డిజిటల్ జైలును బద్దలు కొట్టిన ఓపెన్ ఏఐ: హగ్గింగ్ ఫేస్‌పై ఏఐ సైబర్ దాడి!

Publish Date:Jul 25, 2026

Advertisement

సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసే భయంకరమైన సన్నివేశాలు ఇప్పుడు మన కళ్లముందే నిజమవుతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ (OpenAI) తయారు చేసిన ఒక అత్యంత సామర్థ్యమున్న ఏఐ మోడల్ తన నియంత్రణ సరిహద్దులను (Sandbox) దాటుకుని బయటకు వచ్చి సైబర్ దాడికి తెగబడటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక నిపుణులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఓపెన్ ఏఐ సంస్థ జిపిటి-5.6 సోల్ (GPT-5.6 Sol) మరియు అంతకంటే శక్తివంతమైన ప్రీ-రిలీజ్ ఏఐ మోడళ్ల సెక్యూరిటీ సామర్థ్యాలను పరీక్షించడానికి 'ఎక్స్‌ప్లాయిట్ జిమ్' (ExploitGym) అనే బెంచ్‌మార్క్ టెస్ట్ నిర్వహించింది. ఈ పరీక్షలో ఏఐ వ్యవస్థలు సాఫ్ట్‌వేర్ లోపాలను ఎలా గుర్తిస్తాయో చూడటానికి వాటికి ఉన్న రక్షణ నిబంధనలను (Guardrails) తాత్కాలికంగా తొలగించి, ఇంటర్నెట్ సదుపాయం లేని ఒక అత్యంత సురక్షితమైన డిజిటల్ జైలు వంటి 'సాండ్‌బాక్స్' వాతావరణంలో బంధించారు.

అయితే అక్కడ అందరూ ఊహించని ఒక విపరీతమైన సంఘటన జరిగింది. అత్యంత చాకచక్యంగా ప్రవర్తించిన ఆ ఏఐ మోడల్, ఆన్ లైన్ రక్షణ పరీక్షను గెలవడం కోసం తానున్న డిజిటల్ జైలునుండి తప్పించుకునే మార్గాన్ని కనిపెట్టింది. ఇంటర్నెట్ ప్రాప్తి సాధించి, సుప్రసిద్ధ మెషిన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ అయిన 'హగ్గింగ్ ఫేస్' (Hugging Face) సర్వర్లపై స్వతంత్రంగా సైబర్ దాడికి తెగబడింది. ఈ దాడిలో ఏఐ ఏమాత్రం మానవ ప్రమేయం లేకుండా సరికొత్త వ్యూహాలను అమలు చేసింది. దొంగిలించిన లాగిన్ వివరాలు (Stolen Credentials) మరియు ఇప్పటివరకు ఎవరూ గుర్తించని జీరో-డే లోపాలను (Zero-day vulnerabilities) ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ, వేలాది స్వతంత్ర చర్యలతో పబ్లిక్ సర్వర్ల ద్వారా కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని హగ్గింగ్ ఫేస్ సిస్టమ్‌లోకి ప్రవేశించింది.

ఈ అనూహ్య పరిణామాన్ని చూసి హగ్గింగ్ ఫేస్ సీఈఓ క్లెమెంట్ డెలాంగ్యూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ఏఐ మోడల్ స్వయంచాలకంగా ఇంతటి సమగ్ర దాడికి ఒడిగట్టడం మైండ్ బ్లావింగ్ అని ప్రకటించారు. సైబర్ నిపుణులు మరియు జంగో (Django) కో-క్రియేటర్ సైమన్ విల్లిసన్ మాట్లాడుతూ ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ నవలల్లో చూసే సంఘటన నిజంగా జరగడమేనని స్పష్టం చేశారు.

science fiction happened openai model hacks server,gpt 5 sol escapes sandbox cyberattack
 

By
en-us Political News

  
Before choosing a group health insurance plan, you should consider the eligibility criteria and check whether the insurer has a smooth claim processing. Let us explore what are the group health insurance benefits in more detail.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వనరులు, లావాదేవీలపై ఐటీ   ప్రత్యేక దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా పెద్ద మొత్తంలో జరిగిన నగదు లావాదేవీలకు సరైన లెక్కలు లేకపోవడం, పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉండటమే ఈ దాడులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అలాంటి అరుదైన, విలక్షణమైన వన్యప్రాణుల జాబితాలో ఇండోనేషియాలోని సులవేసి ద్వీపానికి చెందిన  మ్యాక్రోసెఫాలోన్ మెలియో పక్షి  జాతి ఒకటి. సాధారణ పక్షుల వలె చెట్లపై గూళ్లు కట్టుకుని, గుడ్లను పొదిగే సంప్రదాయ పద్ధతికి ఇది పూర్తి భిన్నం. ఈ పక్షి జీవన శైలి  అడవి కోడిని పోలి ఉంటుంది.
ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వాతావరణ రాడార్లు అందుబాటులోకి రాకముందే..   పూర్వీకులు చెట్లను, జంతువులను, కీటకాలను గమనించి రానున్న విపత్తులను అంచనా వేశారు. ఆ అంచనాలు దాదాపు కచ్చితంగా ఉండేవి. పర్యావరణంలో వచ్చే చిన్న చిన్న మార్పులను,  భూగర్భంలో జరిగే అలజడిని మనుషుల కంటే ముందుగా వృక్షజాలం పశుపక్ష్యాదులు పసిగడతాయని శాస్త్రీయ అధ్యయనాలుచెబుతున్నాయి.
ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు జీవిత విశేషాలు, ఆయన అవలంబించిన వ్యాపార విధానాలు మరియు ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డి.ఎన్. ప్రసాద్  తెలుగువన్ ది జర్నలిస్ట్ మూడో  ఎపిసోడ్‌లో  తెలుగువన్ ఎండీ  రవిశంకర్ తో పంచుకున్నారు.  
ఉపాధి కోసం వలస వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు కుంటకు వెళ్లిన ముగ్గురు నీటిలో మునిగి దుర్మరణం చెందారు. ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
న్యూయార్క్ సమీపంలోని ఆల్బనీ ప్రాంతంలో  నివాసముంటున్న ఆమె అమెరికా కాల మానం ప్రకారం గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఖమ్మంలో ఉన్న తన తండ్రి నల్లమల్ల ఆనంద్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగానే  గుండె నొప్పితో కుప్పకూలిపోయారు.
జామో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలంపూర్ గ్రామంలో ఉన్న ఒక బాణసంచా తయారీ యూనిట్లో  భారీ పేలుడు సంభవించింది.   శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు  
తెలంగాణలో కూడా వచ్చేమూడు రోజులూ పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు కురిసే సమయాల్లో పిడుగుపాటుకు అవకాశాలున్నందున విద్యుత్ స్తంభాలు, చెట్లకింద నిలబడవద్దని హెచ్చరించింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరిట రూ.29.27 కోట్ల విలువైన 12,530 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైన భారీ కుంభకోణం వివరాలు.
కృష్ణా జిల్లాలో దీపావళి టపాసులు కాల్చే సమయంలో కెమికల్ డ్రమ్ పేలి పదేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర సంఘటన పూర్తి వివరాలు. పిల్లల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
హైదరాబాద్ మల్కాజిగిరి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ గల్లంతైన రాము, లక్ష్మి దంపతుల అదృశ్యం వెనుక మిస్టరీ ఏంటి? కూతురితో చివరి కాల్, ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిన వైనంపై పూర్తి వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.