లక్ష గొంతుల హనుమాన్ చాలీసా.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్

Publish Date:Aug 16, 2020

Advertisement

హనుమాన్ లక్ష గళ పారాయణ భారతస్వతంత్ర దినోత్సవం నాడు ఇంటర్నెట్ లో జూం ద్వారా జరిగింది. శ్రీ కూచిభొట్ల ఆనంద్ గారి సారధ్యం లో సిలికానాంధ్ర చేసిన మరో మహా సంకల్పం ఈ కార్యక్రమం. 50 పైగా దేశాలనుండి భారతీయులు పాల్గొన్నారు. పిన్న పెద్దా వయోభేదం లేకుండా గొంతు కలిపి ఒక అద్భుతం సృష్టించారు. ఇంతమంది ఒకేసారి హనుమాన్ చాలీసా అంతర్జాలం లో పారాయణం చేయడం ఒక సాంకేతిక విశేషం కూడా! ఈ విశేషమైన కార్యక్రమాన్ని రూపొందించినది సిలికానాంధ్ర! కూచిపూడి నృత్యం నించి, అన్నమయ్యలక్ష గళార్చన నించి నేటి దాక మొత్తం 10 గిన్నిస్బుక్ వరల్డ్ రికార్డ్లు సాధించిన సిలికానాంధ్ర కోవిడ్ ని ఎదుర్కునే మనో బలానికి, సామాజిక, స్థైర్యానికి, శాంతికి  ఇటువంటి మనో ఉద్యమాన్ని ప్రారంభించారు. 

 

ఈ ప్రపంచప్రజాదరణ పొందిన కార్యక్రమంలో అనేక దేశాల వారు ముక్త కంఠంతో హనుమంతుణ్ణి కీర్తించగా దీంట్లో రాష్ట్ర, కేంద్ర మంత్రులు, వైద్యులు, న్యాయవాదులు, కళాకారులుఇంకా ఎన్నో రంగాలవారు భాషాభేదం లేకుండా పాల్గొని విజయవంతం చేసారు. జల శక్తి శాఖా మంత్రిగజేంద్ర సింగ్ షెఖావత్ ప్రసంగిస్తూ, త్వరలో ప్రపంచం కోవిడ్ బారినుండి బయటపడాలని అన్నారు. హనుమత్ శక్తి అందరికీ ఆశీస్సులిస్తుందని అనడమే కాక వారు కూడ చాలీసాపారాయణలో పాల్గొన్నారు. వారణాసి నించి ప్రసిద్ధ సంకట మోచన హనుమాన్ దేవాలయ ప్రధాన అర్చకులు, ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఆధ్యాత్మిక వేత్తలు, సాధు సత్పురుషులు కూడా అందరితో పాల్గొనిదీనికి శోభ తెచ్చారు.  

 

ఈ కార్యక్రమానికి అనేకమంది కార్యకర్తలు, భక్తులునిరంతరం నెలల తరబడి పని చేసారు. కోవిడ్ లో లాక్ డౌన్ లొ ఉన్న అనేకమంది భక్తులకు ఇదిఒక చేతనా స్ఫూర్తి గా దీన్ని రూపొందించారు. సిలికానాంధ్ర ఆధ్వర్యంలో దిలీప్ కొండిపర్తి, రాజుచమర్తి,మధు బాబు ప్రఖ్య, ప్రియ తనుగుల, సాయి కందుల, జ్యోతిచింతలపూడి,స్నేహ వేదుల, మాదబూషి రాజా, గిరిజ లొల్ల, ప్రవీణ్గుబ్బల తదితరులు కీలక పాత్ర వహించారు. మురహరి దేవబత్తిని ఈ అనితర సాధ్యమైన టెక్నాలజిరూపొందిచారు. అశోక్ బడ్డి ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించగా అనేకమంది  ఒక తపస్సు గా సహాయం చేశారు. శ్రీ ఆనంద్ కూచిభొట్లనిజ జీవన సేవ విశిష్టతను చెపుతూ ఈ కార్యక్రమం దైవ శక్తి, మానవ శక్తికలిపిన మహ చైతన్యం గా, సిలికానాంధ్ర తమ సేవలు సంజీవిని హాస్పిటల్ ద్వారా కూచిపూడి, ఇంకాపక్కనున్న అనేక గ్రామాలలో కోవిడ్ బాధితులకు, సేవలకు వినియోగిస్తున్నాం అన్నారు. అందరిని అట్టి సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు. 

ప్రముఖ వైద్యులు, దాతశ్రీ లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారు మాట్లాడుతూ మంచి పనుల వెనక తామెప్పుడూ ఉన్నాం అని, హనుమత్శక్తి కోసం,రామ మందిరం వృద్ధి కోసం తమలాంటి వారు ఎన్నో చేయాలనుకుంటున్నారని చెప్పారు. బలం, బుద్ధి, పరాక్రమంమూర్తీభవించిన శక్తి హనుమాన్ శక్తి, అది మన అందరికి కావాలి అని భారత జలశక్తిశాఖా మంత్రి శ్రీ  గజేంద్ర సింగ్ షెఖావత్ గారు అన్నారు. శ్రీ గంగపురం కిషన్ రెడ్డి గారు, మినిస్టర్ ఆఫ్స్టేట్ ఫర్ హోం మాట్లాడుతూ సిలికానాంధ్ర భారత సనాతన ధర్మాన్ని భావి తరాలకి అందిస్తోందిఅని అన్నారు. 

 

ప్రయాగ్ నుండి స్వామి ఆనంద్ గిరి మాట్లాడుతూ ఇది సిలికానాంధ్ర అందరి తరపునాకరోనా మహమ్మారి నుంచి రక్షించేందుకు చేసిన అద్భుత అనుష్ఠానం అన్నారు. శ్రీ మిశ్రా, మహంత్, సంకటమోచన హనుమాన్  దేవాలయం కాశి నుండి మాట్లాడుతూసంకటములను నివారించే స్వామి హనుమంతుడే అని సాక్షాత్ తులసిదాస్ చెప్పారు అన్నారు. సిలికానాంధ్రవిశ్వ సంకల్పాన్ని ఆశీర్వదించారు. మధు ప్రఖ్యా మాట్లాడుతూ రామ నామం రాళ్ళనైన తేలికచెస్తుంది,వారధి గా మారుస్తుంది, రామ నామాన్ని మంచి మనసుతో మన సమస్యలమీద రాద్దాం,కరోనాని జయిద్దాం అన్నారు. 

 

కార్యక్రమానికి ప్రియ తనుగుల సమన్వయ కర్తగా ఉండి మహాకార్యక్రమానికి దివ్య శోభను చేకూర్చారు. ఏ. వీ. యస్. రావ్ గారు, జాయింట్డైరక్టర్ ఆఫ్ రైల్వేస్, సుప్రీం కోర్ట్ సీనియర్ అడ్వోకేట్ శ్రీమోహన్ పరాశరన్ గారు ఇందులో పాల్గొన్నారు. ఆయన తండ్రి గారు శ్రీ కేశవ పరాశరన్ గారు రామజన్మభూమి తీసుకొచి విజయం సాధించిన న్యాయవాది. ఇలా ఎందరో ప్రముఖులతో శక్తివంతం గా ఆబాలగోపాలం తో లక్ష మంది పైగా కలిసిన ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లలోకి మరో సారి ఎక్కి భారతీయులంతా గర్వపడేలా చేసింది.

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.