Publish Date:Feb 19, 2025
కొడాలి నాని పరిస్థితి చూస్తుంటే ఆయనపై పగవారికి కూడా జాలి వేసేలా ఉంది. లోపల అరెస్టు భయంతో వణికిపోతూ కూడా పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. రెడ్ బుక్ భయం లోపలలోపల తొలిచేస్తుంటే.. పైకి మాత్రం తాను రెడ్డ బుక్ ను చూడలేదనీ, అసలెవరైనా చూశారా అని ప్రశ్నలు వేస్తున్నారు. అసలు గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ పరాజయం పాలైన తరువాత నుంచీ కొడాలి నాని పెద్దగా బయట కనిపించింది లేదు. వినిపించింది లేదు.
వైసీపీ అధికారంలో ఉండగా నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా బూతులతో చెలరేగిపోయిన కొడాలి నాని.. వైసీపీ ఓటమి తరువాత బయట కనబడటం తగ్గింది. అంతే కాదు, భాష మారింది. పొల్లు మాట మాట్లాడడానికే జంకుతున్నారు. ఇక వల్లభనేని వంశీ అరెస్టు తరువాత కొడాలి నాని పూర్తిగా అజ్ణాతంలోకి వెళ్లిపోయారన్న ప్రచారం జరిగింది. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి మరీ ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. అయితే జగన్ విజయవాడ సబ్ జైలులో వల్లభనేని వంశీ తో ములాఖత్ సందర్భంగా అనివార్యంగా బయటకు వచ్చారు. జగన్ తో పాటు జైలు వద్ద మీడియాకు కనిపించారు. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉండగా మీడియా ముందుకు వచ్చిన ప్రతి సారీ చంద్రబాబుపైనా, నారా లోకేష్‌పైనా అనుచిత భాషాప్రయోగంతో ఇష్టారీతిగా మాట్లాడే వంశీ ఇప్పుడు మాత్రం అచితీచి మాట్లాడుతున్నారు.
వంశీ అరెస్టును అరెస్టుగానే చూస్తున్నాన్నారు. తాన మౌనానికి కారణం జనం తన ఉద్యోగం ఊడగొట్టడమే అని చెప్పుకున్నారు. అరెస్టులకు భయపడేది లేదు, రెడ్ బుక్ చూడలేదు అంటూ ఒకింత గంభీరంగా మాట్లాడినా, ఆయన భాష, బాడీ లాంగ్వేజ్ మాత్రం కొడాలి నాని అరెస్టు భయంతో వణికిపోతున్నారన్న సంగతిని తేటతెల్లం చేసింది. మూడు కాదు ముఫ్పై కేసులు పెట్టుకున్న పట్టించుకోనంటూ చేసిన వ్యాఖ్యల్లో కనిపిస్తున్నది తెచ్చిపెట్టుకున్న ధైర్యం మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nodalinanishiwer-with-fear-39-193092.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.