ధర్మవరం వాసిపై దేశద్రోహం కేసు నమోదు.. జైషే మహ్మద్‌తో లింకులు
Publish Date:Aug 16, 2025
Advertisement
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్‌పై పోలీసులు దేశద్రోహం కేసునమోదు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఈ ఉదయం అతడిని అదుపులోకి తీసుకున్నారు. 29 ఉగ్ర సంస్థలతో మహమ్మద్‌కు సంబంధాలు ఉన్నట్లు విచారణలో ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. మరోవైపు ధర్మవరం టెన్ పోలీసు స్టేషన్‌లో పరిధిలోని ఎర్రగుంట్లు వాసి రియాజ్ నో ఇండియా ఐ లవ్ పాకిస్థాన్ అని వాట్సాప్ స్టేటస్ పెట్టగా అతడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నూర్ మహమ్మద్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఐబీ అధికారులు గుర్తించారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో నూర్ మహమ్మద్ క్రియాశీల వ్యక్తిగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఓ హోటల్ లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్.. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఎన్ఐఏ పేర్కొన్నాది.నూర్ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. జైషే మహ్మద్ సంస్థకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో నూర్ మెంబర్‌గా ఉన్నాడని, అందులోని నెంబర్లకు ఇతని నుంచి వాట్సాప్ కాల్స్ వెళ్లాయని.. ముస్లిం యువతను ఉగ్ర సంస్థ వైపు మళ్లించేలా అందులో వ్యాఖ్యలు సైతం చేశాడని నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ క్రమంలో.. అతని వ్యక్తిగత వివరాల గురించి ఐబీ, ఎన్‌ఐఏ వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే.. నూర్ వ్యవహారంపై డీఎస్పీ నరసింగప్పకు మీడియాకు కొన్ని విషయాలు తెలియజేశారు. ‘‘నూర్‌ను లోకల్ పోలీసులే మొదట అరెస్ట్ చేశారు. నిషేధిత ఉగ్రసంస్థలకు చెందిన గ్రూపుల్లో అతను సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించాం. కొన్ని సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నాం. అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నాం’’ అని అన్నారాయన. ధర్మవరంలో ఉగ్రకదలికలు వెలుగు చూడడంతో స్థానికంగా కలకలం రేగింది. కోట ఏరియాలో ఉంటున్న నూర్ నివాసంలో ఎన్‌ఐఏ సోదాలతో అంతా ఉలిక్కిపడ్డారు. ఓ హోటల్‌లో అతను వంట మనిషిగా పని చేస్తున్నట్లు సమాచారం. నూర్ నివాసంలోనూ సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ అధికారులు.. 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతన్ని రహస్య ప్రదేశంలో విచారణ జరుపుతున్నారు.
http://www.teluguone.com/news/content/noor-mohammed-39-204381.html





