ఈ రంగుల పండుగ మన సొంతం!

Publish Date:Mar 23, 2016

Advertisement

 

మార్చి 22, 23, 24.... వీటిలో హోళీ ఏ రోజు అన్న సందిగ్ధం తీరిపోయింది. దేశవ్యాప్తంగా నేడు హోళీని జరుపుకొనేందుకు సిద్ధపడిపోయారు. ఈపాటికే జనం పాత బట్టలు బయటకు తీసి, గులాల్ పాట్లాలతో రంగుల యుద్ధంలో మునిగిపోయి ఉంటారు. ఈ హడావుడిలో హోళీ భారతీయులకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ అన్న విషయం చాలామంది పట్టించుకోరు.

 

హోళీ అంటే ప్రపంచాన్ని రంగులకలగా మార్చివేసే ఓ పండుగ. కులాలుగా, మతాలుగా... ఆఖరికి వర్ణాలుగా చీలిపోయిన భారతీయ సమాజంలో, ఈ హోళీని మించిన సమైక్య గీతం మరేముంటుంది.  ఏ  బేధమూ లేకుండా... తమలోని ప్రాణం ఒక్కటే అనేంతగా సంబరాలు జరుపుకొనే ఉత్సవం మరేముంటుంది. హోళిక తగలబడిపోయిందనో, రాధాకృష్ణులు రంగులాడుకున్నారనో, కామదహనం జరిగిందనో... కారణాలు ఏవైనాగానీ... రంగుల ఉత్సవాన్ని చేసుకోవడానికి అవన్నీ ఓ ప్రేరణ కలిగించేవే! బహుశా అందుకే హోళీవంటి పండుగ ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. అందులోనూ ధార్మికమైన కారణం ఉన్న పండుగలు అసలు కనిపించవు! కావాలంటే మీరే చూడండి...

 

- స్పెయిన్‌లోని వలన్‌సియాన్ నగరంలో ఏటా టమోటాల పండుగ చేసుకుంటారు. ఆగస్టు చివరి బుధవారం నాడు జరుపుకొనే ఈ పండుగలో ఒకరి మీద ఒకరు టమోటాలు విసురుకుని సంబరపడిపోతారు. 1945 నుంచి మొదలైన ఈ పండుగ రాన్రానూ ప్రచారాన్ని అందుకుంటోంది.
- స్పెయిన్‌లోనే ‘హారో వైన్‌ ఫెస్టివల్‌’ పేరుతో, ఒకరి మీద ఒకరు, ద్రాక్షసారాయిని ఒంపుకునే ఉత్సవం జరుగుతుంది. ఏటా జూన్‌లో జరిగే ఈ పండుగ వెనుక 700 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు.
- ఇటలీలోని ఇవియా పట్టణంలో నారింజలను విసురుకునే పండుగ ఫిబ్రవరిలో జరుగుతుంది. 13వ శతాబ్దంలో జరిగిన ఓ ప్రజా విప్లవాన్ని గుర్తుచేసుకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు.

 

పైన పేర్కొన్నవన్నీ కూడా స్థానికంగా జరిగే ఉత్సవాలు. ఇలాంటి పండుగలు అక్కడక్కడా అడపాదడపా కనిపించేవే. కానీ ఇవన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలో, సవాలక్ష నిబంధనలతో జరిగేవి. పర్యాటకులను ఆకర్షించడం కోసమే ప్రభుత్వం ఈ ఉత్సవాలను ప్రోత్సహిస్తూ ఉంటుంది. కానీ హోళీ పంథానే వేరు. అందుకే ఇప్పుడు హోళీని వేరే దేశాలవాళ్లు కూడా ఆచరించడం మొదలుపెట్టారు. ‘ఫెస్టివల్ ఆఫ్‌ కలర్స్‌’ పేరట ఒక బృందం దీన్ని ఖండాంతరాలుగా విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ బృందం ఆధ్వర్యంలో నాలుగు ఖండాల్లో హోళీని ఓ ఉత్సవంలా జరుపుకొంటున్నారు. అంటే హోళీలాంటి పండుగ ఏదుందా అని వెతకడం మానేసి, ప్రపంచమే ఇప్పడు హోళీని ఆచరిస్తోందన్నమాట. ఈ పండుగలో ఉన్న ఆకర్షణ గురించి ఇంతకంటే ఏం చెప్పగలం.

 

ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హోళీని అంత విస్తృతంగా జరుపుకొనేవారు కాదు. ఇదేదో ఉత్తరాది పండుగ అన్న భావం ఇక్కడి ప్రజలకు ఉండేది. అసలు హోళీని కాముడి పున్నమిగానే తెలుగునాట పిలుస్తారు. శివుడు, మన్మథుని భస్మం చేసిన రోజు ఇది అన్నది ప్రజల నమ్మకం. ఆ నమ్మకానికి అనుగుణంగానే భోగిమంటల్లాగా మంటల వేసే సంప్రదాయం ఒకటి ఉంది. కానీ ఇప్పుడు హోళీని తెలుగు పండుగలలో ముఖ్యమైన పండుగా భావించడం మొదలైపోయింది. బహుశా ఇదే మన దేశ విశిష్టత! ఒకే పండుగను దేశంలోని లక్షలాది కిలోమీటర్ల కొద్దీ ఎలాంటి అరమరికలూ లేకుండా చేసుకోగలం. ఈ సంప్రదాయం మనది అనుకున్నప్పుడు దాన్ని వేల సంవత్సరాలుగా ఆచరించగలం!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.