సర్దుకుపోతున్న ద్వారంపూడి...ఇంతకీ ఏ పార్టీ అంటారు?
Publish Date:Sep 30, 2012
Advertisement
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రతీ విషయంలోనూ సర్దుకుపోతున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి అరెస్టు, చంచల్‌గూడా జైలులో ఉన్న తరువాత ఈయన కూడా వైకాపాలోకి మారారు. కాంగ్రెసుపార్టీని వదిలి వైకాపాలోకి మారాక ద్వారంపూడి కార్యకర్తలకు కొంత దూరమయ్యారు. దాదాపుగా కాంగ్రెసు కార్యకర్తలు ఈయన అధికారాన్ని వినియోగించుకోవాలనే ప్రయత్నిస్తున్నారు కానీ, ఈయన వెనుక ఉండేందుకు ఇష్టపడటం లేదు. ఈ విషయాన్ని గమనించిన చంద్రశేఖరరెడ్డి కాంగ్రెస్ నాయకులతోనూ, మంత్రులతోనూ సఖ్యత నటిస్తున్నారు. మంత్రులు ఏ పని చెప్పినా జిల్లా కేంద్రమైన కాకినాడలో వారి తరుపున తాను స్వయంగా హాజరై ఆ పనిని చక్కబెడుతున్నారు. దీంతో ఈయన్ని కూడా పిలవకతప్పదనే పరిస్థితి ద్వారంపూడి కల్పించుకుంటున్నారు. అయితే కాంగ్రెసుపార్టీ కార్యక్రమాలకు మాత్రం ఈయన్ని పిలవటం లేదు. అడపాదడపా తెలిసిన కార్యక్రమాలకు కూడా హాజరయ్యేందుకు ద్వారంపూడి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ఈయన మాజీ కార్పొరేటర్లను, వార్డుల వారీగా ద్వితీయశ్రేణిలో ఉన్న నాయకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారట. అందులో భాగంగానే ఎవరు ఏ పని మీద తన దగ్గరకు వచ్చినా పార్టీ ప్రస్తావన తీసుకురావటం లేదట. అంతేకాకుండా కాంగ్రెసు నాయకులతో తరుచుగా కనిపిస్తుంటే ఇంతకీ ద్వారంపూడి ఏ పార్టీ అన్న సందేహం కూడా ఎక్కువైందంటున్నారు. ఈ విషయం తేల్చేందుకు ప్రయత్నిస్తే తాను వైకాపాలోనే ఉన్నానంటున్నారు. మరి కాంగ్రెసువారితో కలిసి తిరుగుతున్నారంటే ,పార్టీల దేముందండీ అంటూ ఆ ప్రశ్నను అలానే మిగిల్చి మాయమవుతున్నారట. ఇటీవల సాక్షిభవనాల నిర్మాణాల విషయంలో సిబిఐ విచారణ ఎదుర్కొన్న ద్వారంపూడి భవిష్యత్తులో మళ్లీ సిబిఐ ముందుకు అదే జననీ ఇన్‌ఫ్రా కేసులో హాజరవుతారని తూర్పుగోదావరి జిల్లా వాసులు చెప్పుకుంటున్నారు. ఈసారి ఆ సొమ్ముకు లెక్కచెబితే మాత్రం వైకాపాలోకి ద్వారంపూడి మారినట్లు కాకినాడ ఓటర్లు నమ్ముతారు.
http://www.teluguone.com/news/content/east-godavari-24-17776.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





