ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంతు.. తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమా?

Publish Date:Nov 8, 2022

Advertisement

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు శాసనసభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. సరే ఆ మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే కొత్త రికార్డులు సృష్టించింది.

ఎన్నికల వ్యయంలో కానీ, పోలింగ్ శాతంలో కానీ గత రికార్డులను బద్దలు కొట్టేసింది.  బీజేపీ, టీఆర్ఎస్ లు సొమ్ము వెదజల్లి మరీ గెలుపు ధీమాను ప్రదర్శించడంలో పోటీలు పడ్డారు. కానీ చివరాఖరికి తెరాస బీజేపీపై పై చేయి సాధించి మునుగోడు ఉప ఎన్నికలో తెరాస విజయం సాధించింది.

సరే మునుగోడులో నైతిక విజయం మాదేనని బీజేపీ చెప్పుకుంటోంది. అది వేరే సంగతి. తెరాస విజయానికి కమ్యూనిస్టులతో  పొత్తే తెరాస విజయానికి కారణమని బీజేపీ అంటోంది. వంద మంది ఎమ్మెల్యేలు, నాయకులను మోహరించి మునుగోడును ఒక విధంగా అష్టదిగ్బంధనం చేసేసి విపక్షాలను ప్రచారం చేసుకోనీయకుండా పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి సాధించిన ఈ విజయం తెరాసకు వాపే కానీ బలుపు కాదని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.

అదంతా పక్కన పెడితే..  బీజేపీ మాత్రం మునుగోడులో తనకు ఓటు బ్యాంకు బాగా పెరిగిందని సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇదే ఊపుతో మరో ఉప ఎన్నికకు తెరతీయడానికి అప్పుడే తెరవేనుక ప్రయత్నాలు మొదలెట్టేసిందని పరిశీలకులు అంటున్నారు. ఈ సారి అసెంబ్లీకి కాకుండా పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చేలా ప్రణాళిక రూపొందించిందని చెబుతున్నారు.

ఈ సారి నల్గొండ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేత రాజీనామా చేయించి నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చేలా ప్రణాళిక రూపొందించిందంటున్నారు. ఇందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సై అన్నారనీ, త్వరలో ఆయన రాజీనామా చేయడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంత భారీ ఎత్తున ఖర్చు పెట్టిన బీజేపీ, టీఆర్ఎస్ లు నల్గొండ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తే ఇక ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగళూరుకు చేరుకోవడంతో యలహంక ప్యాలెస్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగంలో లోతైన సాంకేతిక నైపుణ్యం కలిగిన నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
మత్తుపదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నషా ముక్త్ భారత్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని సినీ నటుడు ప్రభాస్‌ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆహ్వానించారు.
ఇద్దరు ఆడపిల్లలు పుట్టారన్న కారణంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు.
అంతర్జాతీయ దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు ఇటీవల గణనీయంగా పడిపోవడంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారుల్లో తీవ్ర చర్చ మొదలైంది.
బుల్లితెర ప్రేక్షకులను నవ్వించే జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, రైజింగ్ రాజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
బంగారం ధరలు భారీగా పడిపోవడంపై ఢిల్లీకి చెందిన చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపింది.
తాళి కట్టిన 24 గంటల్లోనే బిడ్డకు జన్మ..అసలు కథేంటి.?
సర్వదర్శనానికి 8 గంటల సమయం.!
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.