నాగబాబు రాజకీయం .. వ్యూహమా? అయోమయమా?

Publish Date:Mar 16, 2026

Advertisement

మెగా బ్రదర్, జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన కీలక నేత రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? లేక అయోమయంలో ఉన్నారా అన్న అనుమానాలు కలగకమానవు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలలో ఇప్పటి వరకూ విజయం సాధించింది లేదు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారనుకోండి అది వేరే సంగతి. ఆయన రాజకీయంగా వేస్తున్న అడుగులపై మాత్రం రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

2019 ఎన్నికలలో ఆయన తొలి సారిగా నరసాపురం స్థానం నుంచి పోటీ చేశారు. అయితే అక్కడ ఆయన మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఆ ఎన్నికలలో జనసేన కూడా ఏమంత ప్రభావం చూపకపోవడంతో నాగబాబు పరాజయం పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ 2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది.  ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు. జనసేన అధినేత సోదరుడు, ఆ పార్టీలో కీలక నేత అయి ఉండి కూడా ఆయనకు పోటీకి అవకాశం దక్కకపోవడం అప్పట్లో రాజకీయవర్గాలను విస్మయానికి గురి చేసింది. అది పక్కన పెడితే.. 2025 ఏప్రిల్ లో నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా నాగబాబును కేబినెట్ లో తీసుకుంటామని ప్రకటించారు.

అయినా ఎమ్మెల్సీ అయ్య దాదాపు ఏడాది కావస్తున్నా నాగబాబుకు కేబినెట్ బెర్త్ దక్కలేదు.  ఇక ఇప్పుడు ఆయనను రాజ్యసభకు పంపే యోచనలో జనసేనాని ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అది కార్యరూపం దాలిస్తే జనసేన నుంచి రాజ్యసభకు వెళ్లే తొలి నేతగా నాగబాబు నిలుస్తారు. ఇక ఆయనకు కేంద్ర కేబినెట్ బెర్త్ అన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. 

అదలా ఉండగా నాగబాబు ప్రస్తుతం తన దృష్టినంతా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంపై కేంద్రీకృతం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఎచ్చెర్ల వేదికగా నాగబాబు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయన వచ్చే ఎన్నికలలో అంటే 2029 ఎన్నికలలో ఎచ్చెర్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారన్న ప్రచారం జనసేన వర్గాలలో జోరుగా సాగుతోంది. ప్రస్తత టర్మ్ లో ఆయన ఏపీ కేబినెట్ లో చేరుతారా? లేక రాజ్యసభకు వెళ్లి కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కించుకుంటారా? అన్న చర్చల నడుమ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎచ్చర్ల నుంచి పోటీ అంటూ జరుగుతున్న ప్రచారం నాగబాబు రాజకీయ అడుగులు ఎటు పడుతున్నాయన్న ప్రశ్నకు తావిస్తోంది. ఎచ్చర్లలో కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటంతో ఆయన ఎచ్చర్ల వైపు మొగ్గు చూపుతున్నారని భావించినా.. ప్రస్తతం ఎచ్చర్లలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ ఆ సీటును నాగబాబు కోసం త్యాగం చేస్తుందా? అంటే అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు.

ఈ నేపథ్యంలో నాగబాబు ఒకే సమయంలో  మూడు రకాల ప్రయత్నాలు చేయడం ఆయనలోని కన్ఫ్యూజన్ ను బయటపెట్టడమే కాకుండా జనసేన వర్గాలను కూడా అయోమయానికి గురి చేస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తం మీద నాగబాబు ది రాజకీయ వ్యూహమా లేక అయోమయమా? అన్నది కాలమే నిర్ణయిస్తుందని జనసేన వర్గీయులే అంటున్నారు. 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.