Publish Date:Nov 11, 2024
పాడి కౌశిక్ రెడ్డి. ఈ పేరు తెలంగాణ రాజకీయాల్లో మారు మ్రోగిపోతుంది, గతంలో పిఏసీ చైర్మెన్ పదవిఅరికెపూడికి రేవంత్ సర్కారు ఇవ్వడంతో ఒంటి కాలిపై లేచినంత పని చేశాడు. పాడి కౌశిక్ రెడ్డి హైదరాబాద్ జట్టుకు దేశవాళీ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించాడు. అయన తన తొలి మ్యాచ్ ను పంజాబ్ తో తలపడ్డాడు. 2004 డిసెంబరు 22 వతేదీన ఈ మ్యాచ్ ఆడాడు. ఆయన రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ గా, మీడియం పేసర్ గా జట్టుకు సేవలందించాడు. ప్రస్తుత రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ కు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ అని చెప్పొచ్చు. తన స్వంత పార్టీకి చెందిన బిఆర్ ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి కాంగ్రెస్ వైపు చూసినప్పుడు కౌశిక్ రెడ్డి పావుగా కెసీఆర్ గేమ్ ఆడారు. కెసీఆర్ కనుసన్నల మీదే కౌశిక్ రెడ్డి అరికెపూడిపై చెలరేగిపోయారు. బిఆర్ ఎస్ జెండాపై గెలిచి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ విధంగా సపోర్ట్ చేస్తారని బిఆర్ ఎస్ నేతలను గట్టిగా నిలదీసిన ఏకైక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అని చెప్పొచ్చు. తన చివరి మ్యాచ్ 2007లో ఆడి, క్రికెట్ నుండి శాశ్వతంగా తప్పుకున్నాడు. ఆయన రాజకీయ గురువు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చి రాజకీయ గురువు ఉత్తమ్ కుమార్ రెడ్డికి వెన్నుపోటు పొడిచి ఓవర్ నైట్ లో బిఆర్ఎస్ లో చేరిపోయారు.హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఈటెల రాజేందర్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఈటెల రాజేందర్ పై బిఆర్ ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈటెల వంటి పవర్ పుల్ పొలిటిషియన్ రాజకీయాల్లో ఓనమాలు దిద్దుకుంటున్న కౌశిక్ రెడ్డి చేతిలో ఓడిపోవడంతో చర్చనీయాంశమయ్యారు. బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ దృష్టిలో పడ్డ కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లో జంప్ అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు. కెసీఆర్ ప్రవేశ పెట్టిన దళిత బంధు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయడం లేదని రెచ్చిపోయారు.
పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ నటనలో ఆరితేరిపోతున్నారు. కేసీఆర్ హయాంలో పెండింగ్ లో పెట్టిన దళిత బంధు నిధుల్ని ఇవ్వాలని తాజాగా ఆయన చేసిన రచ్చ చూసి అందరూ ముక్కును వేలేసుకున్నారు. ఆయన కోసం వందల మంది రాలేదు. పట్టుమని పది మంది కూడా లేరు. కానీ పోలీసుల సాయంతో..తన సోషల్ మీడియా టీం క్రియేటివిటీతో ఆయన చేసిన రచ్చ చూసి అందరూ ఔరా అనుకున్నారు. కౌశిక్ రెడ్డి సోషల్ మీడియా స్టార్ గా మారి పోయారు. ఆయన పండించిన సన్నివేశాల్లో స్పృహ తప్పడం దగ్గర నుంచి ఆస్పత్రిలో చొక్కా విప్పేసి మీడియాతో మాట్లాడటం చివరికి చేతికి కట్టుతో బయటకు రావండి వరకూ చాలా ఉన్నాయి. కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టార్గెట్ కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఆయన రాజకీయాలు నడుపుతున్నారు. నన్ను హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రజలను బ్లాక్ మెయిల్ చేసిన రాజకీయ నేత కౌశిక్ రెడ్డి.
తనను గెలిపించకపోతే ఎన్నికల రోజు ఆత్మహత్య చేసుకుంటానని వీడియో రిలీజ్ చేశారు. అప్పట్నుంచి ఆయన కామెడీ స్టార్ గా మిగిలిపోయారు. పీఏసీఎ చైర్మన్ వివాదంలో ఆయన పై దాడి జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తల చేతిలో తన్నులు తిని హస్య సన్నివేశాన్ని పండించారు. రేవంత్ రెడ్డి వీడియోలు తన వద్ద ఉన్నాయని కౌశిక్ రెడ్డి అంటున్నారే గానీ వాటిని బయటపెట్టకపోవడం బట్టి ఆయన ఉద్దేశ్యం ఏమిటో ప్రజలు ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/padi-kaushik-reddy-over-action--this-former-cricketer-turned-actor-from-politics-39-188181.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.