Publish Date:Dec 21, 2025
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు, వారి కుటుంబాల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో తమ తండ్రి గెలిస్తే భిక్షాటన చేస్తానని 'బిచ్చగాడు సినిమా తరహాలో ప్రతిన బూనాడో కుమారుడు. రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో ఎం.రామకృష్ణయ్య అనే వ్యక్తి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాడు.
ఇదే ఎన్నికల్లో ఆయన పెద్ద కుమారుడు కూడా బరిలో దిగాడు. ఈ నేపథ్యంలో ఆయన చిన్న కుమారుడు భాస్కర్.. తండ్రి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాడు. ఈ ఎన్నికల్లో తన తండ్రి గెలిస్తే.. భిక్షాటన చేస్తానని మొక్కుకున్నాడు. అనుకున్నట్టుగానే.. తన తండ్రి సర్పంచ్ అయ్యారు. మొక్కుబడి చెల్లించడంలో భాగంగా భాస్కర్ ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేసి.. కర్ణాటక రాష్ట్రంలోని గానుగాపూర్ దత్త క్షేత్రానికి వెళ్లాడు. ఈ ఘటనపై జే.లింగాపూర్ గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తండ్రిపై గల కుమారుడికి ఉన్న అంకితభావాన్ని కొనియాడుతూ అభినందనలు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/panchayat-elections-36-211368.html
హైదరాబాద్‌లో జరుగుతున్న ఆహార కల్తీపై కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు దిల్‍సుఖ్‍నగర్‌లో రోడ్డెక్కారు.
హైదరాబాద్ నగరంలోని సిలికాన్ సిటీగా పేరొందిన గచ్చిబౌలి ప్రాంతం మరోసారి మత్తు మాయాజాలానికి వేదికగా మారింది.
రెడ్డెప్పగారి మాధవీ రెడ్డి.. కడప ఎమ్మెల్యే గా గెలిచిన రోజు నుంచి జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుఉన్నారు
నికోలస్ మదురో పాలనలో ఆ దేశానికి చెందిన విలువైన బంగారు నిల్వలు భారీ ఎత్తున విదేశాలకు తరలిపోయినట్లు తాజా కస్టమ్స్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఎన్నికల వేళ మైనారిటీల రక్షణ బాధ్యతను బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ సర్కార్ గాలికొదిలేసిందా?
హైదరాబాద్‌లో బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న మాఫియా వ్యవహారం వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేపుతుంది.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది.
అసభ్యకరమైన కంటెంట్‌ను సృష్టించి ప్రచారం చేస్తున్న యూట్యూబర్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
ప్రియురాలి మరణాన్ని తట్టు కోలేక యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్‌ను డీజీజీఐ అధికారులు అరెస్టు చేశారు.
ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావుతో పాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు కుమారుడు సందీప్‌కు సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన పలు అంశాలపై స్పష్టత కోసం వీరిని విచారించ నున్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు.
తుళ్లూరు, అమరావతి మండలాల్లోని ఏడు గ్రామాల రైతుల నుంచి ప్రభుత్వం సుమారు 16,666 ఎకరాలను సమీకరించనుంది. ఇందు కోసం రైతుల నుంచి అంగీకార పత్రాలను అధికారులు స్వీకరిస్తున్నారు.