విద్యార్థుల ప్రాణాలతో నేతల చెలగాటం?
Publish Date:Sep 30, 2012
Advertisement
పాములకు కోరల్లోనే...రాజకీయనాయకులకు ఒళ్లంతా విషం అంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. చదువుకునే వయస్సు నుంచి రాజకీయాలు నేర్చుకోవాలనుకోవటం పొరబాటు కాదు. కానీ, చదువును పక్కనపెట్టి రాజకీయాలకు యువకులను అలవాటు చేయటం బాధ్యతారాహిత్యమని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రత్యేకించి విద్యార్థుల ప్రాణాలను బలిపెట్టి తమ సమస్యలను సాధించుకునేందుకు నేతలు కృషి చేస్తున్నారని వారు బహిరంగ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పత్రికల్లో తమ ఆందోళన కుండా తెలంగాణావాదులు అడ్డుపడుతున్నారని వీరు బాధపడుతున్నారు. ఒక ప్రత్యేకరాష్ట్రం సాధించాలని దాని కోసం ఏర్పాటైన తెలంగాణా రాష్ట్రసమితి (టిఆర్‌ఎస్) తమ పిల్లలను రెచ్చగొడుతోందంటున్నారు. నేతలు చేసే ప్రసంగాలు నిజమని నమ్మి తమ ప్రాణాలను త్యజించే స్థాయికి విద్యార్థులు రెచ్చిపోతుంటే యూనివర్శిటీ యాజమాన్యం, ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాయంటున్నారు. ఎనిమిదేళ్ల క్రితం టిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ ప్రారంభించిన ఆందోళన మొదలుకుని ఇప్పటి దాకా నష్టపోయింది ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులేనని సామాజిక అథ్యయనవేత్తలు సైతం స్పష్టం చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆందోళనలో ఉన్న బాధను ఎవరూ గుర్తించటం లేదని వారు అభిప్రాయ పడుతున్నారు. ప్రత్యేకరాష్ట్రం అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన అంశమైనా దాన్ని సీరియస్‌గా విద్యార్థులకు పరిమితం చేసేలా టిఆర్‌ఎస్ నాయకులు ప్రసంగిస్తున్నారని అంటున్నారు. ఆ పార్టీ అధినేత కేసిఆర్ ఓసారి తన ప్రకటనలో ఆత్మత్యాగం చేసైనా తెలంగాణా గౌరవాన్ని కాపాడాలని విద్యార్థులకు పిలుపు ఇచ్చారు. ఈ పిలుపు వందలాది మంది విద్యార్థుల పీకల మీదకు తెచ్చింది. కొందరైతే ప్రాణత్యాగాలు కూడా చేశారు. ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం విలిపించారో కూడా పట్టించుకోకుండా తన ప్రకటనను కేసిఆర్ సమర్ధించుకున్నారు. అంతేకాకుండా, ఇప్పటికీ కేసిఆర్ తన పర్యటనలకు ముందు, వెనుక విద్యార్థులతో ముడిపెట్టుకుంటున్నారు. ఇది ఇంకా ఎంత మంది కొంప ముంచుతుందో అని తల్లిదండ్రులు భయపడుతున్నారు. తాజాగా తెలంగాణా జెఎసి ప్రకటించిన మార్చ్‌ఫాస్ట్ కూడా ఉస్మానియా విద్యార్థులను రెచ్చగొడుతోంది. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీని రణరంగం చేశారు. పోలీసులతో విద్యార్థులు ఒక యుద్ధమే చేశారు. దీంతో తల్లిదండ్రులు ఏ చెడు వార్త వినాల్సివస్తుందో అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూశారు. ఇలానే ప్రతీ ఏడాది ఓ ఐదు, ఆరుసార్లు ఈ యూనివర్సిటీ ఉద్రిక్తప్రాంతంగా మారుతోంది. ఈ తెలంగాణా ఊసే పట్టని అమాయక విద్యార్థులు కూడా ఈ ఉద్యమాల వల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇకనైనా ఇటువంటి దారుణకాండకు తెలంగాణామార్చ్ తరువాత స్వస్తి పలికితే బాగుంటుందని ఉస్మానియా విద్యార్థుల తల్లిదండ్రులు చేతులు ఎత్తి కోరుతున్నారు.
http://www.teluguone.com/news/content/parents-in-dilemma-24-17775.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





