Publish Date:Jul 19, 2025
తెలంగాణ బీజేపీ అంతర్గత కుమ్యులాటలు, గ్రూపు రాజకీయాల విషయంలో కాంగ్రెస్ తో పోటీ పడుతోందా? అంటే పరిశీలకుల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. మరీ ముఖ్యంగా పార్టీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడి నియామకం తరువాత నుంచి తెలంగాణ బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఆ పార్టీకి హ్యాట్రిక్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. ఈటల రాజేందర్ తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులు, పరిణామాలూ చూస్తుంటే.. పార్టీ అధిష్ఠానమే రాష్ట్రంలో పార్టీని పతనం దిశగా నడిపిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయన్న చర్చ పార్టీ శ్రేణుల్లోనే నడుస్తోంది.
తాజాగా ఈటల రాజేందర్ ఓపెన్ అప్ అయిపోయారు. సొంత పార్టీ వాళ్లే తనను వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రాజేందర్ అన్న మాటేమిటి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకాన్ని పార్టీ హైకమాండ్ ప్రకటించిన క్షణం నుంచీ బీజేపీలో ఆసంతృప్తి జ్వాల భగ్గుమంది. ఆ పదవిని ఆశించిన బీజేపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు మీ గుప్పిస్తున్నారు. రాజాసింగ్ పార్టీ తాజా మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపైనా, ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ పైనా ప్రత్యక్ష, పరోక్ష విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
తాజాగా ఈటల రాజేందర్ తన నివాసంలో నిర్వహించిన బీజేపీ హుజూరాబాద్ కార్యకర్తల సమావేశంలో పేరు ప్రస్తావించకుండా కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో తనను హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఓడించేందుకు సొంత పార్టీ వారే కుట్రలు పన్నారన్నారు. అప్పట్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి అసలు క్యాడరేలేదని గుర్తు చేశారు. వారి ప్రయత్నాలు ఫలించి హుజూరాబాద్ నుంచి అప్పట్లో తాను ఓడిపోయాననీ, అయితే ప్రజల మనస్సులను గెలుచుకుని మల్కాజ్ గిరి ఎంపీగా విజయం సాధించాననీ చెప్పుకొచ్చారు. తాను ఎన్నడూ వ్యక్తులను నమ్ముకుని, వారిపై ఆధారపడలేదనీ, ప్రజలను నమ్ముకునే ప్రజాజీవితంలో సాగుతున్నానని చెప్పుకున్న ఈటల.. వారిని కూడా తనకు దూరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారనీ, ఇక ఎంత మాత్రం సహించేది లేదని హెచ్చరించారు.
తనపైనా.. తన కుటుంబంపైనా సామాజిక మాధ్యమంలో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారన్నారు. తాను పదవుల కోసం వెంపర్లాడలేనీ, వాటి కోసం పార్టీలు మారలేదనీ చెప్పిన ఈటల గతంలో తాను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా అప్పటి సీఎం కేసీఆర్ కు తన నిర్ణయాలను నిర్మొహమాటంగా చెప్పానని గుర్తు చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నిటినీ హై కమాండ్ దృష్టికి తీసుకువెడుతున్నానని ఈటల చెప్పారు. ఈటల ఎక్కడా నేరుగా బండి సంజయ్ పేరు ప్రస్తావించకపోయినా.. ఆయన విమర్శల దాడి నేరుగా బండిపైనేనని అర్ధమౌతూనే ఉంది. ఎందుకంటే ఇటీవల బండి సంజయ్ కూడా ఈటల టార్గెట్ గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలలో తనకు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓట్లు పడకుండా కుట్ర జరిగిందని రెండు రోజుల కిందట బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీలో వర్గాలు ఉండవనీ, ఉండేది ఒకే వర్గం, అది మోడీ వర్గమని బండి రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ఈటల బదులిచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/internal-fight-openup-in-telangana-congress-39-202309.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.