి. దీన్ని బట్టి ఆ ఇద్దరి పెళ్లి ఘనంగా జరిగిందనే కదా అనే విషయం అర్ధమవుతుంది కదు. అవును. అభిమానుల నోటి నుంచి సుదీర్ఘ కాలం నుంచి వస్తున్న వాక్కు కి తధాస్తు దేవతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ రోజు ఉదయం పదిగంటల పది నిముషాలకి రాజస్థాన్ లోని ఉదయపూర్(Udaypur)లో ఘనంగా జరిగింది. మరి పెళ్లి లో హైలెట్స్ ని ఒకసారి చూద్దాం.  ITC మెమెంటోస్ లో హిందూ సాంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ వేడుకకి పెళ్ళికి ఇరు వైపుల ఉన్న అతి ముఖ్యమైన బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఇద్దరు ధరించిన పెళ్లి వస్త్రాలు ప్రత్యేక డిజైన్స్ తో ధగధగా మెరిసిపోయాయి. కరెక్ట్ గా ఉదయం 10 గంటల 10 నిమిషాలకి  రష్మిక మెడలో విజయ్ తాళి కట్టాడు. ఆ క్షణంలో విజయ్, రష్మిక ఇద్దరూ ఎమోషనల్ అయ్యారని వాళ్ళని ఆ విధంగా చూసి అతిథులు ఆశ్చర్యపడినట్టుగా తెలుస్తుంది. సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్, రాహుల్ రవీంద్రన్, శివ నిర్వాణ,  ఈషా రెబ్బా, ఆషిక రంగనాథ్, స్టైలిస్ట్ శ్రావ్య వర్మ ఇలా సినీ ఇండస్ట్రీతో పాటు సుమారు 100 మంది క్లోజ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అటెండ్ అయ్యారు. Also read:  Nagarjuna: భారతీయ సినిమా ప్రయాణంలో కీలక ఘట్టం స్టార్ట్ విందులో తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, కర్ణాటక స్పెషల్ బిసిబేళా బాత్‌తో పాటు కొడవ సంప్రదాయంలో ప్రత్యేకమైన పోర్క్ కర్రీ లతో విందు భోజనం ఏర్పాటు చేశారని సమాచారం.సాయింత్రం 4.30 కి ముందుగా అనుకున్న ప్రకారం రెండో సారి వివాహం జరగనుంది.  
'ఆయా షేర్' హుక్ స్టెప్ పై ట్రోల్స్ కాపీనా? క్రియేటివిటీనా? అసలు యువరాజ్ సింగ్ ఎవరు? బాబా జాక్సన్ గా ఎందుకు మారాడు? ఏదైనా సాంగ్ విడుదలైనప్పుడు కాపీ ఆరోపణలు రావడం సహజం. ఎక్కువగా ట్యూన్ కాపీ కొట్టారనే మాటలు వినిపిస్తుంటాయి. అయితే, డ్యాన్స్ స్టెప్ కాపీ అనే ఆరోపణలు అరుదుగా వస్తాయి. ఇప్పుడు 'ఆయా షేర్' సాంగ్.. అలాంటి ఆరోపణలనే ఎదుర్కొంటోంది. 'దసరా' తరువాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ది ప్యారడైజ్'(The Paradise). అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా 'ఆయా షేర్' అనే సాంగ్ విడుదలైంది. సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రసుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఇందులో నాని సిగరెట్ వెలిగిస్తూ వేసిన హుక్ స్టెప్ కూడా వైరల్ గా మారింది. అదే సమయంలో ఈ స్టెప్ పై కాపీ అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. (Aaya Sher Song) 2021 లో తాను వేసిన స్టెప్ ని కాపీ చేసి 'ఆయా షేర్'లో పెట్టారని బాబా జాక్సన్ అనే డ్యాన్సర్ ఆరోపిస్తున్నాడు. రాజస్థాన్ కి చెందిన బాబా జాక్సన్ అసలు పేరు యువరాజ్ సింగ్. మైకేల్ జాక్సన్ కి వీరాభిమైన అయిన యువరాజ్.. తన పేరుని బాబా జాక్సన్ గా మార్చుకున్నాడు. (Baba Jackson) సోషల్ మీడియాలో తనదైన డ్యాన్స్ స్టెప్పులతో మంచి పేరు సంపాదించుకున్నాడు బాబా జాక్సన్. పలువురు బాలీవుడ్ స్టార్స్ సైతం అతని డ్యాన్స్ కి ఫిదా అయ్యారు. అలాంటి బాబా జాక్సన్.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ నానిని టార్గెట్ చేశాడు. తాను గతంలో వేసిన స్టెప్ ని కాపీ కొట్టారంటూ 'ది ప్యారడైజ్' టీమ్ పై ఆరోపణలు చేస్తున్నాడు. దీంతో ఇప్పుడు సౌత్ లోనూ అతని పేరు మారుమోగిపోతోంది.  'ఆయా షేర్' హుక్ స్టెప్.. నిజంగానే బాబా జాక్సన్ స్టెప్ ని కాపీ కొట్టినట్టుగా ఉందని కొందరు ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. డ్యాన్స్ స్టెప్పులు ఒక దానిని పోలి మరొకటి ఉండటం సహజమని, అంతమాత్రాన కాపీ అంటూ ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. కాగా, ఈ 'ఆయా షేర్' సాంగ్ కి సుధన్ మాస్టర్ కొరియోగ్రాఫర్. ఈ కాపీ ఆరోపణలపై ఆయన ఏమైనా రియాక్ట్ అవుతాడేమో చూడాలి. Also Read: థియేటర్లలో విష్ణు, మహేష్ ల విన్యాసం.. ఓటీటీలో అదిరిపోయే సినిమాలు, సిరీస్ లు!
The Allu Arjun Fans Association (AAFA) continues to strengthen its commitment toward social responsibility and organized fandom with the official formation of district committees across the Rayalaseema region of Andhra Pradesh. Inspired by Icon Star Allu Arjun’s vision — “One Good Deed Every Year” — the association has expanded its organizational structure to ensure impactful community engagement beyond cinema celebrations. Expansion Across Rayalaseema As part of this initiative, new AAFA district committees have been successfully constituted in: Nellore,Kadapa ,Kurnool, Anantapur Chittoor These committees will serve as local leadership units, coordinating fan activities while promoting social awareness and community service initiatives. Leadership and Organization The formation of the Rayalaseema committees was carried out under the guidance of AP State President Shri Siva Sankar, who appointed dedicated District Presidents and office bearers committed to disciplined functioning and responsible leadership. A Purpose Beyond Fandom AAFA emphasizes that fandom extends far beyond celebrating movie releases and milestones. Each district committee has pledged to undertake at least one major social service activity every year, aligning with Allu Arjun’s philosophy of giving back to society. Planned Social Initiatives The association’s upcoming initiatives are expected to include:     •    Public awareness programs     •    Organized blood donation drives     •    Educational assistance for students     •    Welfare activities supporting the underprivileged Building Responsible Fan Culture With this expansion, AAFA aims to blend admiration for cinema with discipline, unity, and social responsibility. The organization envisions creating a positive and inspiring fan culture that contributes meaningfully to society while reflecting the values promoted by Allu Arjun. The association extended heartfelt congratulations to all newly appointed district committee members and wished them success in carrying forward the mission of service and leadership. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
The last week of February is here and Holi festival is around the corner. With long weekend starting from tomorrow, let's look at the available OTT content on various streaming giants like Netflix, Amazon Prime Video, Zee5, JioHotstar and others for the week of 23rd February to 1st March. Here is your definitive guide to the latest OTT releases: The Week's Biggest Premieres: D/O Prasad Rao: Kanapadutaledu (ZEE5): One of the most anticipated regional releases, this Telugu crime thriller debuts on February 27th. Starring Rajeev Kanakala and Udhaya Bhanu, the series follows a father’s desperate search for his missing daughter, Swathi. As the investigation unfolds, it peels back layers of family secrets and hidden betrayals, promising an emotionally charged mystery. Ikkis (Amazon Prime Video): Sriram Raghavan’s biographical war drama arrives for all subscribers on February 26th. Starring Agastya Nanda as Second Lieutenant Arun Khetarpal, the youngest Param Vir Chakra recipient, the film chronicles his heroism during the 1971 Battle of Basantar. Notably, it features veteran actor Dharmendra in a significant role, adding immense sentimental value to the film. Bridgerton Season 4 Part 2 (Netflix): The wait for the "Lady in Silver" mystery concludes on February 26th. The final episodes of the season focus on Benedict Bridgerton’s (Luke Thompson) intense pursuit of Sophie Baek (Yerin Ha). Viewers can expect the signature blend of lavish masquerades, societal scandals, and high-stakes romance as the ton’s favorite bachelor faces a choice between duty and desire. The Bluff (Amazon Prime Video): Priyanka Chopra Jonas returns to the action genre in this gritty 19th-century Caribbean thriller, which premiered on February 25th. Playing Ercell "Bloody Mary" Bodden, a former pirate queen, she must protect her family when her violent past catches up with her. Directed by Frank E. Flowers, it is a high-octane survival story available in multiple Indian languages. New on Netflix: The streaming giant continues its streak of diverse storytelling. Alongside the Bridgerton finale, Netflix are releasing Accused on February 27th, a suspenseful drama starring Konkona Sen Sharma as a doctor fighting a scandalous allegation. For anime fans, the martial arts series BAKI-DOU arrives on February 26th, featuring the resurrection of a legendary swordsman. Additionally, the second part of the Japanese thriller The Queen of Villains is now available for those following the gritty world of 80s female wrestling. New on JioHotstar & Prime Video: JioHotstar is leaning heavily into thrillers and family sagas. On February 26th, it premiered One Battle After Another, a satirical action thriller starring Leonardo DiCaprio. For fans of Indian dramas, the multi-generational saga Sangamarmar also debuted on the same day. Meanwhile, Prime Video added the intense romantic thriller Psycho Saiyaan (Feb 25) and the music documentary Paul McCartney: Man on the Run (Feb 27), offering an intimate look at the icon’s life post-Beatles. Regional Highlights: Secret Stories: Roslin (JioHotstar): A chilling Malayalam psychological thriller from showrunner Jeethu Joseph, arriving February 27th. It follows a girl haunted by a green-eyed predator who unexpectedly appears as a houseguest. Thadayam (ZEE5): Premiering February 27th, this Tamil crime series stars Samuthirakani as an officer investigating ritualistic murders inspired by real 1999 events. Krantijyoti Vidyalay (ZEE5): A moving Marathi social drama debuting on February 27th, focusing on the battle to save a local language school from corporate closure. Ikk Kudi (Chaupal): Shehnaaz Gill takes on a spirited double role in this Punjabi rom-com that started streaming on February 26th. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒప్పందం కాదు; అది రెండు కుటుంబాల కలయిక, రెండు జీవితాల మేళవింపు. కానీ నేటి కాలంలో సంబంధం చూసేటప్పుడు మనం కేవలం ఆస్తులు, అంతస్తులు లేదా బాహ్య పరిస్థితులకే ప్రాధాన్యత ఇస్తూ, ఆ బంధంలో ఉండే అసలైన ఆప్యాయతను, మానవత్వాన్ని మర్చిపోతున్నామా? ముఖ్యంగా అవతలి కుటుంబంలో ఏదైనా చిన్న సమస్య ఉంటే, దాన్ని పెద్దదిగా చేసి చూస్తూ మంచి సంబంధాలను చేజార్చుకుంటున్నారా? ఈ వెబ్‌సైట్ కంటెంట్ ద్వారా పెళ్లి విషయంలో మన ఆలోచనా దృక్పథం ఎలా ఉండాలో తెలుసుకుందాం. మనం ఎందుకు ఆలోచించాలి?  ఒక కుటుంబంలో శారీరక వికలాంగులు (Physically Challenged) ఉన్నారని లేదా వృద్ధులు ఎక్కువగా ఉన్నారని సంబంధం వదులుకోవడం సరైనదేనా? మనం ఆలోచించాల్సిన కొన్ని ముఖ్య విషయాలు: • బాధ్యత బరువు కాదు, ఒక అందమైన బంధం: ఒక కుటుంబంలో బాధ్యతలు పంచుకోవడంలో ఒక రకమైన తృప్తి ఉంటుంది. అది ఒక "బ్యూటిఫుల్ రెస్పాన్సిబిలిటీ" అవుతుందే కానీ బరువు (Burden) కాదు. బాధ్యతలను బరువు అనుకుంటే, కాళ్ళు చేతులు బాగున్న వారిని చూసుకోవడం కూడా బరువే అవుతుంది. • మానవత్వం ముఖ్యం: మనం కూడా సమాజంలో ఒక భాగమే. ఒక కుటుంబంలో భాగమైనప్పుడు అక్కడి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం మానవత్వానికి నిదర్శనం. • ప్రేమ మాత్రమే ఆశిస్తారు: ఎదుటి కుటుంబం మీ ఆస్తులను లేదా సంపాదనను అడగదు; వారు కేవలం మీ నుంచి కొంచెం ప్రేమను మాత్రమే ఆశిస్తారు. అందరూ కలిసి ఉండటంలోనే అసలైన సంతోషం ఉంది. ఏం చేయకూడదు? (What Not To Do - సంకుచిత ఆలోచనలకు స్వస్తి చెప్పండి) చాలా మంది పెళ్లి విషయంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అవి ఏమిటంటే: • ఒక చిన్న కారణంతో సంబంధం వదులుకోవద్దు: కుటుంబంలో ఎవరైనా శారీరక ఇబ్బందులతో ఉన్నారని లేదా తల్లి/తండ్రి లేరని (Single Parent) నిర్దాక్షిణ్యంగా సంబంధం వద్దు అనడం సరికాదు. ఈ "నారో థింకింగ్" (Narrow Thinking) మారాలి. • నెగిటివిటీని పెంచుకోవద్దు: పెళ్లికి ముందే "ఆడబిడ్డ ఉంటే ఇబ్బంది పెడుతుందేమో", "బాధ్యతలన్నీ మా అమ్మాయి మీద పడతాయేమో" అనే భయంతో నెగిటివిటీని పెంచుకోవద్దు. • అతి తక్కువ లేదా అతి ఎక్కువ సమయం: సంబంధం కుదిరిన వెంటనే ఏమీ ఆలోచించకుండా పెళ్లి చేసేయడం (Spot Decisions) ఎంత తప్పో, నెలల తరబడి కమ్యూనికేషన్ గ్యాప్ పెంచుకుంటూ నిర్ణయం తీసుకోకపోవడం కూడా అంతే తప్పు. ఎలాంటి అడుగులు వేయాలి? (How to Proceed - సరైన మార్గం) మంచి సంబంధాన్ని ఎంచుకోవడానికి ఈ క్రింది పద్ధతులను పాటించండి: 1. సరైన సమయం కేటాయించండి (Decent Time): అవతలి కుటుంబం గురించి ఎంక్వైరీ చేసుకోవడానికి, పిల్లలు మాట్లాడుకోవడానికి తగినంత సమయం ఇవ్వాలి. 2. ఓపెన్ కమ్యూనికేషన్: ఆస్తుల దగ్గర నుంచి కుటుంబ పరిస్థితుల వరకు ప్రతి విషయం గురించి ఓపెన్‌గా మాట్లాడుకోవాలి. 3. కొన్నిసార్లు కలవండి: పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి కనీసం 2 నుండి 4 సార్లు కలుసుకోవాలి. మొదటి మీటింగ్‌లో పర్సనాలిటీ, వైబ్స్ నచ్చితే, రెండోసారి కలవాలని అనిపించడమే ఒక పాజిటివ్ సైన్. 4. పూర్తిగా తెలుసుకోవడం అసాధ్యం: పెళ్లికి ముందే ఒక మనిషి గురించి 100% తెలుసుకోవడం ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. పెళ్లి తర్వాత కూడా ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రక్రియ (Learning Process) కొనసాగుతూనే ఉంటుంది. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్రశ్న: ఒక కుటుంబంలో వికలాంగులు ఉంటే మా అమ్మాయిని ఇవ్వడం ఆ బాధ్యత అంతా ఆమె మీద పడటం కాదా?  జవాబు: ఈ రోజుల్లో ఎవరూ పూర్తిగా ఇతరులపై ఆధారపడటం లేదు. రోజువారీ పనుల కోసం మనుషులను పెట్టుకునే సౌకర్యాలు ఉన్నాయి. ఒక కుటుంబంలో భాగమైనప్పుడు ప్రేమతో బాధ్యతను పంచుకోవడం వల్ల బంధం బలపడుతుంది కానీ అది బరువు అవ్వదు. ప్రశ్న: పెళ్లికి ముందు అబ్బాయి లేదా అమ్మాయి గురించి పూర్తిగా ఎలా తెలుసుకోవాలి?  జవాబు: పెళ్లికి ముందే మనిషి గురించి పూర్తిగా తెలుసుకోవడం సాధ్యం కాదు. మనుషులు మెచ్యూరిటీతో మారుతూ ఉంటారు. కొన్ని ప్రాథమిక విషయాలు చర్చించుకుని, కుటుంబం మంచిదని అనిపించినప్పుడు ముందుకు వెళ్లాలి. మిగిలిన విషయాల్లో పెళ్లి తర్వాత సర్దుకుపోవాల్సి ఉంటుంది (Adjust and move on). ప్రశ్న: తల్లి లేదా తండ్రి లేని సంబంధాలను ఎందుకు వద్దు అంటున్నారు?  జవాబు: ఇది కేవలం సంకుచిత ఆలోచన మాత్రమే. అబ్బాయికి లేదా అమ్మాయికి తల్లి/తండ్రి లేనప్పుడు, మీరు ఆ ప్లేస్‌ను భర్తీ చేసే అవకాశం ఉంటుంది. వారి నుంచి ప్రేమను పొందడం, వారికి ప్రేమను ఇవ్వడం వల్ల జీవితం సంతోషంగా ఉంటుంది. జీవితంలో పెళ్లి అనేది ఒక పెద్ద మలుపు. భయంతోనో, సంకుచిత భావాలతోనో కాకుండా, ప్రేమతో మరియు నమ్మకంతో అడుగు వేయండి. బంధాలను బాధ్యతలుగా కాకుండా, వరాలుగా భావించండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మరియు పూర్తి చర్చ కోసం మా యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి: పెళ్లి మరియు సంబంధాల గురించి మరింత లోతైన అవగాహన కోసం "Naveena Column" యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ మేము ఇటువంటి ఎన్నో సామాజిక అంశాల మీద చర్చలు జరుపుతాము.Click Here For More Details  NaveenaColumn    
ఏ బంధం అయినా నిలబడటానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం. అందులో భార్యాభర్తల బంధం మరీ సున్నితమైనది. కానీ ఆ బంధాన్ని ఎంత దృఢంగా మార్చుకుంటారు అనేదే ఇక్కడ ముఖ్యం.  భార్యాభర్తల బంధం బలంగా మారడానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం వల్ల ఎలాంటి పరిస్థితిని అయినా సులభంగా దాటవచ్చు. అయితే పరస్పర అవగాహన కోసం  కొన్ని చిట్కాలు పాటించాలి.  అవేంటో తెలుసుకుంటే.. బార్యాభర్తల బంధం.. భార్యాభర్తల మధ్య సంబంధం చాలా విలువైనది. కానీ పరస్పర అవగాహన లేకపోవడం వల్ల, ఆ సంబంధం తెగిపోయే అంచుకు చేరుకుంటుంది. బయట ఎంత మంది వ్యక్తులు ఉన్నా, జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా.. జీవితాంతం కలిసి ఉండేది భార్యాభర్తలే.. కానీ దురదృష్ట వశాత్తు చాలామంది ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా..  ఒకరినొకరు అర్థం చేసుకోకుండా, ఇతరుల కారణంగా గొడవ పడుతూ ఉంటారు.  ఇది బంధాలను దెబ్బతీస్తుంది. పరస్పర  అవగాహన పెరగాలంటే.. భార్యాభర్తలు ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా వినాలి,  ఒకరితో ఒకరు విశాల హృదయంతో మాట్లాడుకోవాలి. ఇలా మాట్లాడుకున్నప్పుడే ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరుగుతుంది.  అదే బంధం బలంగా మారడానికి సహాయపడుతుంది. భార్యాభర్తల మధ్య ఏదైనా అపార్థం ఉంటే, కూర్చుని దాన్ని పరిష్కరించుకోవాలి.  ప్రతిరోజూ ఒకరికొకరు కొంత సమయం కేటాయించుకోవాలి.  ఇద్దరు ఒకరి సమస్యను ఒకరు చెప్పుకోవాలి.  వాటికి తగిన పరిష్కారాన్ని ఇద్దరూ కలిసి మాట్లాడుకుని నిర్ణయించుకోవాలి.  అప్పుడు ఇద్దరినీ ఎలాంటి సమస్య ఇబ్బంది పెట్టవు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఇద్దరిలో ఎవరైనా తప్పు చేస్తే  క్షమాపణ చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు.  అలాగే భార్యాభర్తలలో ఎవరైనా తప్పు చేసి క్షమాపణ చెప్పినప్పుడు, వారిని క్షమించడం ఎదుటి వ్యక్తి కర్తవ్యం.  అప్పుడే ఇద్దరూ బాగుంటారు.  బంధం బలంగా మారుతుంది.   భార్యాభర్తల బంధానికి నమ్మకం పునాది అయితే.. గౌరవం అంతకు మించి బలమైనది. ఒకరినొకరు నమ్మాలి,  నమ్మకం లేకపోతే ఇద్దరి మధ్య అనుమాన పూరిత ప్రవర్తన మిగులుతుంది.  అంతేకాదు.. బాగస్వామితో నిజాయితీగా ఉండాలి. ఏ విషయాన్ని అయినా చర్చించాలి,  చెప్పుకోవాలి. అప్పుడే ఇద్దరి మధ్య బందం బలంగా మారుతుంది.                                      *రూపశ్రీ.           
నేటి కాలంలో ప్రజల ఉద్దేశాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. బయటకు ఒకటి చెబుతారు, కానీ తరువాత వారు చేసేది మరొకటి ఉంటుంది. దీని వలన ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం కష్టమవుతుంది.  కొందరు ఇలాంటి సందిగ్ధంలో ఎవరినీ నమ్మకుండా ఒంటరిగా ఉండిపోతారు, మరికొందరు  అందరూ మంచోళ్లే అనే అబిప్రాయంతో ఏదో ఒక రోజు ఇతరుల స్వార్థానికి బలి అయిపోతారు. కానీ ఎవరినీ నమ్మకుండా ఉంటే ఏదో ఒకరోజు తమ మీద తాము నమ్మకం కోల్పోయే పరిస్థితికి చేరుకుంటారు.  అలాగని అందరినీ గుడ్డిగా కూడా నమ్మకూడదు. దీనికి పరిష్కారమే ఆచార్య చాణక్యుడు చెప్పిన మార్గం.  మనిషిలో ఉండే కొన్ని లక్షణాల ఆధారంగా ఆ మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించవచ్చట.  ఇంతకూ ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుంటే.. స్వార్థం.. ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడానికి మంచి  సమయం ఏదంటే.. వారు స్వార్థపరులుగా ఉన్న సమయమే.. ప్రతిఫలం కోసం, ప్రశంసల కోసం ఆశించకుండా,   వ్యక్తిగత లాభం లేని సమయాల్లో,  సందర్భాలలో వ్యక్తి నిజమైన స్వభావం బయటపడుతుంది. సంకోచం లేకుండా తమ బాధ్యతలను నెరవేర్చేవారు, నష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు కూడా నిజాయితీగా ఉండేవారు, వారి నిజమైన ఉద్దేశాలను బయటపెడతారు. ఒకరి మంచితనం లాభానికి మాత్రమే పరిమితం అయితే, అదే వారి నిజమైన స్వభావం. ఇది వారి స్వార్థం అవుతుంది.  అలాంటి వ్యక్తులు స్వార్థపరులు. బాధ్యత..  వాయిదా వేయడం అనేది చాలామందిలో కనిపించే గుణం.  మరీ ముఖ్యంగా ఎదుటివారికి ఏదైనా మాట ఇచ్చి, తప్పడం అనేది బాధ్యతను విస్మరించడం అవుతుంది. స్పష్టమైన సమాధానాలు ఇవ్వకపోవడం లేదా  సరైన సమాధానాలు చెప్పకుండా ఉండేందుకు కావాలని గొడవలు క్రియేట్ చేయడం అనేది వారి మనసులో వేరే ఉద్దేశ్యం ఉందని సూచిస్తుంది.  చాలామంది  సహజంగానే వారి ప్రణాళికలు లేదా సౌలభ్యానికి  వ్యతిరేకంగా ఏదైనా ఉంటే దాన్నుండి తప్పించుకోవడానికి లేదా వాటిని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తారు.  పదే పదే వాయిదా వేయడం లేదా మాట తప్పడం అనేది  బలహీనతకు సంకేతం అని కొందరు అనుకుంటారు. కానీ నిజానికి బలహీనత కంటే వారి ఉద్దేశ్యమే వేరు అని అర్థం.  ఎందుకంటే వారు తమ పనుల్లో ఇలాంటి అలసత్వం అస్సలు చూపించరు. ఒత్తిడి, బాధ.. ఒత్తిడి,  బాధ కూడా వ్యక్తి  నిజమైన స్వభావాన్ని వెల్లడిస్తాయి. ఒత్తిడి ఒక వ్యక్తిని మార్చదు, కానీ అది వారిలో అంతర్గతంగా దాగి ఉన్న స్వభావాన్ని వెల్లడిస్తుంది. పరిస్థితులు చాలా ఛాలెంజింగ్ గా  ఉన్నప్పుడు ఒక వ్యక్తి నిజాయితీగా ఉంటాడా లేదా చాకచక్యంగా ఉంటాడా, ప్రశాంతంగా ఉంటాడా లేదా దూకుడుగా ఉంటాడా అని గమనిస్తే..  ఆ సమయంలో వారి స్వభావం,  వారి ప్రవర్తనను బట్టి వారి వ్యక్తిత్వం బయటకు తెలుస్తుంది. విధేయత.. ప్రజల పొగడ్తల కంటే కూడా ఒక వ్యక్తి వ్యక్తిగతంగా ఎవరిని గౌరవిస్తాడనేది చాలా ముఖ్యం. ఎవరి అభిప్రాయాలకు విలువ ఇస్తారు,  ఎవరి సరిహద్దులను వారు సహజంగా గౌరవిస్తారు అనే విషయాల మీదే  వారి ప్రాధాన్యతలు  ఉంటాయి. ఒక సంఘటన ఆధారంగా ఎవరి గురించి జడ్డ్  చేయకూడదు. నిజమైన ఉద్దేశాలు కాలక్రమేణా పదే పదే రిపీట్ గా జరిగే పనులలో బయటకు తెలుస్తాయి.  ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంటే అదే వారి నిజాయితీకి బలమైన సాక్ష్యం  అవుతుంది.                                              *రూపశ్రీ
నేటికాలంలో అబ్బాయిలను ఇబ్బంది పెడుతున్న సమస్య బట్టతల.  తల మీద జుట్టు బాగా రాలిపోయి తల చర్మం బయటికి కనిపిస్తూ ఉంటే దాన్ని బట్టతల అని అంటారు.  బట్టతల వచ్చాక ఆ ప్రాంతంలో ఇక వెంట్రుకలు తిరిగి పెరగవు.  ఒకప్పుడు బట్టతల పెద్దవారికి మాత్రమే వచ్చేది.  కానీ నేటికాలంలో మాత్రం అది పూర్తీగా విభిన్నంగా ఉంది.  చిన్న వయసులోనే బట్టతలతో ఇబ్బంది పడేవారు ఉన్నారు. అయితే బట్టతల రావడానికి శరీరంలో కొన్ని లోపాలు కారణం అవుతాయి.  అవేంటో తెలుసుకుంటే.. జుట్టు నిర్మాణం.. జుట్టు నిర్మాణం ప్రధానంగా ప్రోటీన్ తో రూపొందించబడి ఉంటుంది. ఆహారం సరిగా లేకపోయినా,  సరైన ఆహారం తీసుకోకపోయినా, ఎక్కువ కాలం ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోయినా క్రమంగా జుట్టు పలుచబడి,  రాలిపోవడానికి దారితీస్తుంది. ఇది ఎక్కువ కాలం సాగితే బట్టతలగా మారే అవకాశం ఉంటుంది. పురుషుల్లో బట్టతల.. పురుషుల్లో బట్టతల అనేది జన్యుశాస్త్రం,  హార్మోన్ల మార్పుల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.  తండ్రి లేదా తాత వంటి వారికి బట్టతల ఉంటే.. కాలక్రమేణా పిల్లలకు బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది. ఒత్తిడి సమస్యలు.. ఒత్తిడి,  నిద్ర సమస్యలు ఉన్నవారిలో కూడా బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది.  ఒత్తిడి,  ఆందోళన కారణంగా  ఒత్తిడి హార్మోన్ పెరిగి జుట్టు రాలిపోవడానికి కారణం అవుతుంది. అలాగే శరీరంలో పోషకాలు లోపించినప్పుడు కూడా బట్టతలకు దారితీస్తుంది. విటమిన్స్.. ప్రోటీన్ మాత్రమే కాకుండా జుట్టు పెరుగుదలలో విటమిన్-డి,  ఐరన్, జింక్, బయోటిన్ అని పిలువబడే విటమిన్-బి17 కూడా కీలకపాత్ర పోషిస్తాయి.  ఇవి లోపించడం వల్ల కూడా బట్టతల వచ్చే అవకాశం  ఉంటుంది. మగాళ్లకే కాదు.. బట్టతల అనేది మగాళ్లకు మాత్రమే వచ్చే సమస్య అనుకుంటే పొరపాటు.  ఇది ఆడవాళ్లకు కూడా వస్తుంది.  ఆడవాళ్లలో జుట్టు పలుచబడి,  తలమీద చర్మం బయటకు కనిపిస్తూ,  తల వెంట్రుకల మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.   దీన్ని ఆడవాళ్లలో బట్టతలగా పరిగణిస్తారు.                                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
శరీరంలో ఏదైనా వ్యాధి లేక జబ్బు వస్తే.. అది వెంటనే బయటపడకపోయినా.. శరీరం మాత్రం వాటికి సంబంధించి సంకేతాలు ఇస్తూనే ఉంటుంది.  వీటినే ఆయా జబ్బుకు సంబంధించిన లక్షణాలు అంటుంటాం.  శరీరం పదే పదే  సంకేతాలు ఇస్తుంటే వాటిని నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా  థైరాయిడ్ పనిచేయకపోవడం కూడా అలాంటి సమస్యే.. థైరాయిడ్ సరిగా పనిచేయకపోతే  సమస్య నెమ్మదిగా పెరుగుతూ మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో ఉన్న ఒక చిన్న, సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. ఇది శరీర జీవక్రియను నియంత్రిస్తుంది. ఇది సరిగ్గా పనిచేయనప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్ సమస్య ఉందని ఎలా తెలుసుకోవాలో.. ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలో తెలుసుకుంటే.. చలిగా అనిపించడం.. వాతావరణం సాధారణంగా ఉన్నప్పటికీ,  ఇతరులకన్నా చల్లగా అనిపిస్తే అది  జీవక్రియ మందగిస్తున్నదానికి సంకేతం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు శరీరం తక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల చల్లగా అనిపిస్తుంది. ఏకాగ్రత.. తరచుగా మరచిపోవడం, దృష్టి కేంద్రీకరించలేకపోవడం లేదా నీరసంగా అనిపించడం కూడా థైరాయిడ్ వ్యాధికి  సంకేతాలు కావచ్చట.  ఇది హార్మోన్ల అసమతుల్యత మానసిక పనితీరును ప్రభావితం చేస్తుంది. నెలసరి సమస్యలు.. స్త్రీలలో, అధికంగా లేదా  క్రమరహిత ఋతుస్రావం లేదా సాధారణం కంటే ఎక్కువ రక్తస్రావం థైరాయిడ్ సమస్యతో ముడిపడి ఉండే అవకాశం ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత నేరుగా ఋతు చక్రంపై ప్రభావం చూపుతుంది. బరువు పెరగడం..  ఆహారంలో ఎటువంటి  మార్పులు చేయకపోయినా  బరువు పెరుగుతున్నట్లయితే, అది నెమ్మదిగా జీవక్రియ జరుగుతుందనడానికి సంకేతం కావచ్చు. థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు, శరీరం కేలరీలను చాలా నెమ్మదిగా బర్న్ చేస్తుంది. దీని వల్ల బరువు పెరుగుతారు. చర్మం.. నిస్తేజంగా,  పొడిబారిన చర్మం, గరుకుగా ఉండే జుట్టు కూడా థైరాయిడ్ అసమతుల్యతను సూచిస్తుంది. ఎవరికి థైరాయిడ్ వ్యాధులు ప్రమాదం  ఉంటుంది?  ఆరోగ్య నిపుణుల ప్రకారం కొంతమందికి థైరాయిడ్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పురుషుల కంటే మహిళలకు ఎక్కువ ప్రమాదం ఉంటుంది. కుటుంబ సభ్యులకు థైరాయిడ్ సమస్యల చరిత్ర ఉంటే వారికి  ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన మహిళల్లో ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. తల లేదా మెడకు రేడియేషన్ థెరపీ పొందిన లేదా అధిక మొత్తంలో అయోడిన్ ఉన్న మందులు తీసుకుంటున్న టర్నర్ సిండ్రోమ్ ఉన్నవారు  జాగ్రత్తగా ఉండాలి. వైద్యుడిని ఎప్పుడు కలవాలి.. పైన చెప్పుకున్న లక్షణాలు చాలా వారాల పాటు కొనసాగితే లేదా క్రమంగా పెరిగితే, TSH, T3,  T4  రక్త పరీక్షలు చేయించుకోవాలి. చికిత్సను ముందుగానే ప్రారంభిస్తే థైరాయిడ్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. థైరాయిడ్ వ్యాధి సాధారణం, కానీ వెంటనే గుర్తించి చికిత్స చేయకపోతే అది  గుండె, బరువు, మానసిక ఆరోగ్యం,  సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల శరీరం ఇచ్చే సంకేతాలను తేలికగా తీసుకోకూడదు.  వైద్యుడిని కలిసి చికిత్స తీసుకోవాలి.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  నేటి వేగవంతమైన ప్రపంచంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ఒక విలాసం కాదు, అది ఒక అవసరం. మీ ఫిట్‌నెస్ ప్రయాణాన్ని సరైన దిశలో నడిపించడానికి ఈ క్రింది సమగ్ర సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం: మీ ఫిట్‌నెస్ ప్రయాణం ఇక్కడే మొదలు! మన పూర్వీకులు జిమ్ అంటే ఏంటో తెలియకపోయినా ఎంతో దృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారు. ఎందుకంటే వారి జీవనశైలిలో శారీరక శ్రమ ఒక భాగంగా ఉండేది. కానీ నేటి కాలంలో మనం చిన్న పనికి కూడా స్విగ్గీ లేదా జెప్టో వంటి యాప్స్ పై ఆధారపడుతూ, కనీసం నడవడానికి కూడా బద్ధకిస్తున్నాము. మన శరీరం కదలడానికి పుట్టింది, కూర్చోవడానికి కాదు. కదలిక లేని జీవితం వ్యాధులకు నిలయంగా మారుతోంది. మనం ఎందుకు వర్కవుట్ చేయాలి? • మనుగడ కోసం: నడక అనేది ఒక వ్యాయామం కాదు, అది మన మనుగడకు ప్రాథమిక అవసరం. మనం ఆరోగ్యంగా బతకాలంటే శారీరక కదలిక తప్పనిసరి. • ఒత్తిడిని జయించడానికి: నిత్యం ఉండే మానసిక ఒత్తిడి, ఆందోళనల నుండి ఉపశమనం పొందడానికి రెసిస్టెన్స్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు ఎంతో మేలు చేస్తాయి. • శరీర పునరుజ్జీవనం కోసం: సరైన వర్కవుట్ మరియు తగినంత నిద్ర మీ బాడీని రిజూవినేట్ (Rejuvenate) చేసి, రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. ఏం చేయకూడదు?  • లిఫ్ట్‌లు మరియు యాప్స్ పై అతిగా ఆధారపడటం: చిన్న దూరాలకు కూడా వాహనాలు వాడటం లేదా లిఫ్ట్‌లు వాడటం మానేయండి. మెట్లు ఎక్కడం వంటి చిన్న చిన్న పనులను వ్యాయామంగా కాకుండా దైనందిన కృత్యంగా మార్చుకోండి. • రాత్రిపూట ఆలస్యంగా వర్కవుట్ చేయడం: వీలైనంత వరకు రాత్రి 7 గంటల తర్వాత భారీ వర్కవుట్స్ చేయకండి. దీనివల్ల బాడీలో కార్టిసోల్ లెవెల్స్ పెరిగి, మీ నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంది. • నిద్రకు ముందు స్క్రీన్ చూడటం: నిద్రలేమి (Insomnia) సమస్యలను నివారించడానికి పడుకునే ముందు ఫోన్ లేదా టీవీ చూడటం మానేయాలి. • వర్కవుట్ సమయంలో నీళ్లు తాగకపోవడం: వర్కవుట్ చేసేటప్పుడు లిక్విడ్స్ తీసుకోకూడదనేది తప్పుడు ప్రచారం. నీరు తాగకపోతే ఎలక్ట్రోలైట్స్ కోల్పోయి నీరసం (Dizziness) వచ్చే ప్రమాదం ఉంది. సరైన పద్ధతిలో వర్కవుట్ ఎలా చేయాలి? • సరైన సమయం: జిమ్ చేయడానికి ఉదయం 5 నుండి 9 గంటల లోపు అత్యంత అనుకూలమైన సమయం. • వ్యాయామ కాలపరిమితి: రోజుకు కనీసం ఒక గంట వెయిట్ ట్రైనింగ్ మరియు ఆ తర్వాత 20 నుండి 30 నిమిషాల కార్డియో చేయడం ఉత్తమం. మొత్తం మీద 1.5 గంటల రొటీన్ సరిపోతుంది. • సహజ ఎలక్ట్రోలైట్స్: వర్కవుట్ మధ్యలో ఉప్పు నీరు, నిమ్మరసం లేదా పుదీనా కలిపిన నీటిని సిప్ చేస్తూ ఉండటం వల్ల కోల్పోయిన లవణాలు తిరిగి లభిస్తాయి. • ఆహారం మరియు విశ్రాంతి: ఒకవేళ సాయంత్రం వర్కవుట్ చేసినా, ఆ తర్వాత ప్రోటీన్ మరియు ఫ్యాట్ అధికంగా ఉండే ఆహారం తీసుకుని, వేడి నీటి స్నానం చేసి పడుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ప్రశ్నలు - సమాధానాలు  1. నడకను ఫిట్‌నెస్‌లో భాగంగా చూడవచ్చా:  లేదు, నడక అనేది మన శరీరం ప్రాథమికంగా చేసే పని. ఫిట్‌నెస్ కోసం అదనపు వ్యాయామాలు అవసరం. 2. జిమ్ చేయడానికి రోజులో ఏ సమయం ఉత్తమం: ఉదయం వేళల్లో చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత బాగుంటుంది. అయితే సమయం లేని వారు తగిన జాగ్రత్తలతో సాయంత్రం కూడా చేయవచ్చు. 3. బాడీ రికవరీ అవ్వాలంటే ఏం చేయాలి: తగినంత నిద్ర చాలా ముఖ్యం. నిద్రలోనే శరీరం తనను తాను మరమ్మతు చేసుకుంటుంది. నిద్ర తగ్గితే 'బ్రెయిన్ ఫాగ్' మరియు నీరసం వచ్చే అవకాశం ఉంది. ముగింపు: మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. కేవలం ఆహార నియమాలు పాటిస్తే సరిపోదు, తగినంత కదలిక మరియు వ్యాయామం కూడా ఉండాలి. సీడ్ ఆయిల్స్ మరియు కల్తీ పాల పదార్థాలకు దూరంగా ఉంటూ, ఒత్తిడిని నియంత్రించుకోవడం అలవాటు చేసుకోండి. మీ ఫిట్‌నెస్ ప్రయాణంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మరియు నిపుణుల సలహాల కోసం మా YouTube Channel (Video link: https://youtu.be/u4uDJUP7Fw0?si=j6YfUFILXu2eJwcc ) ని సందర్శించండి. అక్కడ మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోలు మరియు వర్కవుట్ చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి!