ఇప్పుడిక వైసీపీలో కొత్త రచ్చ? జగన్ కు చుక్కలు కనిపించడం ఖాయం!

Publish Date:Feb 8, 2025

Advertisement

విజయసాయి రాజకీయ సన్యాసం ప్రకటించి రెండు వారాలు గడిచిపోయింది. విజయసాయి నిష్క్రమణపై వైసీపీ మౌనం వహించింది. ఆ మౌనంలో భయమే ఎక్కువ కనిపించింది. విజయసాయి రాజీనామాపై వైసీపీకి మాత్రమే చేతనైన తీరులో విమర్శలు రాకపోవడానికి కారణం కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్న భయమేనని పరిశీలకులు సైతం విశ్లేషించారు. అయితే విజయసాయి రాజకీయ సన్యాసం, వైసీపీకి రాజీనామాపై ఆ పార్టీ నేతల మౌనం.. రెండు రోజుల కిందట బద్దలైంది. విజయసాయి వ్యక్తత్వం, విశ్వసనీయత లేని వ్యక్తి అంటూ జగన్ మీడియా సమావేశంలో చెప్పిన తరువాత ఇక వైసీపీ నేతలు ఒక్కరొక్కరుగా విజయసాయిపై విమర్శలతో ముందుకు వస్తున్నారు. అంత కంటే ముందు షర్మిల విజయసాయికి మద్దతుగా జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారనుకోండి అది వేరే సంగతి. ప్రస్తుతానికి వస్తే షర్మిల విమర్శలపై నోరు విప్పే ధైర్యం వైసీపీలో జగన్ సహా ఎవరికీ లేదన్నది తెలిసిందే. 

ఇక మిగిలింది విజయసాయి. విజయసాయి జగన్ క్యారెక్టర్ కామెంట్స్ కు ఘాటుగా రిప్లై ఇచ్చిన తరువాత వైసీపీ నుంచి తొలి సారిగా కేతిరెడ్డి  వెంకటరామిరెడ్డి నోరు విప్పారు. ఒక సామాన్య ఆడిటర్.. ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఎదగడానికి, పార్టీలో ఉన్నత పదవులు పొందడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తికి క్యారెక్టర్ ఉన్నట్లా, లేక ఆ పదవులన్నీ అనుభవించి, పార్టీ కష్టంలో ఉన్నప్పుడు వదిలేసి తన దారి తాను చూసుకున్న వ్యక్తికి క్యారెక్టర్, విశ్వసనీయతా ఉన్నట్లా అని ప్రశ్నించారు. పార్టీ వీడిన తరువాత పార్టీ అధినేతపైనా, పార్టీపైనా చెడుగా మాట్లాడటమే అతని స్వభావాన్ని తెలియజేస్తున్నదని నేరుగా పేరు ప్రస్తావించకుండానే విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు కేతిరెడ్డి. వైఎస్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయాలన్న మీ ప్రయత్నం వెనుక ఎవరున్నారో తెలుసు అంటూ ఆయన చేసిన ట్వీట్ రానున్న రోజులలో మరింత మంది వైసీపీయులు విజయసాయిపై నోరు పారేసుకునేందుకు రూట్ క్లియర్ చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 అదే జరిగి వైసీపీ వర్సెస్ విజయసాయిరెడ్డిగా విమర్శల పర్వం కొనసాగితే.. జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 అయిన విజయసాయిరెడ్డి వెల్లడించే విషయాలు వైసీపీ కొంప ముంచడమే కాకుండా, జగన్ కు కూడా కంటిమీద కునుకులేకుండా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. వైసీపీలో ఈ కొత్త రచ్చ ఎంత తొందరగా మొదలైతే అంత తొందరగా జగన్ ఆస్తుల కేసు విచారణ జోరందుకుంటుందని పరిశీలకులు అంటున్నారు.   విజయసాయిరెడ్డిపై వైసీపీ నుంచి ఎంత తీవ్రంగా విమర్శలు వస్తే జగన్ రాజకీయ, న్యాయ వ్యవహారాలపై అంత తీవ్రంగా ప్రతికూల ప్రభావం ఉండటం ఖాయమంటున్నారు. ఈ పరిస్థితిని జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే.  

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.