Publish Date:Jul 12, 2024
గ్రేటర్ హైద్రాబాద్ లో కాల్పుల కలకలం మరోసారి చర్చకు వచ్చింది. ఇటీవల రాచకొండ పోలీసులు నల్గొండ హైవేపై పార్థీ గ్యాంగ్ పై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. నాంపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ ముఠా గూర్చి పోలీసులకు సమాచారం అందింది. వారిని అదుపులో తీసుకునే క్రమంలో అక్కడికి వెళ్లిన పోలీసులపై వాళ్లు రాళ్లు, కత్తులతో దాడులు చేశారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ గ్యాంగ్ నుంచి పోలీసులు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కొంత కాలంగా హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్ చేసే ముఠాలు ఎక్కువగా తిరుగుతున్నాయి. దొంగల మీద కాల్పులు జరపడం అరుదుగా జరుగుతుంది. కానీ ఇటీవల హైదరాబాద్ లో దొంగలపై కాల్పులు జరపడం ఆనవాయితీగా మారింది. ఉత్తర భారత దేశానికి చెందిన పార్థీ గ్యాంగ్ నగరంలో చైన్ స్నాచింగ్ ముఠా దొంగతనాలకు పాల్పడుతుంది. గతంలో చిలకలగూడలో దొంగతనాలు చేస్తున్న ముఠాపై కూడా పోలీసులు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/one-is-in-critical-condition-in-hyderabad-firing-25-180605.html
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.