మూడో ఫ్రంట్ ముచ్చటే లేదు తెరపైకి మళ్ళీ పీకే

Publish Date:Apr 30, 2022

Advertisement

తిరిగే కాలు, తిట్టే నోరు ఉరుకోవు. ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్. (పీకే)కూడా అంతే. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యాన్మాయ రాజకీయ కూటమి ఏర్పాటు ప్రయత్నాలలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఆయన వెనకడుగు వేయరు. నిజానికి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పీకే, ‘ఎన్నికల వ్యూహ కర్త’ అవతారం చాలిస్తున్నానని ప్రకటించారు.అలాగే, ప్రత్యక్ష రాజకీయాలకు తాను పనికి రానని, ఆయనకు ఆయనే, ‘ఐ యామే ఫెయిల్డ్ పొలిటీషియన్’ అని ప్రకటించుకున్నారు. 
అయితే, ఆ తర్వాత ఆయన,ఆ విషయమే మరిచి పోయారు. ఏ పార్టీ పిలిచి బొట్టు పెట్టక పోయినా, ఆయనంతట ఆయనగానే బీజేపీ యేతర పార్టీల కూటమి ఏర్పాటు కోసం నడుం బిగించారు. మమత, శరద్ పవార్, స్టాలిన్, కేసీఆర్, ఇలా బీజేపీ వ్యతిరేక శక్తులు అన్నిటినీ ఏకం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తునే ఉన్నారు.ఈ ప్రయత్నాలలో వడిదుడుకులు ఎదురైనా, ఎదురు దెబ్బలు తగిలినా పట్టించుకునేదే’ లే .. అంటూ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వ్యూహాలను మారుస్తూ ముందుకు సాగుతూనే ఉన్నారు. ఇందులో భాగంగానే, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమై చర్చలు సాగించారు. దేశంలో వారం రోజుల పాటు హల్  చల్ సృష్టించారు. అయితే, చివరకు పీకే కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన నుంచి వెనకడుగు వేశారు. అయినా, అక్కడితో కథ ముగిసి పోలేదు. 
ఇప్పుడు మళ్ళీ పీకే బీజేపీ వ్యతిరేక కూటమి గురించి, కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి కాంగ్రెస్ ఒక్కటే ప్రత్యాన్మాయం. థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్’కు  ఛాన్స్ లేదు. బీజేపీని ఓడించాలంటే, కాంగ్రెస్’తో జట్టు కట్టడం మినహా, తెరాస, తృణమూల్ వంటి ప్రాంతీయ పార్టీలకు మరో దారి లేదని తేల్చి చెప్పారు.  ఒక టీవీ చానల్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన ఇదే విషయాన్ని కుండ బద్దలు కొట్టారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారధ్యంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారా, అన్న ప్రశ్నకు పీకే, దేశంలో మూడు, నాలుగు ఫ్రంట్లతో ప్రయోజనం లేదని, స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా గెలిచినా గెలవకున్నా, ఉనికి ఉన్న, బీజేపీ యేతర పార్టీ కాంగ్రెస్ ఒక్కటే, సో.. బీజేపీకి కాంగ్రెస్ సారధ్యంలో కూటమి మాత్రమే ప్రత్యాన్మాయం అవుతుందని, శషబిశాలు లేకుండా స్పష్టం చేశారు. 
దేశంలో మూడో ఫ్రంట్ లేదా నాలుగో ఫ్రంట్ ఎన్నికల్లో విజయం సాధించగలదని తాను ఎప్పుడూ నమ్మలేదని, బీజేపీని మొదటి ఫ్రంట్‌గా పరిగణిస్తే.. ఆ పార్టీని ఓడించాలంటే రెండో ఫ్రంట్ కావాల్సిందేనని, ఏ పార్టీ అయినా బీజేపీని ఓడించాలనుకుంటే.. రెండవ ఫ్రంట్‌గా ఆవిర్భవించాలంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను సెకండ్‌ ఫ్రంట్‌గా భావిస్తున్నారా అని ఆయన్ను ప్రశ్నించగా.. దేశంలోనే రెండో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్‌ అని అన్నారు. కాంగ్రెస్ సారధ్యంలోనే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తపరిచారు. 
ఈ  నేపధ్యంలో తెలంగాణలో బీజీపే అధికారంలోకి రాకుండా అడ్డు కునేందుకు, తెరాస, కాంగ్రెస్ తో జట్టు కట్టాలని పీకే చెప్పకనే చెప్పినట్లు అయిందని పరిశీలకు బావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లేదా ఎన్నికల తర్వాత అయినా, తెరాస, కాంగ్రెస్ జట్టు కట్టే అవకాశాలను ఇప్పటికీ కొట్టి వేయలేమని విశ్లేషకులు అంటున్నారు. అందుకే, ముఖ్యమంత్రి కేసేఆర్ కూడా థర్డ్ ఫ్రంట్ ఆలోచను అటక ఎక్కించారని విశ్లేషకులు అంటున్నారు. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం, తెరాసతో కలిసేదే లేదని అంటున్నారు. మరో వంక బీజేపీ నాయకులు కోతికి కొబ్బరి కాయ దొరికింది అన్నట్లుగా, పీకే  వ్యాఖ్యలను పట్టుకుని, తెరాస ప్రభుత్వ వ్యతిరేక ఓటును కొల్ల గొట్టేందుకు,  కాంగ్రెస్, తెరాస పార్టీలు ఒకే నాణ్యానికి రెండు పక్కలని ప్రచారం చేస్తున్నారు. అయితే, ఎన్నికలకు ఇంకా చాల సమయం వుంది కాబట్టి, రేపు ఏమి జరుగుతుంది అనేది, ఇప్పుడే ఉహించలేమని పరిశీలకులు అంటున్నారు. నిజం. రాజకీయాలలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చును.

By
en-us Political News

  
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.