అన్న నందమూరి తారక రామారావు ఎప్పుడో 1950 దశకంలో రాసిన లేఖలను ప్రస్తుతం బెజవాడ పుస్తక ప్రదర్శనలో చిన్నా, పెద్దలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అప్పట్లో చెన్నైలో ఉన్న తారకరాముడు తెలుగు భాషను ప్రాణంగా భావించేవారు. తెలుగాభాషను ఎన్టీఆర్ ఎంత గౌరవీంచేవారనడానికి ప్రత్యక్ష నిదర్శంగా నిలుస్తున్నాయి 1950ల్లో ఆయన రాసిన లేఖలు. కృష్ణ జిల్లా గన్నవరం మండలం పురుషోత్తపట్నంలోని ఆంధ్ర గ్రంధాలయం ప్రచారం కోసం పనిచేస్తున్న కొందరు 1955లో ఎన్టీఆర్‌ను కలిశారు.
వారి సేవల గురించి తెలుసుకుని, వారిని అభినందిస్తూ ఎన్టీఆర్ స్వదస్తూరితో లేఖ రాశారు. తర్వాత 1957 సెప్టెంబర 16న గ్రంథాల సేవలను మెచ్చుకుంటూ రూ.100 చెక్కు ఇస్తున్నానని మద్రాసు నుంచి మరో లేఖ పంపించారు. ఎన్టీఆర్ సంతకంతో ఉన్న ఆ లేఖలను ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న పుస్తక మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయం ఏర్పాటు చేసిన స్టాల్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఆ యుగపురుషుడి లేఖలను అందరూ ఆసక్తిగా తిలకిస్తూ.. చిత్ర పరిశ్రమను, తెలుగు భాషను గుర్తుచేసుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ntrs-letter-36-212099.html
విశాఖపట్నం స్టీల్ ప్టాంట్ ప్రైవేటీకరణ జరగదని మంత్రి నారా లోకేశ్ పునరుద్ఘాటించారు.
తెలంగాణలో 20 మంది ఐపీఎస్‌లు బదిలీలు అయ్యారు.
హైదరాబాద్‌లో జరుగుతున్న ఆహార కల్తీపై కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు దిల్‍సుఖ్‍నగర్‌లో రోడ్డెక్కారు.
హైదరాబాద్ నగరంలోని సిలికాన్ సిటీగా పేరొందిన గచ్చిబౌలి ప్రాంతం మరోసారి మత్తు మాయాజాలానికి వేదికగా మారింది.
రెడ్డెప్పగారి మాధవీ రెడ్డి.. కడప ఎమ్మెల్యే గా గెలిచిన రోజు నుంచి జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుఉన్నారు
నికోలస్ మదురో పాలనలో ఆ దేశానికి చెందిన విలువైన బంగారు నిల్వలు భారీ ఎత్తున విదేశాలకు తరలిపోయినట్లు తాజా కస్టమ్స్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఎన్నికల వేళ మైనారిటీల రక్షణ బాధ్యతను బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ సర్కార్ గాలికొదిలేసిందా?
హైదరాబాద్‌లో బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న మాఫియా వ్యవహారం వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేపుతుంది.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది.
అసభ్యకరమైన కంటెంట్‌ను సృష్టించి ప్రచారం చేస్తున్న యూట్యూబర్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
ప్రియురాలి మరణాన్ని తట్టు కోలేక యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్‌ను డీజీజీఐ అధికారులు అరెస్టు చేశారు.