స్కూల్ వ్యాన్‌ను ఢీకొన్న ప్యాసింజర్ రైలు.. నలుగురు మృతి.!
Publish Date:Jul 17, 2026
Advertisement
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం (జులై 17) సంభవించిన ఘోర రైలు ప్రమాదంలో నలుగురు మరణించారు. మృతులలో నలుగురు పాఠశాల విద్యార్థులు ఉన్నారు. ముర్షిదాబాద్ ) జిల్లా కర్ణసుబర్ణ రైల్వే స్టేషన్ సమీపంలో గోబింద్‌పూర్ రైల్వే గేట్ ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌ను ప్యాసింజర్ రైలు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పాఠశాల విద్యార్థులతో పాటు మొత్తం నలుగురు సంఘటనా స్థలంలోనే మరణించారు. హౌరా వైపు వెళ్లే నవద్వీప్ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్లిన వెంటనే, అక్కడ విధులు నిర్వహిస్తున్న గేట్‌మన్ గేటును తెరిచాడు. అయితే అదే సమయంలో డౌన్ లైన్‌లో నిమ్తితా-కాట్వా ప్యాసింజర్ రైలు దూసుకొచ్చింది. అయితే.. గేటు తెరిచి ఉండటంతో రైలు వస్తోందని గమనించని స్కూల్ వ్యాన్ డ్రైవర్ ట్రాక్ దాటడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో ఒక సైక్లిస్ట్ కూడా పట్టాలు దాటుతున్నాడు. క్షణాల వ్యవధిలో దూసుకొచ్చిన ప్యాసింజర్ రైలు స్కూల్ వ్యాన్‌ను, సైక్లిస్ట్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. రైలు ఢీకొట్టిన వేగానికి స్కూల్ వ్యాన్ పూర్తిగా ముక్కలై, పట్టాల పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు, ఒక సైక్లిస్ట్ అక్కడికక్కడే మృతి చెందారు. వ్యాన్ డ్రైవర్‌తో పాటు మరో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న బెహ్రాంపూర్ పోలీసులు, రైల్వే రక్షణ దళం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు. గేట్‌మన్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయి విచారణకు హౌరా నుంచి ఒక ప్రత్యేక బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. ప్రమాదం కారణంగా ఆ రూట్‌లో రైళ్ల రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. West Bengal Train Accident, Murshidabad Train Collision, School Van Accident, Level Crossing Negligence
http://www.teluguone.com/news/content/passenger-train-rams-into-school-van-36-226264.html





