తిరుమల లడ్డూ తయారీలో పామాయిల్.. ఎన్ని లక్షల లీటర్లంటే?
Publish Date:Feb 4, 2026
Advertisement
సిట్ నివేదికలో విస్తుపోయే విషయాలు.. పయ్యావుల కేశవ్ జగన్ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన విషయాన్ని సుప్రీం ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ నిర్ధారించింది. ఈ మేరకు సిట్ నివేదిక కూడా వెల్లడంచింది. ఆ నివేదికలోని అంశాలపై ఇప్పుడు ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికార తెలుగుదేశం, వైసీపీ మధ్య మాటలయుద్ధం పీక్స్ కు వెళ్లింది. ఈ నేపథ్యంలో సిట్ నివేదికలో వెల్లడైన విస్తుపోయే విషయాలను ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యిని వినియోగించారని నివేదిక కుండబడ్డలు కొట్టిందని ఆయన చెప్పారు. నెయ్యి విషయంలో ప్రభుత్వం పూర్తిగా టెండర్ నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపించారు.తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం పామాయిల్, , కెమికల్స్, ఇతర ఫ్లేవర్లను కొనుగోలు చేసినట్లు సిట్ నివేదిక స్పష్టంగా పేర్కొందన్నారు. వైసీపీ నేతలు కల్తీని సహజం అంటున్నారని, శ్రీవారి విషయంలో అపచారం జరుగుతోందని తెలిసి కూడా మౌనంగా ఎందుకు ఉన్నారో తేలాలన్నారు. ఆ నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలున్నాయని సీఎం చంద్రబాబు చెప్పడంతో ఈ విషయంపై చర్చ మొదలైన సంగతిని గుర్తు చేసిన ఆయన కొవ్వు అవశేషాలపై చంద్రబాబు ఎన్డీటీబీ నివేదిక పేర్కొన్న విషయాలనే చంద్రబాబు చెప్పారన్నారు. సోయాబీన్, కోకోనట్, పామ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, లార్డ్ వంటి అవశేషాలు ఉండే అవకాశముందని ఎన్డీటీబీ నివేదిక పేర్కొందన్నారు.. వైసీపీ హయాంలో 2022 ఆగస్టు 3న బీటా సిటోస్టెరాల్ ఉన్నట్టు రిపోర్టు వచ్చిననా దాన్ని కొనసాగించారని, తమ తప్పును వైసీపీ నేతలు కప్పిపుచ్చుకున్నారని ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఫేక్ డాక్యుమెంట్లతో నెయ్యి టెండర్లు కేటాయించారని, ఆ టెండర్ల పాపంలో భాగస్వాములైన అందరినీ నేరస్థులుగా పరిగణిస్తామన్నారు. సుబ్బారెడ్డి, ధర్మారెడ్డితోపాటు పలువురు అధికారులు ఈ కల్తీ వ్యవహారంలో ఉన్నారనీ, తప్పు చేసిన అందరిపైనా చర్యలు తీసుకోవాలని సిట్ చెప్పిందని తెలిపారు. బాలాజీ, ధర్మారెడ్డి, సింఘాల్ పై చర్యలకు సిట్ సిఫార్సు చేసిందని పయ్యావుల కేశవ్ అన్నారు.
http://www.teluguone.com/news/content/pamoil-used-in-tirumala-laddu-36-213492.html





