స్కూల్లో ఉండాల్సిన పిల్లాడు స్టేడియంలో ఉతికారేసాడు: వైభవ్‌పై కమిన్స్ షాకింగ్ కామెంట్స్!
Publish Date:Jun 5, 2026
Advertisement
ఐపీఎల్ 2026 సీజన్ క్రికెట్ ప్రపంచానికి ఒక సరికొత్త వండర్ కిడ్‌ను పరిచయం చేసింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే దిగ్గజ బౌలర్ల గుండెల్లో వణుకు పుట్టించిన ఆ కుర్రాడే రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఈ సీజన్లో అతడు సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆస్ట్రేలియా దిగ్గజం ప్యాట్ కమిన్స్ సైతం వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్‌కు నోరెళ్లబెట్టక తప్పలేదు. ఈ క్రమంలోనే సూర్యవంశీ ఆటతీరుపై కమిన్స్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఆ పిల్లాడు క్రికెట్ గ్రౌండ్లో కాదు.. ఇంకా స్కూల్లోనే ఉండి ఉంటే బాగుండేదంటూ కమిన్స్ సరదాగా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఫాక్స్ క్రికెట్‌తో మాట్లాడిన ప్యాట్ కమిన్స్ ఈ 15 ఏళ్ల అసాధారణ హిట్టర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన టాలెంట్ అని, బంతిని చాలా బలంగా, చాలా దూరం బాదుతాడని కొనియాడాడు. అతనికి బౌలింగ్ చేసేటప్పుడు లైన్ అండ్ లెంగ్త్‌లో ఏమాత్రం పొరపాటు చేసినా కఠినమైన శిక్ష తప్పదని కమిన్స్ అంగీకరించాడు. అసలు 15 ఏళ్ల వయసులో ఇలాంటి వినాశకరమైన బ్యాటింగ్‌ను తాను తన కెరీర్లో ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. క్రీజులో ఉన్నప్పుడు బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టే ఈ కుర్రాడికి బౌలింగ్ చేయడం ఎంత కష్టమో వివరిస్తూ కమిన్స్ ఈ సరదా వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐపీఎల్ 2026 సీజన్లో సగం మ్యాచులకు దూరమైన కమిన్స్, గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన మొదటి మ్యాచ్‌లోనే సూర్యవంశీ విశ్వరూపాన్ని చవిచూడాల్సి వచ్చింది. జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్ లాంటి ప్రపంచ స్థాయి దిగ్గజాలకు ఎదురైన చేదు అనుభవమే కమిన్స్కూ ఎదురైంది. కమిన్స్ వేసిన తొలి బంతినే సూర్యవంశీ ఏమాత్రం భయం లేకుండా భారీ సిక్సర్‌గా మలిచాడు. ఆ మ్యాచ్‌లోనే ఈ యువ సంచలనం కేవలం 36 బంతుల్లోనే అద్భుతమైన శతకాన్ని బాదాడు. అయితే ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సూర్యవంశీ మరింత ఉగ్రరూపం దాల్చాడు
http://www.teluguone.com/news/content/pat-cummins-reacts-to-vaibhav-sooryavanshi-batting-ipl-2026-36-221869.html





