సీఐ అంజు యాదవ్ ఇమేజ్ పెంచేసిన పవన్?!

Publish Date:Jul 17, 2023

Advertisement

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన సర్కిల్ ఇన్స్ పెక్టర్ అంజు యాదవ్ వర్సెస్ జనసేన అన్నట్లుగా ఏపీలో ఒక వివాదం నడుస్తున్నది. జనసేన పార్టీ జిల్లా కార్యదర్శితో సీఐ దురుసుగా ప్రవర్తించడం, ఆయనపై సీఐ చేయిచేసుకోవడంతో జనసేన సీరియస్ అయింది. జనసేన పార్టీ కార్యకర్తల నుండి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వరకూ ఈ విషయంపై సీరియస్ అవుతున్నారు.

 జనసేన జిల్లా కార్యదర్శి సాయిపై చేయి చేసుకోవడం సహా  ఆమె పాత వీడియోలను వైరల్ చేసిన జనసేన కార్యకర్తలు ఆమెపై చర్య తీసుకోవాలని కోరారు. గతంలో ఆమె అమాయకులను ఇబ్బంది పెట్టడం, తొడకొట్టి సవాళ్లు విసిరడం వంటి పలు ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆమెకు పోలీస్ శాఖ చార్జ్ మెమో జారీచేశారు. జనసేన నేతపై చేయిచేసుకున్న ఘటనపై ఇప్పటికే జిల్లా ఎస్పీ విచారణ నిర్వహించి.. డీజీపీకి నివేదిక కూడా సమర్పించారు. ఈ ఘటనపై  మానవ హక్కుల కమిషన్ కూడా సీరియస్ అయ్యింది. సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ ఇందుకు సంబంధించి ప్రతివాదులైన అయిదుగురికి నోటీసులు జారీ చేసి ఈ నెల 27వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.

మరోవైపు ఇదే ఘటనపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఐ అంజు యాదవ్ చేయి చేసుకుంటున్నా సహనంగా ఉన్న సాయిని పవన్ కల్యాణ్ అభినందించి.. సాయిలాంటి దృఢ సంకల్పం ఉన్నవారు జనసేనకు కావాలంటూ పొగడ్తల వర్షం కురిపించారు. అంతేకాదు, పవన్ తిరుపతికి వచ్చి సీఐ సంగతి తేలుస్తానంటూ ప్రకటించారు. అన్నట్లుగానే తిరుపతి వచ్చి ఫిర్యాదు కూడా చేశారు. అయితే అప్పటికే  ఎస్పీ విచారణ పూర్తి చేసి డీజీపీకి నివేదిక కూడా ఇచ్చేసినా పవన్ మాత్రం   ఐదుగురు జనసేన కార్యకర్తలతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సీఐపై ఫిర్యాదు చేశారు.  జనసేన ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపుతున్న సమయంలో దుమారం రేగింది. వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ నేతలు, వాలంటీర్లు ఆయన దిష్టిబొమ్మను దనహం చేశారు. ఇందుకు ప్రతిగా శ్రీకాళహస్తిలో గత బుధవారం జనసేన ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపం సమీపంలో పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టె సాయి మహేష్ తో పాటు ఇతర నాయకులు సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు సిద్దమయ్యారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో పోలీసులు, జనసేన శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు వారి నుండి దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకున్నారు. జనసేన నాయకులను బలవంతంగా టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సమయంలోనే జనసేన నేత సాయి మహేష్ పై సీఐ అంజు యాదవ్ చేయి చేసుకున్నారు. సరే ఆ ఘటనపై మానవహక్కుల కమిషన్, పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. వారి స్థాయిలో చేయాల్సింది చేస్తున్నారు.

ఇంత జరుగుతున్నా..   అసలు సీఐ అంజు యాదవ్ పై జనసేన కార్యకర్తలు, నేతలు ఇంకా పోరాటం చేయడం కరెక్టేనా? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ ఘటనలో తిరుపతికి వెళ్లి మరీ ఫిర్యాదులు చేయడం అవసరమా?  ఇది జనసేనాని స్థాయిని పెంచలేదు సరికదా, అంజు యాదవ్ ఇమేజ్ ను మాత్రం అమాంతంగా పెంచేసింది. జనసేన నేతలపై పోలీసులు ఎక్కడ దురుసుగా ప్రవర్తించినాపవన్ కళ్యాణ్ అక్కడకి వెళ్లి ఫిర్యాదులు చేస్తారా? అన్న ప్రశ్నలు పరిశీలకుల నుంచి వెలువడుతున్నాయి. ఒక సీఐకి పవన్ అనవసర ప్రాధాన్యత ఇచ్చారన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది.  జనసేన పార్టీ సీఐ అంజు యాదవ్ పై పోరాటం చేస్తున్నదా.. లేక ఆమె ఇమేజ్ పెంచుతున్నదా?  అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే నిత్యం పార్టీ కార్యకర్తలు, పోలీసు వ్యవస్థ మధ్య ఇలాంటి వాతావరణమే ఉంటుంది.

అందునా ఇలాంటి కోపాన్ని అణుచుకోలేని సీఐలు ఉన్న ప్రాంతాలలో ఇది ఎప్పుడూ ఉండేదే. అంజూ యాదవ్ జనసేన  జనసేన నేత సాయి మహేష్ పై చేయి చేసుకోవడం  ముమ్మాటికీ తప్పే. అందుకే పోలీస్ శాఖ తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెపై చర్యలకు ఉపక్రమించింది. మరోవైపు హెచ్ఆర్సీ కూడా స్పందించి వివరణ కోరింది. ఇలాంటి సమయంలో ఆ రెండు శాఖల వారికి కావాల్సిన సమాచారాన్ని జనసేన సమకూరిస్తే న్యాయం దక్కుతుంది. అందుకు భిన్నంగా స్వయంగా జనసేనాని పవన్ కల్యాణే ఆమెపై ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి తిరుపతికి రావడంతో అంజూ యాదవ్ కు ఒక సెలబ్రిటీ గుర్తింపు వచ్చేసింది. జనసేనానే స్వయంగా ఆమెకు ఎక్కడ లేని పబ్లిసిటీ ఇచ్చి ఆమె స్థాయిని పెంచేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.