Publish Date:Jul 19, 2025
వైసీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీ ఆదివారం ( జులై 20) సత్తెన పల్లి పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసు నిబంధనలను ఉల్లంఘించి మరీ జన సమీకరణ చేశారనే ఆరోపణలపై విడదల రజినిపై సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించే పోలీసులు రజనీకి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల మేరకు ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంది.
జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఆయన కారు కింద పడి ఒక వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున జనసమీకరణ చేయడం ద్వారా ప్రజల ఆస్తులకు నష్టం కూడా వాటిల్లిందని పేర్కొంటూ.. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి పోలీసులు మొత్తం 113 మంది వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలా నోటీసులు అందుకున్న వారిలో పలువురు ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు విడదల రజనీ వంతు వచ్చింది. ముందుముందు మరింత మందిని పోలీసులు విచారించే అవకాశం ఉంది. వరుస కేసులు అరెస్టులతో వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రభయాందోళనలకు గురౌతున్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టు జరిగింది. ఇప్పుడిక విడదల రజని వంతు వచ్చిందన్న అభిప్రాయం వైసీపీ శ్రేణులలోనే వ్యక్తం అవుతోంది.
విడదల రజనీపై జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నిబంధనల ఉల్లంఘన కేసు మాత్రమే కాకుండా పలు అవినీతి కేసులు కూడా ఉన్నాయి. పల్నాడు జిల్లా యడ్లపాడులో స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2 కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేశారనే కేసులో ఇప్పటికే విడదల రజిని మరిదిని పోలీసులు అరెస్టు చేశారు. ఆరోపణలపై ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు ఈ కేసులో విడదల రజని, అప్పటి విజిలెన్స్ అధికారి జాషువా, రజిని పీఏ రామకృష్ణలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో రెంటపాళ్ల కేసులో రజనీని అరెస్టు చేయడం అంటూ జరిగితే.. వరుస పీటీవారెంట్లతో ఆమె సుదీర్ఘకాలం కటకటాల వెనుకే ఉండేలా పోలీసులు వ్యూహాత్మకంగా సాగుతున్నారని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/now-it-is-vidadala-rajini-turn-39-202311.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.