Publish Date:Jul 12, 2024
తప్పతాగి డ్రైవింగ్ చేస్తున్న వారిపై తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. మద్యం తాగి వాహనాలను నడుపుతున్న మందుబాబులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ డ్రంకెన్ డ్రైవ్ లు నిర్వహిస్తూ... మందుబాబులకు మత్తు దించుతున్నారు. తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జూలై 1 నుంచి 10 వరకు డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ 55 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది.
సిటీ ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ 10 రోజుల్లో 1,614 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. 992 కేసుల్లో ఛార్జ్ షీట్లు నమోదు చేసి, కోర్టులో సమర్పించామని... 55 మందికి కోర్టు జైలు శిక్ష విధించిందని చెప్పారు. ఒక రోజు నుంచి 15 రోజుల వరకు జైలు శిక్ష విధించినట్టు తెలిపారు. శిక్ష పడిన వారిలో 8 మంది డ్రైవింగ్ లైసెన్స్ లను 2 నుంచి 6 నెలల పాటు రద్దు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. మిగిలిన వారి నుంచి ఫైన్ల రూపంలో రూ. 21.36 లక్షలు జమ అయిందని వెల్లడించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/55-people-were-jailed-for-driving-erratically-25-180610.html
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.