ఒబామా క్యూబా పర్యటన విఫలం!

Publish Date:Mar 24, 2016

Advertisement

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుని క్యూబా పర్యటన ముగిసింది. కానీ ఈ పర్యటన వల్ల ఇరు దేశాల మధ్యా సంబంధాలు మెరుగుపడ్డాయా అంటే మొహమొహాలు చూసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒబామా క్యూబాలో అడుగుపెట్టిన క్షణం నుంచీ ఈ పర్యటన ఏమంత అద్భుతాలు సాధించలేదని తేలిపోయింది...

అమెరికా, క్యూబాల మధ్య వైరం ఈనాటిది కాదు. ఈ రెండు దేశాల మధ్యా నిండా 90 మైళ్ల దూరం కూడా లేకపోవచ్చు. కానీ ఒక అమెరికా అధ్యక్షుడు క్యూబాలో అడుగుపెట్టడానికి దాదాపు 90 ఏళ్లు పట్టింది. 1959లో ఫల్గెన్సియో బటిస్టా అనే నియంతని గద్దె దింపుతూ, క్యూబా నేతృత్వంలోని విప్లవకారులు ఆ దేశంలో తమ అధికారాన్ని నెలకొల్పారు. అప్పటి నుంచీ అమెరికా, క్యూబా దేశాల మధ్య సంబంధాలు నిదానంగా దెబ్బతింటూ వచ్చాయి. అమెరికన్లకి చెందిన వ్యాపారసంస్థలను క్యూబా జాతీయం చేయడం, క్యూబాకు రష్యా వంత పాడటం వంటి ఘట్టాలతో, ఇరుదేశాల మధ్య సంబంధాలు కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయి.

అమెరికా అంటేనే మండిపడిపోయే ఫిడేల్‌ క్యాస్ట్రో అధికారం నుంచి తప్పుకోవడంతో, క్యూబాతో దౌత్యం నెరిపే అవకాశం ఉందని అమెరికా సంబరపడిపోయింది. పక్కలో బల్లెంలా ఉన్న క్యూబాను ఎప్పటికైనా మంచిచేసుకోవడం అవసరమని ఆ దేశానికి తెలుసు. దీనివల్ల సామరస్యమైన వాతావరణమే కాదు, వ్యాపార లావాదేవీలను కూడా నెలకొల్పవచ్చు. క్యూబాలో తాజాగా చమురు క్షేత్రాలు కూడా బయటపడటం కూడా అమెరికా ‘సదుద్దేశాలకు’ కారణం అయి ఉంటాయి.
క్యూబాతో సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా, అమెరికా ఒకో చర్యా చేపట్టడం మొదలుపెట్టింది. సుదీర్ఘకాలంగా మూసుకున్న రాయబార కార్యాలయాలు తెరుచుకున్నాయి. క్యూబాను తీవ్రవాద దేశాల జాబితా నుంచి తొలగించింది. ఆఖరికి ఆ దేశ అధ్యక్షుడు క్యూబాలో పర్యటించేందుకు సిద్ధపడ్డారు. ‘నేను ఇప్పుడే ఈ నేల మీద అడుగుపెట్టాను, క్యూబా ప్రజలను కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నాను’ అంటూ క్యూబా నేలను తాకిన ఒబామా ట్వీట్‌ చేశారు. కానీ ఆయనకు స్వాగతం చెప్పేందుకు అక్కడి అధ్యక్షులవారు సిద్ధంగా లేరు. తమ అధ్యక్షుడు ఒక దేశానికి వెళ్తే, అక్కడి దేశాధినేత

ఆయనను స్వాగతించేందుకు లేకపోవడం, బహుశా అమెరికా చరిత్రలోనే చాలా అరుదుగా జరిగి ఉంటుంది.
సాధారణంగా ఎవరన్నా అతిథులు తమ దేశానికి వస్తే, క్యూబా వాసులు వారికి ఘన స్వాగతం పలుకుతారు. కానీ క్యూబా వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ఇక ఒబామా దురదృష్టమో ఏమీగానీ, ఆయన క్యూబాలో పాల్గొన్న బేస్‌బాల్‌ ఆట కూడా వివాదాస్పదం అయ్యింది. బెల్టియంలో ఉగ్రవాదుల దాడి జరుగుతున్న సమయంలో, ఒబామా ఓ బేస్‌బాల్‌ ఆటని ఆస్వాదిస్తూ గడపడంతో అమెరికన్‌ ప్రజలు విస్తుపోయారు. యూరప్‌ ఖండంలోనే అతి కీలకమైన బెల్జియం మీద ఉగ్రవాదులు దాడి చేయడం అంటే... ISIS మీద అమెరికా జరుపుతున్న పోరు విఫలం అయ్యిందని చెప్పడమే. ఇలాంటప్పుడు ఒబామా ఓ శత్రుదేశాన్ని మంచి చేసుకునేందుకు, బేస్‌బాల్ ఆటలో మునిగిపోవడం ఏంటని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి.

ఇక ఒబామా, క్యూబా అధ్యక్షుడు రౌల్‌క్యాస్ట్రోలు సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశం కూడా రసాభాసగా ముగిసింది. క్యూబాలో మానవహక్కులను మెరుగుపర్చాలంటూ ఒబామా సూచించగా, ప్రపంచంలో ఏ దేశమూ మానవహక్కులను అమలుచేయడం లేదంటూ రౌల్‌ ఘాటుగా స్పందించారు. క్యూబా ఆధీనంలో ఉన్న రాజకీయ ఖైదీల విషయంలో కూడా రౌల్‌ ఇంతే పదునుగా బదులిచ్చారు. రాజకీయ ఖైదీలు ఎవ్వరూ తమ ఆధీనంలో లేరని తేల్చిపారేశారు. ఇక ఒబామా వైపు నుంచి కూడా క్యూబాతో ఉన్న వివాదాల గురించి ఎలాంటి స్పష్టమైన సంకేతాలూ వెలువడలేదు. క్యూబాకి చెందిన గ్వాంటనామో ద్వీపాన్ని తిరిగి ఇచ్చే విషయమై ఆయన మాట దాటవేశారు. ఈ సమావేశం ఎంత నిస్సారంగా ముగిసిందంటే, రౌల్‌తో కలిసి విజయ సంకేతాన్ని చూపేందుకు కూడా ఒబామా సుముఖత వ్యక్తం చేయలేదు.

ఇటు అమెరికా వాసులలో కూడా క్యూబా పట్ల అంత సదభిప్రాయం లేదు. కమ్యూనిస్టు సిద్ధాంతాలను పాటిస్తూ, నియంతృత్వ వ్యవస్థలో ఉన్న క్యూబా నుంచి ఎప్పటికీ స్నేహాన్ని ఆశించలేమన్నది వారి భావన. క్యూబా మీద పై చేయి సాధించలేకపోయిన అమెరికా, చివరికి ఆ దేశ నియంతతో స్నేహానికి బయల్దేరడమేంటని వారు మండిపడుతున్నారు. అమెరికాకు కొరకరాని కొయ్యగా మిగిలిపోయిన ఫిడేల్‌ క్యాస్ట్రో వ్యక్తిత్వాన్నీ, ఆయన పాలననూ ఇప్పటికీ అమెరికన్ ప్రజలు మర్చిపోలేదు. మరి ఒబామా క్యూబా పర్యటన విజయవంతం అయ్యిందని భావించగలమా!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.